గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jun 06, 2020 , 23:48:13

అతనేం మారలేదు!

అతనేం మారలేదు!

 • ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో తెలుగు తెరపై మెరిసినా.. ‘కళ్యాణ వైభోగం’తో మంచి మార్కులు సంపాదించినా.. కొంతకాలం తెరకు దూరంగా ఉంటూ.. చదువులకు దగ్గర అయింది. పెద్ద పెద్ద కళ్లతో హావభావాలను అవలీలగా పలికిస్తుంది.. ఇప్పటికే అర్థమై ఉంటుంది. మలయాళ కుట్టి.. మాళవికా నాయర్‌ గురించే ఇదంతా!  ‘ఒరేయ్‌ బుజ్జిగా’ అంటూ లాక్‌డౌన్‌కి ముందు పలకరిద్దామనుకుంది.. కానీ ఆ బొమ్మ ఆగిపోవడంతో త్వరలోనే మళ్లీ తెరపై మెరిసేందుకు సిద్ధమైంది. మాళవిక మదిలోని భావాలను చదివేద్దామా? 

  బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌లో  హిస్టరీ, లిటరేచర్‌, పొలిటికల్‌ సైన్స్‌తో గ్రాడ్యుయేషన్‌ చేసింది. సినిమా, స్పోర్ట్స్‌, డబ్బు.. అన్నింటికంటే తనకు చదువు చాలా ముఖ్యమని అంటున్నది.
  కథలు, కవితలు రాస్తుంది. స్క్రిప్ట్‌ మీద కూడా పట్టు సాధించాలని ఉంది. ఖాళీ దొరికితే పెయింటింగ్స్‌ వేస్తుంది. చిన్నప్పుడు పైలెట్‌ కావాలని కలగనేది.
  అవకాశాలు వెతుక్కుంటూ రావడంతో, 13 యేండ్లకే తెరంగేట్రం చేసింది. 
  దుల్కర్‌ సల్మాన్‌కి పెద్ద ఫ్యాన్‌. ఆయనతో ‘మహానటి’ సినిమా చేస్తున్నప్పుడు మొదట్లో భయంగా అనిపించిందట. దుల్కర్‌ను తోటి నటుడిలా కాకుండా, అభిమాన హీరోలానే చూసిందట.  ఇడియప్పం, కొబ్బరిపాలు కలిపి తినడం చాలా ఇష్టమంటుందీ కేరళ కుట్టి.
  ‘కళ్యాణ వైభోగం’ ఆఫర్‌ని ముందు వద్దనుకుంది. కానీ, నందినీరెడ్డి వల్ల ఆ క్యారెక్టర్‌ ఒప్పుకోవాల్సి వచ్చిందట.
  ‘విజేత’ సినిమాకి ముందు తనకు స్కూటీ తోలడం రాదు. ఆ సినిమా కోసమే ట్రై చేసింది. కానీ ఇప్పటికీ స్కూటీ సరిగా నడపలేనంటుంది. 
  థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలనుకునే రకం కాదు. చాలా తక్కువసార్లు థియేటర్లకు వెళుతుంది. టామ్‌బాయ్‌లా ఉండటం ఇష్టమంటున్నది.
  ఢిల్లీలో పుట్టింటి. ఒక సంవత్సరం కేరళలో చదివింది. ఆ తర్వాత ఢిల్లీ తిరిగి వచ్చింది కుటుంబం. ఇంటర్‌ వరకు ఢిల్లీలోనే. ఆతర్వాత హైదరాబాద్‌.
  కొన్ని కమర్షియల్స్‌లో నటించింది. రితుక్కల్‌ అనే మ్యూజిక్‌ వీడియోలోనూ మెరిసింది.
  మొదట్లో సినిమాల్లో చిన్నచిన్న రోల్స్‌ చేసింది. ‘బ్లాక్‌ బటర్‌ఫ్లయ్‌' సినిమాతో మలయాళంలో, ‘కుక్కో’ అనే చిత్రంతోతమిళంలో తెరంగేట్రం చేసింది.
   మూడేండ్ల వయసులో.. ఓరోజు  బఠాణీలు మొత్తం తినేసింది. పొరపాటున ఓ బఠాణీ గింజ ముక్కులో ఇరుక్కుపోయిందట. ఆ రోజు ఇంట్లో నానమ్మ తప్ప ఎవరూ లేరు. డాక్టర్‌ దగ్గరకు వెళ్లినా ప్రయోజనం కనిపించలేదు.
  మరునాడు, ‘హా..చ్‌' అని తుమ్మినప్పుడు ఠప్పున బయటకు వచ్చిందట.
  కెరీర్‌ ప్రారంభం నుంచీ విజయ్‌ దేవరకొండను చూస్తున్నది. తను ఎప్పుడూ ఒకేలా ఉంటాడని అంటున్నది.చాక్లెట్లు అంటే పిచ్చి. నెలనెలా తనకూ, తన అన్నకూ ప్రత్యేకంగా పాకెట్‌మనీ వచ్చేది. దాంతో, కావాల్సినవన్నీ ముందుగానే కొనేసుకొనేది. అన్నయ్య మాత్రం, కొన్నా కూడా తినకుండా దాచి పెట్టుకునేవాడు. దొంగతనంగా ఆ బిస్కెట్స్‌, చాక్లెట్స్‌ తినేసేదట మాళవిక. బోర్‌ కొడితే గిటార్‌ ప్లే చేయడానికి ఇష్టపడుతుంది.


logo