బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jun 13, 2020 , 23:11:21

‘బాల’ బాహుబలీ... భళా!

‘బాల’ బాహుబలీ... భళా!

ఆరేండ్ల వయసులో  పిల్లలు ఏం చేస్తారు?  చాక్లెట్ల కోసం, ఇష్టమైన బొమ్మల కోసం అర్రులు చాస్తారు. అమ్మమ్మతోనో, తాతయ్యతోనో ఆడుకుంటారు. కానీ ఇరాన్‌కు చెందిన అరత్‌ మాత్రం  సిక్స్‌ ప్యాక్‌ సాధించాడు. అంతే కాదు.. తను అద్భుతమైన ఫుట్‌బాల్‌ అటగాడు, శరీరాన్ని స్ప్రింగులా తిప్పే జిమ్నాస్ట్‌. అంతకు మించిన బాక్సర్‌. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ బాలుడు  సూపర్‌ స్టార్‌. ఫేస్‌బుక్‌లో మరీ పాపులర్‌. ఆరేండ్లకే ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అరత్‌ తండ్రి  మహ్మద్‌, చిన్నతనంలోనే బిడ్డలోని ప్రతిభను గుర్తించాడు. ఫిట్‌నెస్‌లో శిక్షణ  ఇప్పించాలని లివర్‌పూల్‌ అనే అకాడెమీలో చేర్పించాడు.  ఓసారి, కాలక్షేపానికి అరత్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు మహ్మద్‌. ‘వరల్డ్స్‌ స్ట్రాంగెస్ట్‌ సిక్స్‌ ఇయర్స్‌ ఓల్డ్‌' అని క్యాప్షన్‌ రాశాడు. దానికి పది లక్షల లైక్స్‌ వచ్చాయి. అప్పటి నుంచీ సోషల్‌ మీడియా వేదికగా అరత్‌కు సంబంధించిన చాలా వీడియోలు వైరల్‌ అయ్యాయి. తన ఫీట్లు, కిక్కులు,  వ్యాయామం  ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి. 


logo