ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Mar 28, 2020 , 23:04:07

సిటీ ఫ్లేవర్‌

సిటీ  ఫ్లేవర్‌

హైదరాబాద్‌... వెలుగు జిలుగుల నగరం..పొగలు గక్కే ఇరానీ చాయ్‌లు... విదేశీయులను మెప్పించిన బిర్యానీ అడ్డాలు.. ఆహ్లాదపరిచే కెఫేలు.. ఆహా అనిపించే రెస్టారెంట్లు..విస్తరించే మార్కెట్లు... బతుక్కు అర్థం చెప్పే జీవితాలు.. అప్యాయతను అద్దం పట్టే మనుషులు.. వీధులు, గాథలు, అందాలు.. ఐకాన్లు.. అంతకు మించి వైవిధ్యమైన కల్చర్‌కు కేరాఫ్‌ మన విశ్వనగరం..  పక్కా హైదరాబాదీ ఫ్లేవర్‌ను ఇక నుంచి వారం వారం అందించనుంది ఈ పేజీ..

‘యాప్‌'కా స్వాగత్‌

ఇంత పెద్ద నగరానికి కొత్తగా వచ్చినా,  హైదరాబాద్‌ కొట్టిన పిండే అయినా కొన్ని యాప్‌లు  చాలా అవసరాలను తీరుస్తాయి.  మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఈ అప్లికేషన్లు ఉంటే   సులభంగా పనులు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో  ‘dunzo’ ఒకటి.dunzo  అనేది 24 గంటల డెలివరీ కంపెనీ.  హైదరాబాద్‌  ప్రజలకు ఈ dunzo యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. కిరాణా సామగ్రి, మందులు, ఆహారం,  పండ్లు, మాంసం వంటి నిత్యావసర వస్తువులను క్షణాల్లో మీ ఇంటికి తెచ్చి పెడుతుంది. ఉదాహరణకు మీ ఏరియాలోని షాప్‌ నుంచి కూరగాయలు కావాలంటే ఈ యాప్‌లోకి వెళ్లి, అందుబాటులోని సంస్థ ప్రతినిధికి సమాచారం ఇవ్వాలి. మీరు చెప్పిన షాప్‌ నుంచి కావాల్సిన సామగ్రిని సమయానికి తెచ్చిపెడతారు. ప్రత్యేక ఆఫర్లు కూడా ఉంటాయి. 

ఆహ్లాదం... ఆహారం

పేరు : బీచ్‌ హౌస్‌

ఎక్కడ : మాదాపూర్‌ 

ప్రత్యేకత : బీచ్‌ వాతావరణం..

రెస్టారెంట్‌కు వెళ్లామా.. తిన్నామా.. బిల్లు కట్టామా... సాధారణంగా అందరూ చేసే  పనే.. ఇలాంటి రొటీన్‌ ఫీలింగ్‌ను దూరం చేసి ఆహారంతో పాటు ఆహ్లాదాన్నీ అందిస్తున్నాయి హైదరాబాద్‌లో ‘థీమ్‌  రెస్టారెంట్లు’. నిజానికి హైదరాబాద్‌ అంటేనే ‘ఫుడ్‌ కల్చర్‌కు అడ్డా’. విదేశీ ఆహారం నుంచి దేశీయ రుచుల  దాకా.. ఫైవ్‌ స్టార్‌ విందు నుంచి స్ట్రీట్‌ ఫుడ్‌ వరకూ అన్నీ ఆకట్టుకొనేవే. ఈ ట్రెండ్‌కు ‘థీమ్‌ రెస్టారెంట్లు’ కొత్త ట్రీట్‌మెంట్‌ని ఇస్తున్నాయి. అలాంటి వాటిలో ఇది ఒక్కటి..మీకు ఇసుక తిన్నెల్లో భోజనం చేయాలనుందా? క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ కోరుకుంటున్నారా? బీచ్‌లో ఫ్రెండ్స్‌తో చిల్‌   అవ్వాలనుందా? అయితే మీరు గోవాలాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పనే లేదు. హైదరాబాద్‌లోని ‘బీచ్‌ హౌస్‌' రెస్టారెంట్‌ కు వెళ్తే చాలు. అవును ఈ రెస్టారెంట్‌ను బీచ్‌ థీమ్‌తో డిజైన్‌ చేశారు.  ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో వెళ్లడానికి అనుకూలంగా ఉంటుంది. అచ్చం బీచ్‌ను పోలిన వాతావరణం, ఇసుక, కుర్చీలు బీచ్‌లో ఉన్నట్టే కనిపిస్తాయి. లైవ్‌ మ్యూజిక్‌ ప్లే చేస్తారు. ఇంకా మ్యూజికల్‌ నైట్‌, క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ పార్టీలకు ప్రత్యేక వారాలను కేటాయించారు. బీచ్‌ వాతావరణం అంటే ఎవరైనా ‘సీ ఫుడ్‌' తినాలని అనుకుంటారు.. డౌటే లేదు. ఈ రెస్టారెంట్‌లో టేస్టీ సీ ఫుడ్‌ను కూడా అందిస్తారు. సౌత్‌, నార్త్‌ ఇండియన్‌ ఫుడ్‌ను కూడా టేస్ట్‌ చేయవచ్చు. ధర కూడా సాధారణంగానే ఉంటుంది. మినిమమ్‌ ప్రైస్‌ రూ. ఏడు వందలు. గూగుల్‌ రివ్యూస్‌ : 2975, గూగుల్‌ యూజర్‌ రేటింగ్‌ 4/5వాడిపోని పువ్వులు

ఈవెంట్లు.. పార్టీలు.. ఫంక్షన్లు .. పండుగలు.. ఏవైనా సరే ‘బొకేలు’ ఇవ్వడం కామన్‌. కానీ అవి ఎక్కువ సమయం నిల్వ ఉండవు.  ఇదంతా ‘చారానా కోడికి బారానా మసాల’ లెక్కనే కదా!.. అందుకే వాడిపోని పువ్వులుంటే ఎలా ఉంటుంది? అంటే ప్లాస్టిక్‌ పువ్వులు కాదు.. సహజమైనవే,  కానీ టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ కాలం తాజాగా ఉండే పువ్వులు సిటీలో అందుబాటులో ఉన్నాయి.  బహుమతులుగా వీటిని ఇవ్వొచ్చు. గులాబీ, తులిప్‌ లాంటి పుష్పాలను Flowerwali, champs fleur లాంటి స్టార్టప్‌లు ప్రిజర్వేటింగ్‌ టెక్నాలజీతో వాడిపోకుండా చేస్తున్నాయి. ఇవి ఏడాదికి పైగా నిల్వ ఉంటాయి.  ఫ్లవర్‌ వాలీ  పుష్పాలు ఇంకొంచెం అడ్వాన్స్‌గా ఉంటాయి. వాటిపై పేర్లు, బొమ్మలు కూడా వేయించుకోవచ్చు.  ఆ పూలు అందుకున్నవారు ఫిదా అయిపోవాల్సిందే.ఫ్లవర్‌ వాలీ : www.instagram.com/ flowerwali

శ్యాంష్‌ ఫ్లోర్‌ champsfleur.com

అతి పొడవైన ఫ్లైఓవర్‌..

భారతదేశంలోనే అతి పొడవైనది... పీవీ నరసింహారావు ఫ్లైఓవర్‌. ఇది మన హైదరాబాద్‌లోనే ఉంది. 11.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మెహిదీపట్నం నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకి తీసుకెళ్తుంది. హైదరాబాద్‌-బెంగళూర్‌ నేషనల్‌ హైవే నంబర్‌ 7 మీద నిర్మితమైన ఎలివేటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే ఇది. దీని మీద ద్విచక్రవాహనాలకు అనుమతి లేదు.logo