సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Jun 06, 2020 , 23:29:29

అమ్మమ్మను హత్తుకోవడానికి ‘హగ్‌ కర్టెన్‌'

 అమ్మమ్మను హత్తుకోవడానికి ‘హగ్‌ కర్టెన్‌'

పిల్లలూ.. కరోనా వైరస్‌ ఇప్పుడు అందరినీ భయపెడుతున్నది కదా! మిగిలినవారికి దూరంగా  ఉంటేనే దీన్ని అరికట్టగలం. అందుకే ప్రతి ఒక్కరూ ‘ఫిజికల్‌ డిస్టెన్స్‌' పాటించాలని పెద్దవాళ్లు చెప్తుంటారు. సరదాగా అమ్మమ్మ, తాతయ్యల ఒళ్లో ఆడుకోవాలన్నా ఇప్పుడు కష్టమే కదా. అందుకే కాలిఫోర్నియాకు చెందిన ‘పైజ్‌' అనే పదేండ్ల పాప ఓ హగ్‌ కర్టెన్‌ను తయారు చేసింది. దీని సాయంతో, సురక్షితంగా  హత్తుకోవచ్చు. అచ్చం డాక్టర్లు ధరించే ప్రొటెక్షన్‌ షూట్‌ లాగే ఇది ఉంటుంది. పైజ్‌ తన అమ్మమ్మను హత్తుకోవడానికి ఈ కర్టెన్‌ను తయారు చేసింది. ఫిజికల్‌ డిస్టెన్‌ కారణంగా పైజ్‌ చాలా రోజులు అమ్మమ్మకు దూరంగా ఉంది.  ప్లాస్టిక్‌ను ఉపయోగించి తయారు చేసిన ఈ కర్టెన్‌ ఇద్దరు వ్యక్తులు హత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏడు గంటలు కష్టపడి దీన్ని తయారు చేసినట్టు పైజ్‌ తల్లి చెప్పింది.  ఈ కర్టెన్‌తో పైజ్‌ తన అమ్మమ్మను హత్తుకుంటున్నప్పుడు ఆమె తల్లి వీడియో తీసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది.


logo