బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 02:45:31

బ్రెడ్‌.. భళా!

బ్రెడ్‌.. భళా!

సోడా బ్రెడ్‌

కావాల్సినవి

మైదా : 2 కప్పులు, చక్కెర : ఒక టేబుల్‌స్పూన్‌, బేకింగ్‌ సోడా : అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ : అర టీస్పూన్‌, బటర్‌ : ఒక టీస్పూన్‌, మజ్జిగ : ఒక కప్పు, ఉప్పు : తగినంత.

తయారీ:  ఒక గిన్నెలో మైదా, చక్కెర, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌ వేసి బాగా కలుపాలి. ఇందులోనే బటర్‌, ఉప్పు వేయాలి. ఆ తర్వాత మజ్జిగ పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. ఇప్పుడు సిలికాన్‌ ట్రేలో కొంత మైదా వేసి డస్టింగ్‌ చేసుకోవాలి. దీంట్లో మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పోయాలి. ఓవెన్‌లో పెట్టి 180 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. ఓవెన్‌ లేని వాళ్లు ఒక గిన్నెని వేడి చేసి కూడా ఈ ట్రేని ఉంచి కనీసం గంటపాటు సన్నని మంటమీద బేక్‌ చేయొచ్చు. కట్‌ చేసి మనకు నచ్చినట్లు టీతో కానీ, మామూలుగా కానీ తినేయొచ్చు.

బనానా బ్రెడ్‌

కావాల్సినవి

అరటిపండ్లు : 3, బ్రౌన్‌ షుగర్‌ : ఒక కప్పు, నూనె : అర కప్పు, కొబ్బరి నూనె : అర కప్పు, వెనీలా ఎసెన్స్‌ : ఒక టీస్పూన్‌, గోధుమ పిండి : 1 1/2 కప్పులు, బేకింగ్‌ సోడా : అర టీస్పూన్‌, బేకింగ్‌ పౌడర్‌ : అర టీస్పూన్‌, దాల్చిన పొడి : అర టీస్పూన్‌, ఉప్పు : తగినంత.

తయారీ:  ఒక గిన్నెలో అరటి పండు ముక్కులు, బ్రౌన్‌ షుగర్‌ వేసి మాషర్‌తో బాగా గుజ్జులా చేసుకోవాలి. దీంట్లో నూనె, కొబ్బరినూనె, వెనీలా ఎసెన్స్‌ వేసి బాగా కలుపాలి. ఇందులోనే గోధుమపిండి, బేకింగ్‌ సోడా, బేకింగ్‌ పౌడర్‌, దాల్చిన పొడి, ఉప్పు వేసి ఉండలు లేకుండా బాగా కలుపాలి. ఇలా కనీసం ఐదు నిమిషాలు కలిపితే మంచిది. దీన్ని ఒక మౌల్డ్‌ మైదా వేసి ఈ మిశ్రమాన్ని పోయాలి. ఓవెన్‌లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వద్ద 45 నిమిషాల పాటు బేక్‌ చేయాలి. ఈ బ్రెడ్‌ వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.


logo