మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Apr 19, 2020 , T12:01

రాశి ఫలాలు

రాశి ఫలాలు

 మేషంప్రారంభించిన పనుల్లో ఆటంకాలు, ప్రయాస ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా వుంటారు. వస్తువులను సద్వినియోగం చేసుకుంటారు. వస్త్ర, వస్తువులను కొనే ప్రయత్నం చేయవచ్చును. ప్రయాణాలు వాయిదా పడినా పనులు నెరవేరే అవకాశాలు ఉంటాయి. వారం ప్రారంభంలో అనుకూలత ఉంటుంది. రావాల్సిన డబ్బు అందుతుంది.  వారం మధ్యలో అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. వారాంతంలో మళ్లీ అనుకూలత ఉంటుంది.   పెద్దల సూచనలు కొంత కలిసి వస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం.


వృషభంకుటుంబ సభ్యులతో మంచి అవగాహనతో ఉంటారు. శుభకార్యాల విషయమై ఆలోచిస్తారు. అదృష్టం అనుకూలిస్తుంది. మంచి ఫలితాలు పొందుతారు. వారం ప్రారంభంలో పనులు కలిసి వస్తాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. వారం మధ్యలోనూ రావాల్సిన డబ్బు అందుతుంది. వారాంతంలో ఖర్చులు ఉండవచ్చును. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. క్రయావిక్రయాల్లో అనుకూలత ఉన్నప్పటికిన్నీ అనుకున్న స్థాయిలో డబ్బు చేతికి రాకపోవచ్చును. పెద్దల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి. 


మిథునంఈ వారము అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగంలో తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి. వాటిని అధిగమిస్తారు. క్రయ విక్రయాల వల్ల అనుకున్న ఫలితాలు లేకపోయినా పనులు జరుగుతాయి. కుటుంబ సభ్యులందరితోనూ సంతోషంగా వుంటారు. భక్తి భావనలు పెరుగుతాయి. అష్టమ స్థితి వల్ల ఫలితాలు ఉండవచ్చును. పెద్దల సహాయ సహకారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలసట, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.    దీర్ఘకాలిక పనులు ఆలోచించి చేయడం మంచిది.


కర్కాటకంఈ వారం ప్రారంభంలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పటికీ వారం మధ్యలో, వారాంతంలో అనుకూలత ఉంటుంది. సాహిత్య, సినిమా, ఆధ్యాత్మిక రంగాలపై మనసు నిలుపుతారు. కుటుంబ సభ్యులందరితోనూ హాయిగా వుంటారు. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని కార్యరూపంలో పెడతారు. తోటి ఉద్యోగులతో, పైఅధికారులతో మంచి మాట ఉంటుంది. పనులు నెరవేరుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలత ఉంటుంది. 


సింహంఈ వారం ప్రారంభంలో అనుకూలత ఉంటుంది. వారం మధ్యలో అనవసరమైన ఖర్చులు ఉండవచ్చును. వారాంతంలో తిరిగి అనుకూలత ఉంటుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. పనులు నెరవేరుతాయి. పనివారు అనుకూలంగా వుంటారు. అన్నదమ్ములు, బంధువులతో మంచి మాట ఉంటుంది. వ్యవసాయ దారులకు వాతావరణం అనుకూలిస్తుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. నిత్యం హారం సంతృప్తికరంగా ఉంటుంది. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. 


కన్య


వారం ప్రారంభంలో కలిసివస్తుంది. వారం మధ్యలో అనుకూలిస్తుంది. వారం చివరిలో ఊహించని ఖర్చులు ఉండవచ్చును. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు చదువు విషయంలో సత్ఫలితాలు వుంటాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సామరస్యంగా వుంటారు. అయితే ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసరమైన ఆలోచనలతో భయాందోళనలకు గురవుతారు. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి.


తులఈ వారం తాత్కాలిక ప్రయోజనాలతో ఉండవచ్చు. అయితే దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. దైవభక్తి పెరుగుతుంది. నిత్య వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. సమస్యలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో సంతోషంగా వుంటారు. సంగీత, సాహిత్య, రచనలపై  మనసు నిలుపుతారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో ఇబ్బందులు ఏర్పడవచ్చును.  


వృశ్చికంప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయి. మధ్యలో, వారాంతంలో కలిసి వస్తుంది. ఇంటిలో కుటుంబ సభ్యులందరితోనూ సంతృప్తిగా వుంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనివారితో అనుకూలత. అన్నదమ్ములు, బంధుమిత్రులతో మంచిమాట ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలత. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహ పూర్వక వాతావరణం ఉంటుంది. అయితే పై అధికారులతో మనస్పర్థలు ఉండవచ్చును. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు.


ధనుస్సువారం ప్రారంభంలో, చివరిలో అనుకూలత ఉంటుంది. మధ్యలో ఇబ్బందులు ఎదురు కావచ్చు. నిత్య  వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయ పరమైన సమస్యల నుండి విముక్తులవుతారు. పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. అనుకున్నమేర ఆర్థిక లాభాలు ఉండక పోవచ్చు. విద్యాపరమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లలకు చదువు విషయంలో బాగా కలిసి వస్తుంది. అయితే పెద్దల సహాయ సహకారాలను వినియోగించుకోక పోవడంతో కొత్త సమస్యలు ఎదురవుతాయి.


మకరం


వారం ప్రారంభంలో, మధ్యలో అనుకూలత ఉంటుంది. వారాంతంలో ఇబ్బందులు ఉంటాయి.  భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులతో సంతోషంగా వుంటారు. సమయస్ఫూర్తితో మెలుగుతారు. ఆరోగ్యంగా వుంటారు. మంచి ఆలోచనలను అమలు పరుస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అయితే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగులతో, పై అధికారులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థాన చలనం, మనస్పర్థలు ఉంటాయి. నిత్య వ్యాపారంలో అవకతవకలు, పని ఒత్తిడి మూలంగా అనుకున్న ఫలితాలు ఉండక పోవచ్చును. 


కుంభం


ఈ వారం తాత్కాలికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. నిత్య వ్యాపారం కలిసి వస్తుంది. లాభాలను పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు అందుతాయి. ఆఫీసులో మంచిపేరును పొందుతారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమాలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక పరమైన విషయాలపై శ్రద్ధ చూపుతారు. 


మీనంవారం ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉన్ననూ, మధ్యలో వారాంతంలో బాగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా వుంటారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. మంచి ఫలితాలను పొందుతారు. రావాల్సిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పనివారితో అనుకూలత, శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. స్నేహితులు, బంధువులతో పనులు కలిసి వస్తాయి. నిర్మాణరంగంలో ఉన్న వారికి అనుకూలత ఉంటుంది. నిత్య వ్యాపారంలో కొంత ఇబ్బందులు ఉంటాయి. చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు.  


logo