ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 23:04:54

పే..ద్ద బండ కింద ఓ ఊరు..

పే..ద్ద బండ కింద ఓ ఊరు..

హాయ్‌ పిల్లలూ!.. ఊరంటే పచ్చని పొలాలూ, చెట్లూ చేమలూ, రోడ్ల్లూ, ఇండ్లూ ఉంటాయి కదా! ఖాళీ ప్రదేశాల్లో వీటిని నిర్మిస్తేనే ఊరుగా తయారవుతుంది. కానీ స్పెయిన్‌ దేశంలో ఒక గ్రామం ఉన్నది. మొత్తం బండకిందనే ఉంటుంది. అలా ఎలా ఉంటుందని అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి.

స్పెయిన్‌లో  సెటెనిల్‌ డి లాస్‌ బోడెగాస్‌ అనే ఊరు ఉంది. ఇక్కడ ఇండ్లూ, షాపులూ, రోడ్లూ, హోటళ్లూ అన్నీ  ఒక పే.....ద్ద బండకిందనే ఉంటాయి. శిల కింద ఉన్న ఈ గ్రామంలో సుమారు మూడు వేల మంది వరకూ నివాసం ఉంటున్నారు.  రియోట్రెజో అనే నది పక్కన ఈ ఊరు ఉన్నది. ఇది చారిత్రక ప్రదేశమని ఇక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. నిజానికి ఈ శిల ఒక గుహలా ఉంటుంది. సహజ సిద్ధంగా ఏర్పడ్డ  గుహలో ఇండ్లను నిర్మించుకొని ప్రజలు జీవిస్తున్నారు. ఇక్కడ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.  ఈ శిల వేసవిలో ఎండ నుంచి, శీతాకాలంలో చలి నుంచి వాళ్లను రక్షిస్తుంది. గుహ లోపల బండను చెక్కి అవసరమైనట్టుగా ఇంటిని నిర్మించుకున్నారు.  ఈ ఊర్లో స్థానిక ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటారు.  వైన్‌, ఆలివ్‌ అయిల్‌ ఉత్పత్తిలో ఈ ఊరు ప్రసిద్ధి. వారాంతపు మార్కెట్లు, రెస్టారెంట్లు, కెఫేలతో వీధులు సందడిగా ఉంటాయి. 


logo