గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jun 27, 2020 , 23:42:54

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం: ఈ వారం ప్రారంభం నుంచీ అనుకూలంగా ఉంటుంది. శుభప్రదమైన పనులు జరుగవచ్చు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపారంలో లాభం, ఆదాయం పెరుగుతుంది. సమాజంలో మంచిపేరును పొందుతారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది. ప్రత్యేకంగా స్త్రీలకు ఈ వారం బాగా కలిసివస్తుంది. నెమ్మదిగా ఆలోచించి పనులు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వారాంతంలో అయిష్టంగా పనులు చేయవలసి రావొచ్చు. చిరుతిండ్లు మూలంగా అజీర్ణ వ్యాధికి ఆస్కారం ఉంది. అర్థంలేని విషయాలకు తగాదాలు, ఆర్థిక సమస్యలు, అధికారులతో సమావేశం, ఊహించని ఖర్చులు ఉంటాయి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, వృత్తి, ఉద్యోగ విస్తరణలకు అనుకూలమైన సమయం. ఆస్తుల విషయమై జాగ్రత్త అవసరం. 


వృషభం:  వారం మధ్యలో  పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక సమస్యలతో కొంత ప్రతికూలత ఉండవచ్చును. నియంత్రణతో అన్నింటినీ అధిగమిస్తారు. అనవసరమైన ఖర్చులు ఉండవచ్చును. రావలసిన డబ్బు చేతికి అందకపోవడం, పనుల్లో ఆలస్యం, పనివారితో గొడవ ఇబ్బందిపెడతాయి. విద్యార్థులు చదువుపై మనసుపెట్టి శ్రమించాలి. శుభకార్య ప్రయత్నాలు.. ఆర్థిక సమస్య ఉన్నా పూర్తవుతాయి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. రాజకీయ పనుల్లో జాప్యం, కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది.  


మిథునం : వారం ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉంటూ, క్రమేపీ బాగా కలిసివస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పూర్వం ఉన్న ఆటంకాలు దూరమవుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. శ్రమ అవసరం. వ్యాపార లావాదేవీల్లో పనివారితో ఇబ్బందులు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో పైవారితో అన్యోన్యత పాటిస్తారు. రాజకీయాల్లో  పైవారి ఆదరణ లభిస్తుంది.  తోటి వారితో అభిప్రాయ భేదాలు ఉండవచ్చును. రియల్‌ ఎస్టేట్‌, గృహనిర్మాణ వ్యాపారంలో ఉన్నవారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక, న్యాయ సమస్యలు ఉండవచ్చును. పనులలో ఆలస్యం తప్పదు. మంచి ఆలోచనలు వస్తాయి. ఆలోచనల్ని కార్యరూపంలో పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇతరులకు సహాయ పడతారు. 


కర్కాటకం:  వారం ప్రారంభంలో, చివరలో అనుకూలిస్తుంది. సంతోషంగా ఉంటారు. నిర్భయంగా ఉంటారు. మంచిపేరు వస్తుంది. ఇరుగు పొరుగు వారితో స్నేహం, సలహాలు, సూచనలతో లాభం పొందుతారు. ఉన్నత విద్యకు అనుకూలం. ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు, యత్నిత కార్యాల్లో జయం. గురురాశి మార్పు ప్రభావంతో తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నంలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. సంతృప్తికర ఫలితాలు వస్తాయి. ఆర్థిక ఇబ్బంది మట్టుకు ఉంటుంది. భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రద్ధ, పట్టుదల అవసరం.  ప్రయాణాలు వాయిదా పడతాయి. ఈ వారం మధ్యస్తంగా ఉంటుంది. సింహం:  వారం ప్రారంభంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తి, రాజకీయంలో ఉన్నవారు తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది.  వృత్తి, వ్యాపారాలు కలిసిస్తాయి. నిర్మాణరంగం, రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ వ్యాపారాల్లో ఉన్న వారు డబ్బు విషయమై జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు, బంధువులతో చర్చలు ఫలితాలను ఇస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, వివాహ ప్రయత్నాలకు ఖర్చు పెరగవచ్చును. ఉద్యోగస్తులకు తోటి వారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. సహనంతో పనులు చేస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. పెద్దలను గౌరవిస్తూ వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.


కన్య: వారం ప్రారంభంలో అనుకూలంగా ఉండి, చివరిలో ఖర్చులు ఉండవచ్చును. బంధుమిత్రులతో సామరస్యంగా మెలగడం ముఖ్యం. వివాదాల్లో తల దూర్చకూడదు. కొనుగోళ్లు వాయిదా వేయడం మంచిది. చదువు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రయత్నాలతో ఖర్చులు పెరగవచ్చును. స్థిర, చరాస్తుల కొనుగోలు  వాయిదా వేసుకోవడం జరుగుతుంది. ప్రారంభించిన నిర్మాణ పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. రాజకీయ పరమైన గుర్తింపు పొందుతారు. ఆర్థిక ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. లాభదాయకంగా ఉంటాయి. పనులను ఓపికతో చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. పనుల్లో కదలిక అనుకూల ఫలితాలనిస్తుంది. వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి.  


తుల : వారం ప్రారంభం ప్రతికూలంగా ఉండి క్రమేపీ అనుకూలిస్తుంది. తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడులు పెట్టడం, కొనడం, అమ్మడం.. తదితర లావాదేవీల్లో  జాగ్రత్త వహించాలి. వైద్య, ఇంజినీరింగ్‌ వృత్తిలో వారికి పనిభారం ఉన్ననూ, కొంత కలిసివస్తుంది. నిరుద్యోగులకు తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు పైఅధికారులతో సామరస్యంగా ఉంటే, కార్య సాఫల్యత ఉంటుంది. రాజకీయ, కోర్టు పనుల్లో  వృథా ఖర్చులు ఉంటాయి. రావాల్సిన డబ్బు రాకపోవడం, ఆదాయంలో కోత, ఇబ్బంది పెడతాయి. పని వారితో సామరస్యంగా పనులు చేయించుకోవాలి. గురుభక్తి, దైవభక్తితో ఉంటారు. చిన్న, చిన్న విందులకు హాజరవుతారు. సమావేశాలకు దూరంగా ఉంటారు. భార్యా పిల్లలతో సమయాన్ని హాయిగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. 


వృశ్చికం : వారం మొదట్లో ప్రతికూలంగా ఉండి, క్రమేపీ అనుకూలంగా ఉంటుంది. చదువు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచివారితో పరిచయం వల్ల పనులు నెరవేరుతాయి. భార్యాపిల్లలతో అనవసర విషయాలు చర్చకు రాకుండా జాగ్రత్త పడాలి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి క్రమేపీ కొత్త అవకాశాలు రావచ్చును. ఇంజినీరింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగం పనుల్లో ఆలస్యమైనా ఆర్థికలాభం ఉంటుంది. వ్యవసాయదారులకు రాబడి అనుకూలంగా ఉన్నా, ప్రక్క వారితో ఘర్షణల వాతావరణం ఉంటుంది. ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. ధనుస్సు: గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నది. అన్ని విషయాలలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఇంజినీరింగ్‌, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఇంట్లో అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. ప్రధానగ్రహాలు ప్రతికూలంగా ఉన్నా యి. అన్ని పనులలో ఆలస్యంగా ఫలితాలు. పెద్దల మాట, సూచనలు, సలహాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయ, కోర్టు కేసుల్లో ఒప్పందాలు చేసుకోవడం మంచిది. భూములు, ఆస్తులు క్రయవిక్రయాల్లో అప్రమత్తత అవసరం. లాభాలు ఉంటాయి. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. మంచివారితో స్నేహం మానసిక ప్రశాంతతనిస్తుంది. 


మకరం:  పెట్టిన పెట్టుబడులతో లాభాలు ఉంటాయి.  కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. విద్యార్థులు శ్రమించినా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. సమాజానికి, నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. రావాల్సిన డబ్బు  రాకపోవడం కష్టం కలిగిస్తుంది. ఇరుగు పొరుగు వారితో కలిసి కొన్ని పనులు చేస్తారు. శుభకార్యాల ప్రయత్నాలతో ఖర్చులు, రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల ఫలితాలు ఉంటాయి. దేవతా గురుభక్తి, ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యవసాయదారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 


కుంభం: శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.  విద్యార్థులు శ్రమిస్తే మంచి ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగ ప్రయత్నం లాభిస్తుంది. పెద్దల సూచనలు బాగా ఉపకరిస్తాయి. పనులు పూర్తి చేయడానికి శ్రమ అవసరం. పురాణ, ఇతిహాసాలపై మనసు నిలుపుతారు. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా, హాయిగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆహార, ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం. సహ ఉద్యోగులతో, అధికారులతో సామరస్యంగా ఉండాలి. నిర్మాణరంగం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్నవారు జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. ఆర్థిక సమస్యలు ఉండవచ్చును. అన్నదమ్ములు,స్నేహితులతో సత్సంబంధాలు అవసరం. 


మీనం: ఇతరులపై ఆధారపడకుండా పనులు పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు బాగా కలిసివస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేట్‌ ఉద్యోగస్తులకు కొంత ఇబ్బంది ఉన్ననూ పైచేయి సాధిస్తారు. ఉద్యోగోన్నతి కోసం ప్రయత్నం చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. వాహనాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్త.. తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. 


logo