శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - May 03, 2020 , 00:45:11

యూట్యూబ్‌ చానెల్‌ పెట్టాలని

యూట్యూబ్‌ చానెల్‌ పెట్టాలని

మూడు సంవత్సరాలు..  నాలుగు తెలుగు సినిమాలు.. సెలెక్టివ్‌గా  చేస్తూ.. టాలెంట్‌ ఉన్న నటిగానే కాదు.. మంచి డ్యాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకుంది.. తనలో  చాలా కళలు దాగి ఉన్నాయనీ వాటిని పూర్తిగా బయటకు తెచ్చే క్యారెక్టర్‌ ఇంకా రాలేదనీ అంటున్నది.. నివేతా పెతురాజ్‌.. 

 • నివేతా... హ్యూమన్‌ రిసోర్స్‌మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసింది.చిన్నప్పుడు డ్యాన్స్‌ నేర్చుకుంది.ఒత్తిడిగా అనిపించినప్పుడు పెయింటింగ్స్‌ వేస్తుందట. తనకు వచ్చే కలలనే చిత్రాలకు ఇతివృత్తాలుగా ఎంచుకుంటుంది.మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంది నివేతాకి. కిక్‌బాక్సింగ్‌, రెజ్లింగ్‌ నేర్చుకుంది.నాటకాలు వేయాలని ఉన్నా, మోడలింగ్‌ చేయాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. దానిపై తనకు పెద్దగా ఆసక్తి లేదంటున్నదీ అమ్మడు.
 • చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో... చిత్రాలతో పేరు సంపాదించింది. రెడ్‌ సినిమాతో మరోసారి సూపర్‌హిట్‌ హీరోయిన్‌ అనిపించుకోవాలనుకుంటున్నది.ట్రావెలింగ్‌ అంటే  ఇష్టమట నివేతాకి. అంతేకాదు.. ఫ్లయిట్‌ బోర్డింగ్‌ పాస్‌లని దాచి పెట్టుకోవడం అలవాటు. వాటిని చూసినప్పుడు తీయనిఅనుభూతి కలుగుతుందని మురిసిపోతూ చెబుతున్నది.దుబాయ్‌లో ఉన్నప్పుడు ఎవరోమిస్‌ బిహేవ్‌ చేయబోతే, ‘హెల్ప్‌' అని అరిచినా, ఒక్కరు కూడా సాయం చేయలేదు. అప్పటికే ఆ అపరిచితుడు పారిపోయాడు. కానీ నివేతా వదల్లేదు. వెతికి పట్టుకొని మరీ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించింది.అవకాశాల కోసం తను ఎవరినీ అడుగదట. అలా అని, వచ్చిన అవకాశం మంచిదైతే కచ్చితంగా ఒప్పుకొని తీరుతానంటున్నది.టీవీ చూడటం తనకి పెద్దగా ఇష్టం ఉండదట. 
 • మౌంటెనీరింగ్‌, ట్రెక్కింగ్‌ అంటే సరదా. పైపైకి పోతూ ఉంటే ఆకాశాన్ని అందుకుంటున్నభావన కలుగుతుందట. 
 • లైఫ్‌ స్టైల్‌, ట్రావెల్‌ మీద ఒక యూట్యూబ్‌ చానెల్‌ పెట్టే ఆలోచనలో ఉంది.
 • జీవితాన్ని యథాతథంగాతీసుకుంటాననీ, కష్టసుఖాల్నీ జయాపజయాల్నీ పెద్దగా లెక్కచేయననీ చెబుతున్నది ఈ అందగత్తె.
 • విజయ్‌సేతుపతి అంటే చాలా ఇష్టమట. తన దృష్టిలో నయనతార ఓ హీరో అంటున్నది.
 • 2015లో మిస్‌ ఇండియా యూఏఈ కిరీటం దక్కించుకున్నది.
 • మేకప్‌ తక్కువగా వేసుకోవడానికి ఇష్టప డుతుంది. అలాగే  అతి నిరాడంబరంగా జీవించే విషయంలో ప్రయోగాలు చేస్తానంటున్నది.
 • 2014లో కతార్‌లోని ఓ  మోటర్‌ వెహికిల్స్‌ కంపెనీలో నివేతా పనిచేసింది.
 • 30 నవంబరు1991న మదురైలో పుట్టిన నివేతా, తొట్టికూడులో పెరిగింది. అక్కడే  ఆరోతరగతి వరకు చదివింది.
 • 2017లో ‘మెంటల్‌ మదిలో’ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది.
 • పదకొండో యేట కుటుంబం దుబాయ్‌కి షిఫ్ట్‌ అయింది. అక్కడే డిగ్రీ చేసింది.


logo