బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Mar 15, 2020 , T01:15

100% నటి కావాలని..

100% నటి కావాలని..

మరియం స్వీడన్‌లోని జకారియాలో 27 సెప్టెంబర్‌ 1984న పుట్టింది. 

జకారియాలో మోడల్‌గా, డ్యాన్స్‌ టీచర్‌గా, కొరియాగ్రాఫర్‌గా కూడా పనిచేసింది. 

అర్జున సినిమా 2013లో పూర్తయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఇప్పుడు విడుదల అయింది. 

మరియం ‘బజాతే రహో’ సినిమాలో నాగిన్‌ డ్యాన్స్‌తో మరింత ఫేమస్‌ అయింది. 


2017 తర్వాత ఈ అమ్మడు ఏ వీడియోలోనూ, ఏ సినిమాలోనూ కనిపించలేదు. తను ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నది. 

2012లో డ్యాన్స్‌ డైరెక్టర్‌ అరవింద్‌ ఠాకూర్‌ని గోవాలో పెండ్లి చేసుకుంది. 2015లో అబ్బాయికి జన్మనిచ్చింది. 

కోకాకోలా యాడ్‌తో ఇండియాకి చేరిందీ భామ. సెట్‌వెట్‌, లేజ్‌ యాడ్స్‌ల్లోనూ మెరిసింది. ఇవికాకుండా.. కింగ్‌ఫిషర్‌ స్పీడ్‌ దివా, చెన్నై సిల్క్‌కి మోడల్‌గా పనిచేసింది. 


సినిమాల్లోకి రాకముందు ప్రభుదేవాను చూసుకుంటూ కొరియోగ్రఫీ నేర్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చాక ముందు కలిసింది కూడా ప్రభుదేవానేనట. 

స్వీడన్‌లో బాలీవుడ్‌ డ్యాన్స్‌ స్కూల్‌ ‘ఇండిస్క్‌ డ్యాన్స్‌ స్టూడియో’ పేరుతో స్థాపించింది. ఇలా ఒక బాలీవుడ్‌ పాటలతో డ్యాన్స్‌ స్కూల్‌ స్వీడన్‌లో స్థాపించడం మొదటిది కావడం విశేషం. 

సికిందర్‌ తమిళ సినిమాల్లో, ఏజెంట్‌ వినోద్‌లాంటి హిందీ సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. కానీ పూర్తి స్థాయిలో నటిగా నిరూపించుకోవాలని కోరుకుంటున్నది. 

తమిళ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు పక్కటెముకల్లో నొప్పి వచ్చింది. అయినా ఆ నొప్పిని భరిస్తూ ఆ పాట పూర్తి చేసింది మరియం. 

ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. అవకాశం వస్తే.. మళ్లీ సౌత్‌ ఇండియన్‌ ఇండస్ట్రీలో చేయడానికి సిద్ధంగా ఉన్నానని అంటున్నదీ భామ. 

సౌమ్య నాగపురి


logo