శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Mar 29, 2020 , 00:01:51

అమ్మంటే ఉప్పెనంత ప్రేమ!

 అమ్మంటే ఉప్పెనంత ప్రేమ!

ఇండస్ట్రీకి కొత్త హీరో పరిచయం అయితే..  కొత్త హీరోయిన్‌ రావడం కూడా మామూలే..  మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడు..  సాయిధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ ఉప్పెనతో తెరంగేట్రం చేస్తున్నాడు..  అందులో హీరోయిన్‌గా క్రితీ శెట్టి  తెలుగు తెరకు పరిచయం అవుతున్నది.. ఇప్పటికే ఈమె ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.. పదహారణాల తెలుగమ్మాయిలా.. అమాయకత్వం నిండిన మోముతో కనిపిస్తున్న.. ఈ అమ్మడి గురించి నెట్టింట తెగ వెతికేస్తున్నారు..  అంత శ్రమ మీకెందుకని ఆ అమ్మాయి సంగతులన్నీ మేమే రాసుకొచ్చాం.. 
  • క్రితీ శెట్టి 21 సెప్టెంబర్‌ 2003న ముంబైలో పుట్టింది. తండ్రి కృష్ణ శెట్టి, తల్లి పేరు నీతి శెట్టి. స్కూల్‌లో ఉన్నప్పటి నుంచే మోడలింగ్‌ చేసింది. షాపర్స్‌ స్టాప్‌, లైఫ్‌బాయ్‌, క్యాడ్‌బరీ సిల్క్‌, యెప్పీ నూడుల్స్‌, వివిల్‌ సోప్‌లాంటివే కాదు.. చాలా కమర్షియల్‌ యాడ్‌లలో కనిపించింది.  చాలా చిన్న వయసులోనే కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. సంగీత అనే క్యారెక్టర్‌తో తెలుగు తెరకు పరిచయం అవుతున్నది. 
  • తండ్రి బిజినెస్‌ కారణంగా ముంబై నుంచి బెంగళూరుకు చేరుకుంది వీరి కుటుంబం. తన బాల్యం మొత్తం బెంగళూరులోనే గడిచింది. క్రితీకి.. తల్లి చేతివంట అంటే ఇష్టం. అమ్మ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటున్నది. ఒక్కతే కూతురు కావడంతో చాలా గారాబంగా పెంచారు తల్లిదండ్రులు. 
  • చిన్ననాటి స్నేహితులతో గడపడం అన్నా కజిన్స్‌ను కలువడమన్నా మహా సరదా అంటున్నదీ అమ్మడు. స్కూల్‌ ఈవెంట్ల ద్వారానే తనయాక్టింగ్‌ స్కిల్స్‌కి మెరుగులు దిద్దుకున్నది క్రితీ. అవే తన నటనా నైపుణ్యాన్ని పెంచాయంటున్నది. క్రితీ బిడియస్తురాలు. కానీ పని విషయానికొస్తే మాత్రం అనుకున్న సమయంలో అయిపోవాలనుకునే రకం.
  • క్రితీకి జంతువులంటే మహా ఇష్టం. ఇంట్లో ఇప్పటికే ఒక డాగీని పెంచుకుంటున్నదట. 
  • సోషల్‌మీడియాలో ఈ అమ్మాయి తక్కువ యాక్టివ్‌ అనే చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇన్‌స్టాలో నాలుగే పోస్టులు పెట్టింది. 
  • క్రితీ బెంగళూరు యూనివర్సిటీలో డిగ్రీలో జాయినయింది. 2022లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుంటుంది. 
  • క్రితీ తల్లి మాత్రం సోషల్‌ మీడియాలో మహాచురుకు. ఎందుకంటే క్రితీ చిన్నప్పటి ఫొటోలను ఆమె తెగ షేర్‌ చేస్తుంటుంది. 

-సౌమ్య నాగపురి