బుధవారం 12 ఆగస్టు 2020
Sunday - Jul 12, 2020 , 02:40:10

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం...

అనుకున్న పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంటారు. శ్రద్ధ, ఉత్సాహాలతో పనులు చేస్తారు. స్నేహితులు, బంధువులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్తారు.  గౌరవ సన్మానాలు పొందుతారు. ప్రారంభించిన పనులలో అనుకూలత. పనిలో నైపుణ్యం చూపుతారు. అనుకూల ఫలితాలుంటాయి. అధికారుల నుండి ప్రశంసలు అందవచ్చు. ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలు. ఉన్న ఉద్యోగంలో సంతృప్తి. వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన చేస్తారు. ఒప్పందాలు కలిసివస్తాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. పెద్దలనుండి విలువైన సలహాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. 


వృషభం

పనులు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. జాగ్రత్త అవసరం. స్నేహితులు, ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. నలుగురికీ సంతృపినిచ్చే పనులు చేస్తారు.  వస్తువులను కొంటారు. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు. మంచి పేరు,  గౌరవ మర్యాదలు సంపాదిస్తారు. ప్రయత్నం మీద కొన్ని కార్యాలలో తాత్కాలిక విజయం. పనిలో శ్రద్ధ, నైపుణ్యంతో పనులు పూర్తవుతాయి. వారం ప్రారంభంలో, ముగింపులో కలిసివస్తుంది. మధ్యలో వృథాఖర్చులు ఉండవచ్చు. పనిభారం, బాధ్యత పెరుగుతాయి. స్వల్పకాల ప్రయాణం కలిసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. పాత స్నేహితులను కలుసుకోవడం సత్ఫలితాలనిస్తుంది. అధికారుల ఆదరణ లభించవచ్చు.


మిథునం

ఈ వారం గురుగ్రహ మార్పుతో పనులు అనుకూలంగా పూర్తవుతాయి. అష్టమ శని ప్రభావం ఉంటుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటూ ఖర్చులను నియంత్రించుకోవాలి. కొంత సంతోషాలకు ఖర్చు చేస్తారు. విలాస వస్తువులను కొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పూర్వ స్నేహితులకు సహాయం చేస్తారు. అధిక ప్రసంగం అనర్థానికి దారి తీయవచ్చు. మితభాషణతో వివాదాలకు దూరంగా, జాగ్రత్తగా ఉండాలి. భార్యాపిల్లలతో సుఖంగా ఉంటారు. పిల్లల వివాహాది శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి, పనులలో విజయం, రాజకీయ కోర్టు వ్యవహారాలలో ఖర్చులు ఉన్నా ఫలితాలు కలిసి వస్తాయి. సకాల భోజనం అవసరం. చిరుతిండ్లకు దూరంగా ఉండండి. 


కర్కాటకం

వారం మొదట్లో కొంత ఇబ్బంది ఉన్నా తర్వాత కలిసి వస్తుంది. భార్యాపిల్లలతో ఆనందంగా ఉంటారు. మంచి ఆలోచనలతో సుఖమయంగా గడుపుతారు. నలుగురిలో మంచిపేరు వస్తుంది. స్త్రీలకు కలిసివస్తుంది. అప్పులు వసూలై రావలసిన డబ్బు వస్తుంది. రాబడి అనుకూలతతో ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. విలాసవంతమైన జీవితం ఉంటుంది. సంగీత సాహిత్యాలపైన మనసు నిలుపుతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పనిభారం ఉన్నా ఇష్టంతో పనులు చేస్తారు. అకాల భోజనం. తగాదాలు, వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. వ్యాపారాలో సమయస్ఫూర్తి ప్రదర్శిస్తారు. 


సింహం

ప్రారంభంలో ఇబ్బంది ఉన్నా క్రమేపి అన్నీ సర్దుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉల్లాసంతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆదాయం పెరుగుతుంది. పనివారితో ఆనుకూలత. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి మంచి అవకాశం వస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో   పేరుప్రతిష్టలు. అందరితో సత్సంబంధాలు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి.  ప్రారంభించిన పనులు లాభదాయకంగా, సరైన సమయంలో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. నిర్మాణ రంగం, రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ వ్యాపారాల వారికి పనులు అనుకూలంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు వస్తుంది. రాబడి పెరుగుతుంది. 


కన్య

వారం ప్రారంభం, మధ్యలో అనుకూలంగా ఉంటుంది. చిరుతిండ్లకు దూరంగా ఉంటూ, ఆహార నియమాలను పాటించాలి. బంధుమిత్రుల సమాగమం. ఉద్యోగ ప్రయత్నం తాత్కాలికంగా ఫలిస్తుంది. అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. వివాదాలకు దూరంగా ఉండటం ఈ వారం అవసరం. ఆహారం నియమాలను పాటిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉత్సాహంతో, ఉల్లాసంతో పనులు చేస్తారు. వాహన రిపేర్లవల్ల అనుకోకుండా ఖర్చులు ఉండవచ్చు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవకార్యాలు, నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. చదువుపై మనసు నిలపాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. 

తుల

వారం ప్రారంభంలో, మధ్యలో అనుకూలత ఉండి చివరిలో ఖర్చులు ఉంటాయి. ప్రధాన గ్రహాల ప్రతికూల ప్రభావం ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు పొందగలరు. అత్యాశ లేకుండా కనీస లాభంతో వ్యాపారం చేయాలి. పనులను పూర్తి చేయడంపైన మనసు నిలపాలి. సమయానికి తగ్గట్టుగా ఆలోచనలు చేస్తారు. క్రయ విక్రయాలలో అప్రమత్తంగా ఉండాలి. పూర్వం పెట్టిన పెట్టుబడులవల్ల కొంత లాభం రావచ్చు. డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. భార్యాపిల్లలతో ఇంట్లో సంతృప్తిగా ఉంటారు. పెద్దల సూచనలను అనుకూలంగా మలుచుకొంటారు. వాహనాలవల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. పనులు పూర్తవుతాయి. పనిభారం ఉంటుంది. అందరినీ కలుపుకొని పనులు చేయాలి. ఉద్యోగ ప్రయత్నంలో తాత్కాలిక లబ్ది ఉంటుంది. పనులలో పట్టుదల అవసరం. 


వృశ్చికం

 ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్నా క్రమేపీ వారం కలిసి వస్తుంది. మంచిపనుల కోసం ఖర్చులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. చదువులో మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చాలామట్టుకు ఫలిస్తాయి. శ్రద్ధ అవసరం, మంచి ప్రణాళికతో కొత్త పనులు ప్రారంభించడానికి ఈవారం చాలా అనుకూలం. దేవతా గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారితో స్నేహం పెరుగుతుంది. పూర్వ పరిచయస్తులను కలుసుకుంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగివస్తుంది. కొత్తపనుల గురించి ఆలోచిస్తారు. కొత్త వస్తువులను, వస్ర్తాలను కొంటారు. విందులూ వినోదాలకు దూరంగా ఉంటారు. 


ధనుస్సు

సహనం అవసరం. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు సంయమనంతో చేయాలి. అమ్మడం, కొనడంలో ఇబ్బందులు వుండవచ్చు. ప్రారంభించిన పనులలో ఆలస్యం జరగవచ్చు. శ్రద్ధతో శ్రమించి పనులు చేయడం ఈ వారం చాలా అవసరం. వృథా కాలయాపనలు ఉండవచ్చు. అనవసర చర్చలకు స్వస్తి పలకాలి. విందులూ వినోదాల వల్ల ఇబ్బందులు వుండవచ్చు. ప్రతికూలంగా గ్రహాలు సంచరిస్తున్నాయి. కొత్త పనులు ఏవీ ప్రారంభించకుండా పాతవి పూర్తి చేయడం ఈ వారం చాలా అవసరం. పనులలో ఆలస్యంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. వృథా ఖర్చులు అధికం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. దైవ చింతనలో కాలం గడపాలి. 


మకరం

వృత్తి వ్యాపారాలు తాత్కాలికంగా కలిసి వస్తాయి. గతంలోని పెట్టుబడుల నుంచి లాభాలు. క్రయవిక్రయాల వల్ల రాబడి. ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటారు. పెద్దల సూచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. వృథా ఖర్చులు ఉండవచ్చు. ప్రయోజనాలు ఉంటాయి. నిర్ణయాలలో భార్యాపిల్లలు, కుటుంబసభ్యుల పాత్ర సంతృప్తినిస్తుంది. అందరినీ కలుపుకొని పనులు చేస్తారు. దీర్ఘకాలిక పనులలో ఆలస్యం ఉండవచ్చు. తాత్కాలిక ఫలితాలను ఇచ్చే పనులపైన మనసు నిల్పి శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను పొందుతారు. పనిభారంతో కొంత ఇబ్బంది ఉన్నా పూర్తవుతాయి. అందరితో స్నేహంగా ఉంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. 


కుంభం

వివాహాది శుభకార్యాలు, వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగం లభిస్తుంది. ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ, పొదుపు అవసరం. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉపకారం చేసే మనస్తత్వం అవసరం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. విషయాలపై అవగాహన పెంచుకుంటారు. పెద్దల సలహాలను పాటిస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. శ్రమ, ఖర్చు ఉన్నా పనులలో ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంగీత సాహిత్యాలపైనా శ్రద్ధ నిలుపుతారు. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. వృథా ఖర్చులు వాయిదా వేసుకోవడం మంచిది. వారం ప్రారంభంలో, చివర ఆహారం- ఆరోగ్యాలపై శ్రద్ధ అవసరం. ఉన్నత విద్యకు అనుకూలం. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. పై వారినుంచీ ప్రశంసలు రావచ్చు. 

మీనం

శుభప్రదంగా ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. తలపెట్టిన పనులు అభివృద్ధిలోకి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మిత్రుల్లా నటించే వారితో జాగ్రత్త అవసరం. జీవన శైలిలో మార్పు, ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. సామాజిక గౌరవం, సముచిత స్థానం లభిస్తుంది. ఆనందానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆస్తి తగాదాలలో విజయం సిద్ధిస్తుంది. వ్యాపార పరంగా రావలసిన వారినుండి డబ్బు వస్తుంది. క్రయవిక్రయాల వల్ల ధనప్రాప్తి, సంతోషంగా సమయం గడుపుతారు. పథక రచన, ప్రణాళికలతో కార్యసిద్ధి, బంధుమిత్రులకు సహాయం చేస్తారు. కోరికలు నెరవేరుతాయి. వివాహం, చదువు, ఉద్యోగం, వ్యాపార ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 


logo