మంగళవారం 07 జూలై 2020
Sunday - Apr 04, 2020 , 22:32:30

రాశి ఫలాలు

రాశి ఫలాలు

 మేషంభార్యా పిల్లలతో సుఖంగా ఉంటారు. వస్తువులపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన, గురుభక్తి పెరుగుతుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. తలపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, వ్యాపారాల్లో గుర్తింపును పొందుతారు.  అప్పుడప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. పనులు ఆలస్యంగా జరుగుతాయి. ఖర్చులు ఉంటాయి. పిల్లలపై ప్రేమ, అనురాగాలు వృద్ధి పొందుతాయి.  ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికిన్నీ మొత్తం మీద అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా అందుతుంది. 


వృషభంవారం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నా.. తరువాత మంచి ఫలితాలను పొందుతారు. క్రయవిక్రయాలు అనుకూలిస్తాయి. పెట్టుబడుల మూలంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి కొలువు లభిస్తుంది. ప్రమోషన్‌లు ఉంటాయి.  అధికారులతో సమన్వయంగా ఉంటారు. పనులు చాలా మటుకు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులందరితోనూ సంతృప్తిగా ఉంటారు. దేవతా, గురుభక్తి పెంపొందుతుంది. విద్యార్థులకు  బాగా కలిసి వస్తుంది.


మిథునంఉద్యోగంలో ఉన్న వారికి  అనుకూలత ఉంటుంది. అధికారులతో సమన్వయంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. పనులను చాకచక్యంతో నిర్వర్తిస్తారు. క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి.  కుటుంబ సభ్యులందరితో కలిసివుంటారు. వస్త్ర, వస్తువులను కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. వాగ్వివాదాలకు దారితీస్తుంది.ఆత్మీయులతో మనస్పర్ధలు పెరుగుతాయి. సకాలంలో పనులుపూర్తి కావు. డబ్బు చేతికి అందు. పనివారితో ఇబ్బందులు. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకండి.


కర్కాటకంవారం ప్రారంభంలో అనుకూలత ఉంటుంది. వారాంతంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుంది. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మికత, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంత వరకు అనుకూలిస్తాయి. తల్లిదండ్రులు, పెద్దల సూచనలు, సహాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు.  వైద్య, ఉపాధ్యాయ వృత్తులలో ఉన్న వారికి  పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. వృథా ఖర్చులను నియంత్రించు కోవడం అవసరము. పనివారితో ఇబ్బందులు ఉంటాయి. 


సింహంమంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. ఆరోగ్యంగా వుంటారు. శ్రద్ధతో పనులు చేస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అన్నదమ్ములు, స్నేహితులు, ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యవసాయదారులకు అనుకూలం. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చర్చలు, వాదోపవాదాల మూలంగా మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. తోటి ఉద్యోగులతో ఇబ్బందులు. అనానుకూల ప్రాంతాలకు బదిలీలు. అధికారులతో గొడవలు. ప్రారంభించిన పనులు మెల్లిగా పూర్తి అవుతాయి.


కన్య


పిల్లల చదువు, ఉద్యోగం కలిసి వస్తుంది.  నిర్మాణ, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపారం అనుకూలిస్తుంది. భార్యా పిల్లలతో సంతృప్తిగా  వుంటారు. కళలపై శ్రద్ధ చూపుతారు. ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు చేస్తారు. మంచి వారితో సాహచర్యంతో పనులు నెరవేరుతాయి. ఉన్నతాధికారుల ఆదరణ ఉంటుంది. అయితే తోటి ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురు కావచ్చు. బంధువులతో అభిప్రాయ భేదాలు.  పెద్దల సహాయ సహకారాలను  అందుకుంటారు.


తులప్రభుత్వ, కార్పోరేటు ఉద్యోగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. తోటివారితో స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. సంతృప్తిగా, ఉత్సాహంతో పనులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.  స్వయం ఉపాధిలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.  శుభకార్యాలు వాయిదా పడవు. ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు కదలకపోవచ్చు.


వృశ్చికంఅన్నదమ్ములు, ఆత్మీయ స్నేహితులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. రాబడి పెరుగుతుంది.  పనులలో ఆలస్యం లేకపోయినా అనుకున్నంత ఫలితాలు ఉండక పోవచ్చును. అనుభవజ్ఞులు, పెద్దల సూచనలకు ప్రాధాన్యం నివ్వాలి. సాహిత్య, సంగీతాలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకున్న మేరకు ఫలించవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఉండక పోవచ్చును. ఉద్యోగంలో ఉన్న వారికి మనస్పర్థలు ఉంటాయి. ఆర్థిక సమస్య మటుకు ఉండక పోవచ్చును.


ధనుస్సువారం మధ్యలో కొంత అనుకూలత ఉంటుంది. పెండింగులో ఉన్న పనులు, ఉద్యోగ ప్రయత్నాలు  అనుకూలిస్తాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి వారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. కొత్త పెట్టుబడులను, కొత్త పనులను వాయిదా వేసుకోవడం అన్ని విధాలుగా మంచిది. అనవసరమైన ఆలోచనల మూలంగా మనస్తాపం, ఆందోళన, అనారోగ్య సమస్యలు ఉంటాయి. భార్యా పిల్లలతో విభేదాలు ఉంటాయి.  పనివారితో ఇబ్బందులు ఉంటాయి.


మకరం


కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. సంగీత, సాహిత్యాలపై మనసు నిలుపుతారు.  వ్యాపారం అనుకూలిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పోరేటు ఉద్యోగాలలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. పనులు నెరవేరుతాయి. ఆఫీసులో మంచి పేరు సంపాదిస్తారు.  ఉత్సాహంతో పనులు చేస్తారు. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. వాటిని కార్యరూపంలో పెట్టడానికి అనుకూలమైన సమయం. పెద్దల సూచనలను, సలహాలను పాటించక పోవడంతో కొన్ని పనులు వాయిదా పడే అవకాశం ఉంది.


కుంభం


వారం మొదట్లో ఇబ్బందులు ఉన్నా... క్రమేపీ మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా హాయిగా వుంటారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. వాటిని సద్వినియోగ పరచుకుని ఫలితాలను పొందుతారు. సాహిత్యంపై, ఆధ్యాత్మికతపై మనసు నిలుపుతారు. అన్నదమ్ములతో మనస్పర్ధలు ఉండవచ్చును. వాహనాల వల్ల ఖర్చులు ఉంటాయి. వ్యవసాయ దారులకు  ఇబ్బందులు తలెత్తుతాయి. డబ్బు సకాలంలో అందక పోవడంతో పనులు వాయిదా పడతాయి.


మీనంఈ వారం అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంలో భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులందరితోనూ సంతృప్తిగా వుంటారు. సంగీత, సాహిత్యాలపై, గ్రంథ పఠనంపై, ప్రవచనాలపై మనసు నిలుపుతారు. వస్తువులను కొనడానికి ప్రయత్నం చేస్తారు. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. పూర్వం ఉన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. వ్యవసాయ దారులకు దిగుబడి పెరిగి, అనుకూలంగా ఉంటుంది.


logo