ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jun 28, 2020 , 00:12:58

చేతులు కడిగే.. జంతువూ ఉంది!

చేతులు కడిగే.. జంతువూ ఉంది!

పిల్లలూ! ఇష్టమైన ఆహారం కనిపిస్తే చాలు జంతువులు వెంటనే తినేస్తాయి కదా! కానీ మనం మాత్రం వాటిని శుభ్రంగా కడుక్కొని తింటాం. అచ్చం మనలాగే ఆహారాన్ని కడుక్కొని తినే జంతువు ఒకటి ఉంది. దాని పేరు ‘రేకూన్‌'. ఇవి దక్షిణ కెనడా నుంచి వచ్చి పనామా అంతటా విస్తరించి ఉన్నాయి. ఎత్తయిన కొండల్లో నివసిస్తాయి.  ఆహారం దొరకగానే కడుక్కొని తింటాయి. కడగడానికి నీరులేక పోతే ఆహారాన్ని మట్టనే ముట్టవు. నీటిలో దొరికిన ఆహారాన్ని కూడా   శుభ్రంగా  కడుగుతాయి. రేకూన్లు పాలిచ్చే జంతువులు. బూడిద రంగులో ఉంటాయి. ఒంటి మీద పచ్చని, గోధుమరంగు మచ్చలు కనిపిస్తాయి.  తోక సుమారు 25 సెంటీమీటర్ల పొడవు ఉండి, వెంట్రుకలు కుచ్చులా ఉంటాయి. వేట కోసం పంజాను ఉపయోగిస్తాయి. బురదలో, మురికినీళ్ళలో ఆహారాన్ని వేటాడుతాయి. వీటి మాంసం, జుట్టు కోసం వేటగాళ్ళు అడవుల బాట పడతారు.logo