శనివారం 04 జూలై 2020
Sunday - May 31, 2020 , 11:08:49

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ మేటి.. 18 శాతం వరకు వృద్ధి

ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ మేటి.. 18 శాతం వరకు వృద్ధి

ఐటీ రంగంలో దేశానికి గమ్యస్థానంగా నిలుస్తున్నది తెలంగాణ. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంలో ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఐటీ ఎగుమతుల్లో మేటిగా నిలిచి ప్రపంచానికి మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలకు సురక్షితమైన నగరంగా నిలుస్తున్నది. ఐటీలో జాతీయవృద్ధి రేటుతో పోలిస్తే మన రాష్ట్రం రెండింతలకు పైగా అభివృద్ధిని సాధించింది. 

- నెలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి

రికార్డు వృద్ధి : 

హైదరాబాద్‌ నగరంలో ఐటీని విస్తరించడంలో మంత్రి కేటీఆర్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక  భారత జాతీయ సగటే కాదు దేశంలోని ఇతర రాష్ర్టాలు నమోదు చేయని వృద్ధిని సాధించింది. ప్రతి సంవత్సరం వృద్ధిని సాధిస్తూ కోట్లాది రూపాయల ఎగుమతులతో పాటు అనేక మందికి ఉద్యోగాల ద్వారా ఉపాధి కల్పిస్తోంది. కరోనా కష్టకాలంలో ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగిస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కరోనా ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడినప్పటికీ తెలంగాణ ఐటీ మాత్రం ఎగుమతుల్లో 18 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. 

రెట్టింపు ఎగుమతులు: 

ఐటీ ఎగుమతుల వివరాలు

సంవ‌త్స‌రం

ఎగుమ‌తులు

(రూ.కోట్ల‌లో)

ఉద్యోగాలు
2014-15 
66,276

3,71,774

2015-16
75,070
4,07,385
2016-17
85,470
4,31,891
2017-18
93,442
4,75,308
2018-19
1,09,219
5,43,033
2019-20
1,28,807
5,82,126
 తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఆరేండ్లలో ఎగుమతులు రెట్టింపు కాగా 2.10లక్షల మందికి అదనంగా ఐటీ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. 2019-20 ఏడాదికి రాష్ట్ర ఐటీ ఎగుమతులు 17.93 శాతం పెరిగాయి. తెలంగాణ ఎగుమతులు జాతీయ స్థాయిలో రాష్ట్ర ఐటీ ఎగుమతులు 10.60 శాతం నుంచి 11.60 శాతానికి పెరిగాయి. జాతీయ స్థాయిలో 8.09 శాతం ఎగుమతులు కావడం గమనార్హం. 


 జిల్లాలకూ ఐటీ: 

ఐటీ కార్యాలయాల విక్రయాల్లో దేశంలోనే హైదరాబాద్‌ ముందంజలో నిలిచింది. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు నిర్ణయించారు. వరంగల్‌తో పాటుగా నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ లాంటి నగరాల్లో ఐటీ టవర్‌లను నిర్మిస్తున్నారు. వరంగల్‌ ఐటీ టవర్‌ ప్రారంభం కాగా కరీంనగర్‌ ఐటీ టవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. త్వరలో నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ ఐటీ టవర్‌లను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌లో సయెంట్‌, టెక్‌ మహేంద్ర కంపెనీలు వరంగల్‌లో తమ కంపెనీలను ప్రారంభించాయి. 

ఇంక్యుబేషన్‌ సెంటర్‌ :

నూతన ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి మంత్రి కేటీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో టీ హబ్‌ను ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు భారీ డిమాండ్‌ ఏర్పడటంతో టీ హబ్‌ -2ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తి అయితే దేశంలోనే అతి పెద్ద ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా టీ హబ్‌ -2 నిలవనుంది. ప్రొటోటైప్‌ టెక్నాలజీతో  టీ వర్క్స్‌ను ఏర్పాటు చేశారు. టీ వర్క్స్‌ ఆధ్వర్యంలో కరోనాకు రూ.35వేలల్లో వెంటిలెటర్‌ను మరికొందరు స్టార్టప్‌లతో కలిసి తయారు చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇవ్వడానికి  టాస్క్‌ను ఏర్పాటు చేశారు. దీనితో పాటుగా రిసెర్చ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ హైదరాబాద్‌ (రిచ్‌)ను కూడా ఏర్పాటు చేశారు. logo