శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 23:53:38

కలంకారీ జాకెట్టు.. కలబోత అదిరేట్టు!

 కలంకారీ జాకెట్టు.. కలబోత అదిరేట్టు!

ఎంత సింపుల్‌ చీర కట్టినా.. దానికి ఎక్స్‌ట్రా గ్లామర్‌ తీసుకొచ్చేది జాకెట్టే. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అవుట్‌ఫిట్‌.. కలంకారీ జాకెట్‌. వేసవి తాపానికి కాటన్‌ కళతో అదిరేలా ఈ ఫ్యాషన్‌ని ఫాలో కావచ్చు. ఈ చీర.. ఆ చీర అని తేడా లేకుండా ఏ చీరకైనా పర్‌ఫెక్ట్‌ మ్యాచింగ్‌. కలం అంటే హిందీలో పెన్‌, కారీ.. చేసేవారు అని. ఈ పేరు నుంచే ఈ కళ ఉద్భవించింది. బ్లాక్‌ ప్రింట్‌తో రామాయణ, మహాభారత కథలను కాటన్‌ ఫ్యాబ్రిక్‌ మీద ప్రింట్‌ చేసేవారు. హైదరాబాద్‌లో పుట్టిన ఈ కళ ఆ తర్వాత అంతటా విస్తరించింది. ఇప్పుడు కేవలం బొమ్మలే కాకుండా పక్షులు, పువ్వులు వచ్చి చేరి  మరింత అందాన్ని తీసుకొచ్చాయి. 

ఫ్యాషన్‌ మంత్రం.. 

సాదాసీదా చీరకట్టుకు కూడా సూపర్‌గా అనిపించాలంటే కలంకారీ బ్లౌజ్‌ని ఎంచుకోవచ్చని ఫ్యాషనిస్టులు చెబుతున్నారు. ఫ్యాషన్‌ ప్రపంచం ర్యాంప్‌ల మీద కూడా ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నది. ప్లెయిన్‌ చీర కట్టినప్పుడు పువ్వుల ప్రింట్‌ వచ్చిన కలంకారీని ఎంచుకోవచ్చు. చేతులు కాస్త బొద్దుగా ఉన్నప్పుడు ఏ డిజైన్‌ ప్రింట్‌ వచ్చినా బోట్‌నెక్‌, చిన్న చేతులు పెట్టించుకోవడం మరువవద్దు. మరింత ైస్టెలిష్‌ లుక్‌ కోరుకునే వాళ్లు స్లీవ్‌లెస్‌, బోట్‌నెక్‌ ట్రై చేయొచ్చు. అయితే స్లీవ్‌లెస్‌ అనుకున్నప్పుడు జార్జెట్‌ చీరలు మంచి చాయిస్‌.క్లాసిక్‌ స్టయిల్‌.. 

కలంకారీ బ్లౌజ్‌లు అందంగానే కాదు.. మోడ్రన్‌ లుక్‌తోనూ మెరిసిపోతాయి. కాలనుగుణంగా ఈ ప్రింట్‌ని కాటన్‌ ఫ్యాబ్రిక్‌ మీదనే కాకుండా సిల్క్‌ ఇతర ఫ్యాబ్రిక్‌ల మీద కూడా ప్రింట్‌ చేస్తున్నారు. ఒకప్పుడు కాటన్‌ చీరల మీదకే ఈ బ్లౌజ్‌లు వేసేవారు. ఇప్పుడు కాంట్రాస్ట్‌ కాంబినేషన్‌లనే ఎక్కువగా ట్రై చేస్తున్నారు. ఆఫీసుకు వెళ్లేప్పుడు బోరింగ్‌ అనిపించకుండా ఉండాలనుకునేవాళ్లు చాలామందే ఉంటారు. అలాంటివారు కలంకారీ నేతతో వచ్చిన బ్లౌజ్‌లకు కాలర్‌నెక్‌ పెట్టించుకోవచ్చు. బుద్ధుడి ప్రింట్‌, ఫేస్‌ ప్రింట్‌ ఉన్నవి అయితే మరింత మంచిది. ప్లెయిన్‌ బ్లౌజ్‌గా కుట్టించి కావాలనుకుంటే కాలర్‌, హ్యాండ్స్‌ వరకు కలంకారీ ఫ్యాబ్రిక్‌ని డిఫరెంట్‌ ైస్టెల్‌గా డిజైన్‌ చేసుకోవచ్చు. 

ప్రయోగమే హద్దు.. 

ఒకే డిజైన్‌తో బ్లౌజ్‌ కుట్టించడం ఒకప్పటి మాట. ఇప్పుడు చేతులకు ముందు, వెనుక ఇలా ఒక్కో ప్రింట్‌ వచ్చిన కలంకారీ ఫ్యాబ్రిక్‌లను ఉపయోగించి కూడా ప్రయత్నించవచ్చు. కలంకారీ ఫ్యాబ్రిక్‌ను ప్లెయిన్‌ చీరలకు బార్డర్‌లుగా  జతచేయొచ్చు. సిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో, కలంకారీ మెటీరియల్‌ని జతచేసి రకరకాలుగా ప్రయోగాలు చేస్తే లుక్‌ అదిరిపోతుంది. ఇక కుట్టించడం విషయంలో కూడా బొటిక్స్‌ వివిధ రకాల డిజైన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. జాకెట్‌ మోడల్స్‌కి కూడా మంచి ఆదరణే ఉన్నది. ముందు, వెనుక నెక్‌ లైన్‌లు కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసుకోవచ్చు.  నెట్‌, కలంకారీ కాటన్‌ని మిక్స్‌ చేసి బ్లౌజ్‌లు కుట్టించే సంఖ్య పెరిగిపోతుందని ఫ్యాషన్‌ పండితులు చెబుతున్నారు.logo