శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Apr 26, 2020 , 00:00:54

రెక్కల బండి!

రెక్కల బండి!

త్వరలో గాల్లో ఎగిరే కార్లు మన ముందుకు రానున్నాయి... అని చాలాసార్లు పత్రికల్లో చదివే ఉంటాం. టీవీల్లో వినే ఉంటాం. ఈసారి మాత్రం గురితప్పకపోవచ్చు. అటు కార్లలా, ఇటు హెలికాప్టర్లలా పనిచేసే... రెక్కల వాహనాలను తయారుచేసే పనిలో పడ్డాయి పలు కంపెనీలు. అదే కనుక సాధ్యమైతే.. ట్రాఫిక్‌, కాలుష్య సమస్యలే ఉండవు. అతి తక్కువ సమయంలో సుదూరాలు ప్రయాణించవచ్చు. అరవై ఏండ్ల క్రితం లండన్‌కు చెందిన మౌల్టెన్‌ టేలర్‌ అనే ఔత్సాహికుడు ‘ఏరో కార్‌' పేరుతో ఎగిరే వాహనాల నమూనాల్ని రూపొందించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నం ఆగిపోయింది. ఆ తర్వాత అమెరికాకు చెందిన కంపెనీలు ఇటువంటి వాహనాలను డిజైన్‌ చేశాయి. అలా ముందుకు వచ్చిన వాటిలో 80 పేటెంట్‌ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు కంపెనీలు మాత్రమే పూర్తిస్థాయిలో రూపొందించగలిగాయి. కొత్తగా ఆటొమొబైల్‌ రంగంలోకి అడుగుపెట్టిన టెరాఫుజియా కారుగానూ, విమానంగానూ ఉపయోగపడే ఫ్లయింగ్‌ కార్లు... ‘పిఎఎల్‌-వి వన్‌', ‘టెరాఫుజియా’, ’ట్రాన్సిషన్‌'ల రంగప్రవేశానికి ఏర్పాట్లు చేసుకున్నది. ఎగిరే కారుకి స్వయంచోదక సాంకేతికతను కూడా జతచేసి మరింత సురక్షితం చేసే ప్రయత్నాల్లో ఉంది టెరాఫుజియా. అతి తక్కువ సమయంలో ఆధునిక సాంకేతికతతో దూసుకుపోతున్న ఈ సంస్థను కొనేందుకు చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ చర్చలు జరుపుతున్నది.