గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Apr 05, 2020 , 00:27:35

తోటలో తిరుగొచ్చు.. టేస్ట్‌ చేసి కొనొచ్చు..

తోటలో తిరుగొచ్చు.. టేస్ట్‌ చేసి కొనొచ్చు..

ద్రాక్ష పండ్లు కావాలంటే మార్కెట్‌కి వెళ్లి కొనుక్కుంటాం. కానీ ఎప్పుడైనా ఊహించారా ద్రాక్ష తోటల్లో తిరుగుతూ.. టేస్ట్‌ చేసి మరీ కొనుక్కోవచ్చని. ఆ అనుభవం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మన హైద్రాబాద్‌లోనే ద్రాక్ష తోటలు ఉన్నాయి. రాజేంద్రనగర్‌లోని హార్టికల్చర్‌ యూనివర్సిటీలో గ్రేప్స్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ ఉంది. అక్కడ ద్రాక్ష పెంపకంపై రైతులకు అవగాహన కల్పిస్తారు.  ప్రజలకు సేంద్రియ పద్ధతిలో పండించిన ద్రాక్ష పండ్లను విక్రయిస్తారు. ఈ రీసెర్చ్‌ సెంటర్‌ 1966 ప్రారంభమైంది. అప్పటి నుంచి సైంటిస్టులు కొత్త  కొత్త రకాల ద్రాక్ష వంగడాను సృష్టించారు. 27 ఎకరాలలో ఇది విస్తరించి ఉంది. దాదాపు 59 రకాలను  సాగు చేస్తారు. ఇక్కడ పండిన ద్రాక్షలతో కిస్‌మిస్‌ కూడా  తయారవుతుంది. కిలో ద్రాక్షపండ్లతో దాదాపు  250 గ్రాముల కిస్‌ మిస్‌ను తయారుచేసుకోవచ్చు. సాద్‌ సీడ్‌ లెస్‌, ఫాంటసీ సీడ్‌ లెస్‌, బెంగళూర్‌ బ్లూ, కట్టా కుర్గాన్‌, రెడ్‌ గ్లోబ్‌, రిజమత్‌... ఇలా పలు రకాల ద్రాక్షలను ప్రజలు కొనుగోలు చేయవచ్చు. 


logo