గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 00:41:38

అన్నీ శుభశకునాలే!

అన్నీ శుభశకునాలే!

షూటింగ్‌లు ప్రారంభం అనేసరికి నటీనటుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది.ఎప్పుడు టేక్‌ చెబితే అప్పుడు నటించేందుకు తారాగణమంతా సిద్ధమవుతున్నది. అన్ని నియమాలూ పాటిస్తూనే సీరియళ్ల చిత్రీకరణ సాగనున్నది.  కొత్త ఎపిసోడ్లు.. సరికొత్త షోలు అభిమానులను అలరించబోతున్నాయి.

పెండ్లికూతురాయెనే.. 

ఈ లాక్‌డౌన్‌ కొందరి జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిలిస్తే.. మరికొందరికి తీయని వేడుకలను అందిస్తున్నది. ప్రతీవారికి జీవితంలో పెండ్లి అనేది కీలక ఘట్టం. దీనికి ఈ లాక్‌డౌన్‌ సమయమే సరైందని భావిస్తున్నారు కొందరు సెలెబ్రిటీలు. ఘనంగా కాకపోయినా.. సంతోషంగా పెండ్లి జరుపుకొన్నామా? లేదా? అంటూ ఒక్కటవుతున్నారు. ఈ లాక్‌డౌన్‌ పెండ్లిళ్ల లిస్ట్‌లో ఇప్పుడు బుల్లితెర హీరోయిన్‌ లతా సంగరాజు చేరిపోయింది. ఈమె తేనె మనసులు, రామాసీత సీరియల్స్‌ ఫేమ్‌. నేత్ర అనే సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. మలయాళం ‘నీలక్కుఇల్‌' అనే షోతో అక్కడి వారికీ దగ్గరయింది. జూన్‌ 4న తన పుట్టిన రోజున ‘ప్రీ వెడ్డింగ్‌ స్టార్ట్‌' అంటూ తనకు కాబోయే వరుడితో ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది. ఈ నెల 14న వివాహం కూడా జరిగింది. 

షూటింగ్‌ షురూ.. 

మా టీవీలో ‘కార్తీక దీపం’ కోసం ప్రేక్షకులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నట్టున్నారు. అందులో వంటలక్కతో పాటు బేబీ సౌర్య అల్లరిని కూడా మిస్‌ అయ్యారంతా. ఒక ఆన్‌లైన్‌ సర్వే ప్రకారం.. ఇతర సీరియల్స్‌తో పోలిస్తే కార్తీకదీపం చూడాలనుకునే వారి సంఖ్య 81 శాతం ఉందట. అందుకే. అందరి నిరీక్షణా ఫలించింది. బేబీ సౌర్య (బేబీ క్రితిక).. ఈ మధ్య ఒక ఫొటో పోస్ట్‌ చేసింది. కరోనా కారణంగా ప్రభుత్వం పెట్టిన షరతుల ప్రకారమే షూటింగ్‌ జరుగుతుందనే విషయం ఈ ఫొటోను చూస్తేనే అర్థమవుతుంది. ‘వావ్‌ కార్తీక దీపం షూటింగ్‌ స్టార్టయిందా.. వెయిటింగ్‌' అని, ‘స్టే సేఫ్‌.. జాగ్రత్త బంగారం’ అంటూ ఈ బుల్లితారకు మెసేజ్‌లు పెడుతున్నారు అభిమానులు. మొత్తానికి మీ అభిమాన సీరియల్‌ని మళ్లీ టీవీలో వీక్షించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయి. కొత్తగా ఉంది.. 

రేణూదేశాయ్‌ నటి నుంచి దర్శకురాలిగా మారింది. ఆ తర్వాత చాలా టీవీ షోల్లోనూ కనిపించి తెలుగుతెరకు తాను దూరం కాలేదని చెబుతూనే ఉంది. ఈ మధ్య ఇన్‌స్టాలో.. ‘జీ తెలుగుతో నా అనుబంధం కొనసాగనుంది. ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. మళ్లీ తెరపై కనిపిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీలవుతున్నా. మళ్లీ ఆ లైన్లు గుర్తు పెట్టుకోవడం పెద్ద టాస్క్‌. అది తలుచుకుంటుంటే కొత్తగా ఉంది’ అంటూ కొన్ని ఫొటోలు జతచేసింది. ‘మళ్లీ మామూలు జీవనానికి అలవాటు పడుతున్న సమయం ఇది. అందరూ జాగ్రత్తగా ఉండాల’ంటూ హితవు పలికింది. మంచి టైంపాస్‌.. 

ఓటీటీలో వెబ్‌సిరీస్‌లు మామూలే. అయితే, తెలుగులో ఈ పంథా కొంత కొత్తగానే సాగుతున్నది. వీఐయూ యాప్‌లో రెండు సంవత్సరాల క్రితం  ‘ఈ ఆఫీస్‌లో’ రిలీజ్‌ అయింది. ఆ సమయంలో దీనికి మంచి ఆదరణ లభించింది. దీనికి సీజన్‌ 2 కూడా జనవరిలోనే వచ్చింది. ఇందులో శ్రద్ధాదాస్‌ కూడా నటించడం విశేషం. ‘ఈ ఆఫీస్‌లో 2.0’ మరింత రిచ్‌గా మంచి కంటెంట్‌తో వచ్చింది. అందుకేనేమో, లాక్‌డౌన్‌ కాలంలో దీన్ని వీక్షించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఒకవేళ సీజన్‌ 1 చూడకపోతే, ఒకేసారి రెండు సీజన్‌లనూ చూసే అవకాశం ఉంది.  logo