బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Jun 20, 2020 , 23:39:49

కరకరలాడే చిప్స్‌!

కరకరలాడే చిప్స్‌!

మాన్‌సూన్‌ అంటేనే మజా.. చినుకులు పడుతుంటే పంటి కింద.. కరకరలాడే చిప్స్‌ కావాలనిపిస్తుంది కదా! ఒక గుక్క  తేనీరు.. చేతివేళ్ల మధ్య చిప్స్‌తో.. ఆ చినుకులను.. ఇటు చిప్స్‌ని ఎంజాయ్‌ చేసేందుకు సిద్ధంకండి.. 

ఆపిల్‌ చిప్స్‌

కావాల్సినవి : ఆపిల్‌ జ్యూస్‌ : 2 కప్పులు, ఆపిల్‌ : 2, దాల్చిన చెక్క : 1

తయారీ :పెద్ద గిన్నెలో ఆపిల్‌ జ్యూస్‌ పోసి అందులో దాల్చినచెక్క వేసి వేడి చేయాలి. ఈలోపు ఆపిల్‌ని గుండ్రంగా తక్కువ మందంతో కట్‌ చేసుకోవాలి.  ముక్కలు అర ఇంచు  మందం కంటే ఎక్కువ ఉండకూడదు. గింజలను కూడా తీసేయాలి. ఈ ఆపిల్‌ ముక్కలను వేడవుతున్న ఆపిల్‌ జ్యూస్‌లో వేయాలి. ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి దించేయాలి. ఇప్పుడు ఆపిల్‌ ముక్కలను ఆ జ్యూస్‌లో నుంచి తీసి కాసేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఓవెన్‌లో పెట్టి 250 డిగ్రీ ఫారన్‌హీట్‌ వద్ద 30నిమిషాల పాటు బేక్‌ చేయాలి. వేడి.. వేడి.. ఆపిల్‌ చిప్స్‌ రెడీ! స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పై నుంచి చాట్‌మసాలా చల్లి ఆరగించొచ్చు. 

చామగడ్డ చిప్స్‌

చామగడ్డలు : పావు కేజీ, కారం : అర టీ స్పూన్‌, ధనియాల పొడి : అర టీస్పూన్‌, జీలకర్ర పొడి : పావు టీస్పూన్‌, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :చామగడ్డలను కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. చల్లారాక పొట్టు తీసి గుండ్రగా, సన్నగా తరుగుకోవాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె బాగా కాగాక చామగడ్డ ముక్కలను బంగారు వర్ణం వచ్చేవరకు వేయించి తీయాలి. ఇలా ముక్కలన్నీ వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి, అన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేయించుకున్న చామగడ్డలపై చల్లి హాట్‌.. హాట్‌గా సర్వ్‌ చేయాలి. logo