శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 23:18:30

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!

ఔదార్యం చూపారు..

‘కొవిడ్‌ -19’పై పోరాడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి జీ తెలుగు స్ఫూర్తి పొందింది. తన వంతుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ప్రభుత్వానికి నాలుగువేల పీపీఈ కిట్లు, పదహారు అంబులెన్స్‌లు అందజేయనున్నట్టు జీ తెలుగు బిజినెస్‌ హెడ్‌ అనురాధ గూడూరు, సీనియర్‌ హెచ్‌ ఆర్‌ బిజినెస్‌ పార్టనర్‌ - సౌత్‌, శ్రీధర్‌ మూలగడ తెలిపారు. ఈక్రమంలో జీ తెలుగు ప్రయత్నాలను ట్విటర్‌ సాక్షిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ జీ నెట్‌వర్క్‌ అనేక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. జీ తెలుగులో ప్రసారమయ్యే పదహారు కార్యక్రమాల ద్వారా రూ.35 లక్షలను దాదాపు 400 కుటుంబాలకు అందించింది. టీవీ కార్మికుల కోసం జీ తెలుగు, జీ సినిమా ఉద్యోగులు రూ.1,50,000 విరాళంగా అందించారు.

కొత్త లుక్‌ అదుర్స్‌!


జబర్దస్త్‌ నుంచి అనసూయ, రష్మీ తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలు తప్పు అని గతవారం ఎపిసోడ్లు నిరూపించాయి. అయితే ఇందులో అనసూయ లుక్‌ను చూసి అందరూ ఔరా అంటున్నారు. దీనికి సంబంధించి సోషల్‌ మీడియాలో ముందే ఒక పోస్ట్‌ పెట్టింది అనసూయ. భుజాల వరకు జుట్టును కట్‌ చేసి, దానిని ఉంగరాలు తిప్పి, బ్రౌన్‌ కలర్‌ వేసి అచ్చు హలీవుడ్‌ హీరోయిన్‌లా మెరిసిపోయింది. ఇలా అని చాలామంది ఆ ఫొటోకి కామెంట్‌ పెట్టారు కూడా. కొందరైతే జేమ్స్‌బాండ్‌ హీరోయినా? అంటూ మెసేజ్‌ చేశారు. అనసూయను ఇలా తయారుచేసింది సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ అండ్‌ మేకప్‌ ఆర్టిస్ట్‌ సచిన్‌ డకోజీ. తనను తాను కొత్తగా చూపించుకోవడం అంటే చాలా ఇష్టమని, తనను ఇలా చూపించిన సచిన్‌ డకోజీకి అనసూయ కృతజ్ఞతలు తెలిపింది.

తప్పు తప్పే!


ఎన్నో సీరియల్స్‌, మరెన్నో సినిమాలు చేశాడు కౌశల్‌. కానీ స్టార్‌ మాలో వచ్చిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 2’తో తెగ పాపులర్‌ అయ్యాడు. ఆయనకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా మొదలైంది. ఆ తర్వాత అనేక ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాయికాట్‌ చైనా ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే కదా! దీన్ని ఒక వింతైన రీతిలో చేయాలనుకున్న కౌశల్‌, సమస్యను కొని తెచ్చుకున్నాడు. కౌశల్‌ మండాకు బిగ్‌ బాస్‌ హౌస్‌లో ఉన్నప్పుడు ఒప్పో ఫోన్‌ గిఫ్ట్‌గా వచ్చింది. అప్పటినుండి దాన్ని వాడుతూ వస్తున్న కౌశల్‌, ఇప్పుడు చైనా ఉత్పత్తులను బాయి కాట్‌ చేస్తున్నానంటూ ఆ ఫోన్‌ను నేలకేసి బాదాడు. ఆ తర్వాత విరిగిన ఫోన్‌ను అక్కడే ఉన్న డస్ట్‌ బిన్‌లో పడేశాడు. దీనిపై ఇప్పుడు ఓ రేంజ్‌లో ట్రోలింగ్స్‌ ఎదుర్కొంటున్నాడు. బాయి కాట్‌ చైనా అంటే చైనా వస్తువులు కొనకుండా ఉండటమని, అంతేకాని ఉన్న వస్తువులను పాడు చేసుకోమని కాదంటూ చాలామంది కామెంట్‌ చేశారు. తన ఫోన్‌ పగలగొట్టడం ద్వారా చైనా ఉత్పత్తిదారులకు వచ్చిన నష్టమేమీ ఉండదంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

రేటింగ్‌లో టాప్‌!


తెలుగు వెబ్‌సిరీస్‌కి మంచి కాలం వచ్చినట్టుంది. వీటికి కూడా ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఇచ్చేస్తున్నది. ఇప్పటివరకు హిందీ సిరీస్‌లకే ఈ పరంపర ఉండేది. మొదటిసారిగా ఆహా యాప్‌లో ఉన్న ‘సిన్‌' అనే సిరీస్‌కి ఈ ఘనత దక్కింది. కాస్త అడల్ట్‌ కంటెంట్‌తో వచ్చిన ఈ సిరీస్‌కి మొత్తానికి మంచి మార్కులే పడుతున్నాయి. వెండితెర మీద ఇలాంటి కంటెంట్‌ చూపించేందుకు భయపడే తరుణంలో ఒక వెబ్‌సిరీస్‌లో అలాంటి ఇతివృత్తాన్ని తీసుకొని సక్సెస్‌ అయ్యాడు దర్శకుడు నవీన్‌ మేడారం. కొన్ని మూఢనమ్మకాలు, కొంత అభద్రతాభావంతో కూడిన మనుషుల మధ్య ఒక అమ్మాయి పడే అవస్థను కండ్లకు కట్టినట్టు చూపించారు. పద్దెనిమిది నిండిన వాళ్లే ఈ సిరీస్‌ చూడటానికి అర్హులు. 


logo