గురువారం 02 జూలై 2020
Sunday - Apr 25, 2020 , 23:30:28

బ్యూటిఫుల్‌ గాళ్‌!

బ్యూటిఫుల్‌ గాళ్‌!

ఒకప్పుడు ఊర్వశి.. ఆ తర్వాత ఆంత్రామాలీ..వరుసగా రామ్‌గోపాల్‌ వర్మ సినిమాలు చేశారు..అందుకే అంతా రామ్‌గోపాల్‌ వర్మ  గాళ్స్‌ అని పిలిచేవారు..తర్వాత ఆయన సినిమాలూ ఆడలేదు..హీరోయిన్లూ రిపీట్‌ కాలేదు..కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత..వర్మ గాళ్‌గా పేరు తెచ్చుకుంది నైనా గంగూలీ..వంగవీటి నుంచి బ్యూటిఫుల్‌ సినిమా దాకా..గన్స్‌ అండ్‌ థయ్స్‌ వెబ్‌సిరీస్‌లోనూ మెరువనుంది ఈ భామ.. 

  • సినిమా కష్టాలంటారే... అలాగే నైనా చాలా ఇబ్బందులు పడింది. ఎన్నో ఆడిషన్లు ఇచ్చింది. అనుకోకుండా వంగవీటి సినిమా ఆడిషన్లో పాల్గొన్నది. 300మందిలోంచి ఆమెను సెలెక్ట్‌ చేశారు వర్మ.రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన మొదటి షార్ట్‌ఫిల్మ్‌  ‘మేరీ బేటీ సన్నిలియోన్‌ బన్నా చాహతీ హై’లో కూడా లీడ్‌ క్యారెక్టర్‌ చేసింది.
  • నైనా గంగూలీ.. కోల్‌కతాలో 17 ఏప్రిల్‌ 1994న జన్మించింది. డిగ్రీ వరకు చదివింది. ఆ తర్వాత మోడలింగ్‌ వైపు అడుగుపెట్టింది.బ్యూటిఫుల్‌ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్లో రామ్‌గోపాల్‌ వర్మ ఈ భామతో స్టేజీ మీద ఆడిపాడాడు. ఒక ప్రైవేట్‌ పార్టీలో ఆమె డాన్స్‌ మూమెంట్స్‌, యాక్టింగ్‌ చూసి కాళ్ల మీద పడిపోయాడు వర్మ. ఆ వీడియో చాలా వైరల్‌  అయింది.నైనా టామ్‌బాయ్‌లా పెరిగింది.  ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండటం ఇష్టం. బాధగా కూర్చోవడం తన రియల్‌ లైఫ్‌లో ఉండనే ఉండదంటుంది.
  • ఫలక్‌నుమా దాస్‌లోమొదటగా ఈమెనే అనుకున్నారు. కానీ కాస్ట్యూమ్స్‌ విషయంలో గొడవ జరుగడంతో రాత్రికి రాత్రే తన స్థానంలో వేరొక హీరోయిన్‌ని తీసుకున్నాడు విశ్వక్సేన్‌.
  • చరిత్రహీన్‌ అనే బెంగాలీ వెబ్‌ సిరీస్‌లోనూమెరిసిందీ భామ.సోషల్‌ మీడియాలో తన పంచవన్నె చిత్రాలకు ఆరాధకులు ఎక్కువేనండోయ్‌!ఒకే టైప్‌ క్యారెక్టర్లు తనకిష్టం లేదంటున్నది. 
  • పాత్ర వైవిధ్యంగా ఉంటేనే సినిమాలు ఒప్పుకొంటుందట.ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్నది నైనా. షారుక్‌, దీపికా, కరీనాకపూర్‌లు అంటే అభిమానమట.
  • న్యూయార్క్‌ నగర వీధుల్లో ఒంటరిగా తిరగడం సరదా అంటున్నదీ బెంగాలీ భామ.లాక్‌డౌన్‌ సమయంలో  డాక్టర్లు, ఎన్జీవోలు, నర్సులు, వలంటీర్లకు తన వంతుగా సోషల్‌ మీడియాలో కృతజ్ఞతలు తెలిపింది. ‘మీరు నడిచే దేవుళ్లు ...’ అని కీర్తించింది. 


logo