శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 03:21:20

పిల్లలమర్రికి గ్లూకోజెక్కింది!

పిల్లలమర్రికి గ్లూకోజెక్కింది!

అది 700 ఏండ్ల చరిత్ర కలిగిన చెట్టు. పేరు పిల్లలమర్రి. మహబూబ్‌నగర్‌ పట్టణ సమీపంలో మూడున్నర ఎకరాల్లో విస్తరించింది. దేశంలోనే మూడో అతిపెద్ద మర్రిమాను. అలాంటి మహా వృక్షానికి చెదలు పట్టింది. ఫంగస్‌తో ఊడలు ఎక్కడికక్కడ ఎండిపోయి తెగిపోయాయి. కొమ్మలు విరిగిపోయాయి. పిల్లలమర్రి ఎక్కడ నేలమట్టం అవుతుందోనని అధికారులు ఆందోళనకు గురయ్యారు. మనోరంజన్‌ భాంజా అనే నిపుణుడి సూచనలు  పాటించి పిల్లలమర్రికి ప్రాణం పోశారు. చెదలు.. ఫంగస్‌ను పూర్తిగా తొలగించేందుకు క్లోరోపైరిఫాస్‌ స్ప్రే చేశారు. కొమ్మలకు నాలుగు అంగుళాల మేర రంధ్రం చేసి క్లోరోపైరిఫాస్‌ను స్లైన్‌ అందించారు. విరిగిపోయిన పెద్ద కొమ్మకు సిమెంటు దిమ్మె ద్వారా సపోర్ట్‌ అందించారు. ఇలా ఏడాదిపాటు సపర్యలు చేశారు. ప్రస్తుతం పంచగవ్య.. క్యూబిక్‌ యాసిడ్‌ పిచికారి చేస్తూ పిల్లలమర్రిని సంరక్షిస్తున్నారు. దీంతో చిరుజల్లుల స్పర్శతో లేత చిగురులేస్తూ పిల్లలమర్రి పచ్చని ఆకుతో సరికొత్తగా ముస్తాబై కనిపిస్తున్నది.