సోమవారం 30 నవంబర్ 2020
Sunday - Jun 13, 2020 , 23:23:17

కంకుల రుచులు!

కంకుల రుచులు!

సన్నని జల్లులతో పాటు కంకులు వచ్చే కాలం ఇది! వేడి.. వేడి బొగ్గుల మీద కాల్చుకొని తిన్నా, కాస్త ఉప్పు వేసి ఉడికించి ఆరగించినా ఆ మజాయే వేరు! కార్న్‌తో పలావ్‌లు, పాయసాలు కూడా వండి వడ్డించవచ్చు.  

కార్న్‌ కర్రీ

కావాల్సినవి :మక్కజొన్న గింజలు : ఒక కప్పు

దాల్చినచెక్క : 1

లవంగాలు : 2

యాలక్కాయ : 1

నిమ్మరసం : ఒక టీ స్పూన్‌

కొబ్బరి పాలు : అరకప్పు

నెయ్యి : ఒక టేబుల్‌ స్పూన్‌

ఉల్లిగడ్డ : 1, పచ్చిమిరపకాయలు : 3

వెల్లుల్లి : 3 రెబ్బలు

గసగసాలు : 2 టీ స్పూన్స్‌, 

అల్లం : చిన్న ముక్క, కొత్తిమీర : ఒక కట్ట

ఉప్పు : తగినంత

తయారీ : మక్కజొన్నగింజలను బాగా కడిగి, నీళ్ళు పోసి ఉడికించి, పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయను, పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలను, అల్లం, వెల్లుల్లిపాయలు, గసగసాలు, కొత్తిమీర అన్నీ కలిపి మెత్తగా అయ్యేలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టి నెయ్యి వేసి గ్రైండ్‌ చేసుకున్న పేస్ట్‌ని వేయించాలి. పచ్చిదనం పోయేవరకు కలుపుతుండాలి. దీంట్లో లవంగాలు, దాల్చినచెక్క, యాలక్కాయ వేసి కలపాలి. ఆ తర్వాత నిమ్మరసంతోపాటు ఉడికించిన మక్కజొన్న గింజలు, కొబ్బరిపాలు, ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడకనివ్వాలి. చివరగా పై నుంచి కొత్తిమీర చల్లి దించేయాలి. వేడి.. వేడి.. కార్న్‌ కర్రీ రెడీ!

కార్న్‌ ఖీర్‌

కావాల్సినవి :మక్కజొన్న గింజలు : ఒక కప్పు

నెయ్యి : 2 టీ స్పూన్స్‌

బెల్లం : పావు కప్పు

పాలు : పావు కప్పు

కొబ్బరి పాలు : పావు కప్పు

జీడిపప్పులు : 5

బాదంపప్పులు : 5

కిస్‌మిస్‌ : 10

యాలకులపొడి : పావు టీ స్పూన్‌తయారీ :జీడిపప్పు, బాదంపప్పులను చిన్నచిన్న ముక్కలు చేసుకోవాలి. బెల్లాన్ని పొడి కొట్టి నీళ్ళలో పోసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో కొద్దిగా నెయ్యివేసి మక్కజొన్న గింజలను వేయించుకొని గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు బెల్లం నీళ్లలోని చెత్త పైకి పేరుకుంటుంది. దాన్ని తీసేసి ఆ నీళ్ళని వేడిచేయాలి. అలా వేడిచేసే సమయంలో కార్న్‌ పేస్ట్‌ని వేసి బాగా మరగనివ్వాలి. చిక్కగా అవుతుందనగా పాలు, కాసేపు అగి కొబ్బరిపాలు పోసి మరికాసేపు మరిగించాలి. తర్వాత యాలకులపొడి వేసి చిక్కబడేంతవరకు అలాగే ఉండనివ్వాలి. చివరగా బాదం, జీడిపప్పు, కిస్మిస్‌లను కలిపి సర్వ్‌ చేసుకోవాలి. నోరూరించే తియ్యని కార్న్‌ పాయసం మీ ముందుంటుంది.