మంగళవారం 07 జూలై 2020
Sunday - May 03, 2020 , 00:15:50

ఊరించే... ఉప్పుడు పిండి!

ఊరించే... ఉప్పుడు పిండి!

బొంబాయి రవ్వతో ఉప్మా..గోధుమ రవ్వతోనూ ఉప్మా..ఇప్పటితరానికి పరిచయమే.కానీ వీటికి మూలం ఉప్పుడు పిండి అని తెలుసా?అప్పటి ఆ  వంటకమే..ఇప్పటి ఈ ఉప్మాలకు ఊతమిచ్చింది..నోరూరించే సదరు తెలంగాణ వంటకం గురించీ,దాని వెనుక ఉన్న రహస్యాల గురించీ...

 • బియ్యం పట్టిచ్చిన తర్వాత నూక వస్తది. దాన్ని కూడా అన్నంలా వండుకునేవాళ్లు. కానీ కొందరు రవ్వలా ఇసురుకునేవారు. ఆ రవ్వతోనే  ఉప్పుడు పిండిని చేస్తారు.
 • అప్పట్లో నూకను ఇసుర్రాయిలో ఇసిరేవారు. ఇందులో చిన్న రవ్వ, పిండి రెండూ వస్తాయి. పిండితో అట్లు, రవ్వతో ఉప్పుడు పిండి చేసేవారు.
 • ఒక కప్పు బియ్యపు రవ్వకు.. పొడిగా కావాలంటే మూడు కప్పుల నీళ్లు, కాస్త వదులుగా కావాలంటే నాలుగు కప్పుల నీళ్లు పడుతాయి.
 • ఉప్మా తయారీ ఎలాగో ఉప్పుడు పిండి తయారీ కూడా అలాగే! కాకపోతే ఉప్మాకి నీళ్లు తక్కువ పడుతాయి. ఉప్పుడు పిండికి ఎక్కువ కావాలి.
 • మన వాళ్లు ఏదీ ఊరికే పడేయరు. ఏదో ఒకటి చేస్తే పిల్లలు తినేస్తారని నమ్మకం. అలా, ఆడవాళ్ల ఆత్మవిశ్వాసంలోంచి పుట్టిందే ఈ వంటకం.
 • ఒకప్పుడు ఆడించిన రవ్వని వాడేవారు.. ఇప్పుడు బియ్యం రవ్వ కూడా సూపర్‌ మార్కెట్‌లో లభిస్తున్నది. అచ్చు గోధుమ రవ్వ ఉప్మా చేసినట్టే దీన్నీ చేసేస్తున్నారు.
 • ఆంధ్రప్రదేశ్‌లో కూడామనకులానే ఉల్లిగడ్డ ముక్కలు లేకుండా చేస్తారు. శనగపప్పుకు బదులు పెసరపప్పు వాడతారు. అచ్చు.. పొంగలిలా చేస్తారన్నమాట.
 • ఉప్పుడు పిండిలోకి ఏదైనా నిల్వ పచ్చడి లేదా ఉల్లికారమో, మిరప కారమో నంజుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.
 • బియ్యం రవ్వ వల్ల.. మలబద్దకం సమస్య తగ్గుతుంది. త్వరగాజీర్ణం  అవుతుంది. కార్బోహైడ్రేట్స్‌ ఈ రవ్వలో అధికంగా ఉంటాయి.
 • ఆవాల్లోని  ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి.
 • జీలకర్రలో ఉండే పొటాషియం బీపీని, హృదయ స్పందనను నియంత్రిస్తుంది. శ్వాస సమస్యలు, వాపు, ఇన్ఫెక్షన్లు, పేగు వ్యాధులు, కంటి సమస్యలు, పంటి నొప్పి మొదలైనవాటిని తగ్గిస్తుంది.
 • జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు సహాయకారి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ మూత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి.

కరివేపాకు యాంటీహైపర్‌ 

 • గ్లిసమిక్‌ నేచర్‌ను కలిగి ఉండటం వల్ల, ప్రధానమైన రక్త నాళాల్లో గ్లూకోజ్‌ను కంట్రోల్‌ చేస్తుంది.
 • ఈ వంటకాన్ని ఇతర రాష్ర్టాల్లోనూ చేస్తారు. కాకపోతే పేర్లు మారుతాయి. ఆంధ్రాలో దీనికి పోపు సజ్జ, పప్పు రొట్టి, పప్పోసి ఉప్పిండి అనే పేర్లు ఉన్నాయి.
 • ఉప్పుడు పిండికి వేళాపాళా లేదు.  ఏ సమయంలోనైనా లాగించవచ్చు.  కాస్త తింటేనే కడుపు నిండినట్టు ఉంటుందని ఎక్కువగా రాత్రిళ్లు చేసుకునేవాళ్లూ  ఉన్నారు.
 • పోపు వేస్తాం కాబట్టి, కొద్ది నూనెను మాత్రమే ఉపయోగిస్తాం. ఆవాలలో.. మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్‌, జింక్‌, ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్‌, ప్రొటీన్లు, పీచుపదార్థాలు ఉంటాయి. డైటరీ ఫ్యాట్స్‌, కార్బొహైడ్రేట్స్‌, బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కెతో పాటు... పొటాషియం, సోడియం వంటివి అధికంగా ఉండటం వల్ల కొవ్వు అదుపులో ఉంటుంది.


logo