బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Apr 04, 2020 , 22:56:24

సూపర్‌ స్నీకర్స్‌!

సూపర్‌ స్నీకర్స్‌!

పెండ్లి, రిసెప్షన్‌.. ఇతర ఫంక్షన్లప్పుడు బాగా రెడీ అయిపోతాం. చివరగా చెప్పుల దగ్గరకు వచ్చేసరికి హైహీల్స్‌ కనిపించేస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫర్వాలేదనిపించినా.. వాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ గురించి విన్నప్పుడు మాత్రం&  ఇప్పుడు అవసరమా? అనిపిస్తుంది. కానీ, తప్పనప్పుడు హైహీల్స్‌ మాత్రమే దిక్కు. ఇది ఒకప్పటి మాట. వీటిని రీప్లేస్‌ చేయడానికి వచ్చేశాయి షూస్‌. ఇన్ని రోజులు మోడర్న్‌వేర్‌కి మాత్రమే పరిమితమైన స్నీకర్స్‌ని ఇప్పడు లెహంగాలు, చీరల మీదకి కూడా వాడుతున్నారు. కొందరైతే సంప్రదాయ దుస్తులకు మ్యాచింగ్‌ అయ్యేలా స్నీకర్స్‌ని ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. పెండ్లికూతుళ్లు ఈ ట్రెండ్‌ని ఎక్కువగా ఫాలో అవుతున్నట్టు సమాచారం.

 చీరనే డ్రెస్‌గా.. 

ఈ మధ్యకాలంలో చీరలనే డ్రెస్‌లుగా కుట్టించుకునే పద్ధతి ఎక్కువ అయింది. పట్టు, ఫ్యాన్సీ.. ఫ్యాబ్రిక్‌ ఏదైనా దాన్ని అనార్కలీ లాంగ్‌ లెంగ్త్‌లో కుట్టించడం మామూలు అయింది. కొంగు భాగాన్ని పైన వేయించి, మిగతా చీరను ఎక్కువ ప్లీట్స్‌ పెట్టించి& ఈ డ్రెస్‌ కుట్టిస్తున్నారు. గ్రాండ్‌గా ఉండటానికి కాటన్‌, పట్టు చీరల్నే ఎంచుకుంటున్నారు.

ఫెదర్స్‌.. అదుర్స్‌! 

పక్షుల అందానికి ఆ రంగురంగుల ఈకలే కారణమా? అందుకేనేమో డిజైనర్లు ఫెదర్స్‌ ఫ్యాషన్‌ని రంగంలోకి దించారు. అయితే ఇక్కడ ఒక విషయం.. ఇవి కృత్రిమమైన ఈకలు. లెహంగాకు అదనపు హంగుల కోసం ఈ ఫెదర్స్‌ని యాడ్‌ చేస్తున్నారు. మొత్తం ఫెదర్స్‌ లేకపోతే చివరల్లో వీటిని చేర్చుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై ఈ ఫ్యాషన్ని ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నారు సెలెబ్రిటీలు. ఇప్పుడిప్పుడే మన అమ్మాయిలూ ఇటువైపు అడుగులు వేస్తున్నారు.

బుట్ట బొమ్మ.. 

ఎప్పటి నుంచో ఉన్న ఫ్యాషన్‌ ట్రెండ్‌ బుట్టలు. అదేనండీ... బుట్ట జుంకాలు. అచ్చు షాండ్లియర్‌లాగా ఉండే ఈ బుట్టలకు అనాదిగా ఆదరణ ఉన్నది. కొత్త కొత్త డిజైన్లతో వీటిని ఇప్పటివారికి మరింత చేరువచేస్తున్నారు డిజైనర్లు. బంగారం, వెండి, వన్‌గ్రామ్‌.. ఇలా ప్రతీ మెటీరియల్‌తో  బుట్టలను తయారు చేస్తున్నారు. వెస్ట్రన్‌ వేర్‌కి కూడా ఇవి అందాన్ని తీసుకొస్తాయనడంలో అతిశయోక్తిలేదు. వెండి, బంగారమే కాకుండా రాళ్లు, రత్నాలు పొదిగినవి కూడా వస్తున్నాయి. పైన కమ్మ వచ్చి.. కిందకు వేలాడేవే కాదు.. లూప్స్‌తో వచ్చిన బుట్టలకూ ఈ మధ్య గిరాకీ ఉంటున్నది. 


logo