బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Mar 15, 2020 , T00:10

రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాలు చేస్తారు. సమాజంలో మంచివారితో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులు కొత్త పనులు, ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. పరీక్షలలో మంచిస్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. శ్రద్ధతో పనులు చేయడం వల్ల అనుభవాన్ని, తృప్తిని పొందుతారు.

కుటుంబీకులతో సంతృప్తికరంగా, హాయిగా వుంటారు. వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా తాత్కాలిక ప్రయోజనాలు ఈ వారంలో ఉంటాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయవాద, వైద్యవృత్తిలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. రాణిస్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఉద్యోగస్థులకు ఆఫీసులో అందరి సహాయ సహకారాలు అందుతాయి. తోటి ఉద్యోగస్తులతో సంయమనంతో ఉంటారు. పై అధికారులతో కొంత అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సంగీత, సాహిత్య, సభలకు, సమావేశాలకు హాజరవుతారు. 

మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి శుభకార్య సమాలోచన, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మంచి స్థాయిలో నిలుస్తారు. సమాజంలో మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. నిత్యం వ్యాపారం లాభిస్తుంది. పూర్వపు పెట్టుబడుల వల్ల లాభాలు పొందుతారు. న్యాయవాద, ఉపాధ్యాయ, వైద్య వృత్తుల్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 


కర్కాటకం

ఈ రాశి వారికి  ఈ వారంలో మంచి స్నేహితులు ఏర్పడతారు. చుట్టాలతో మంచి సంబంధాలు ఉంటాయి. అన్యోన్యంగా వుంటారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. వ్యవసాయ దారులకు పనులు నెరవేరుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేయడానికి ప్రయత్నిస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. అనుభవజ్ఞుల సూచనలతో  పనులు చేయడంతో పనులు పూర్తవుతాయి. నిత్యావసర వస్తు వ్యాపారంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. షేర్‌, వడ్డీ వ్యాపారస్తులు కొంత జాగ్రత్తతో ఉండటం మంచిది. విద్యార్థులు శ్రమించాలి. కొత్త పనులను ప్రారంభించకుండా పాత వాటిని పూర్తి చేయాలి. 


సింహం

ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. సమాజంలో నలుగురిలో పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు బాగా అనుకూలమైన వారం. శ్రమకు తగ్గ  ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. పనివారితో సమస్యలు తీరుతాయి. పనులు చకచకా ముందుకు సాగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. 


కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, పెద్ద పనులు చేసేముందు బాగా ఆలోచించాలి. మరోవైపు తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. నిత్యం వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద, వైద్య వృత్తిలోని వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబీకులతో సంతోషంగా వుంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. సంఘంలో గుర్తింపు, పెద్దవారి సహాయ సహకారాలు ఉండడం వల్ల కొన్ని పనులు కలిసి వస్తాయి. విద్యార్థులు శ్రమించాలి. 


తుల

ఈ రాశి వారికి ఈ వారంలో అర్దాష్టమ శని ఉంది. దీనివల్ల ఇంట్లో మనస్పర్థలుండవచ్చు.పనులు ముందుకు సాగకపోవడం, వృథా ఖర్చులు  ఉంటాయి.  విద్యార్థులు బాగా కష్టపడాలి. అనుకున్న స్థాయిలో నిలవడానికి శ్రద్ధాసక్తులతో ముందుకు వెళ్లాలి. నిత్య వ్యాపారంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. తాత్కాలికంగా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి.  స్నేహితులు, బంధువర్గంతో పనులు కొంతవరకు ఫలిస్తాయి. వ్యవసాయదారులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. నిత్య వ్యాపారంలో లాభాలుంటాయి. న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. బాగా కలిసి వస్తుంది. షేర్‌, వడ్డీ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆలోచించి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలను గడిస్తారు. పనివారితో సమస్యలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. చదువులో రాణిస్తారు. పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. 


ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాల స్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి నిర్ణయాలు అన్నింటిలోనూ జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సమన్వయం ఉంటుంది. సంతృప్తిగా ఉంటారు. అయితే నిత్య వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.  కొత్త పనులు ప్రారంభించాలనే తపన ఉన్నప్పటికీ కలిసిరాకపోవడం. అనుభవజ్ఞులు, తల్లిదండ్రుల సహాయ సహకారాలు అందవు.  వ్యాపారస్థులు జాగ్రత్త పాటించడం అవసరం.  ఉద్యోగులు ఆలోచించి పనులు చేయాలి.


మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. కుటుంబ సభ్యులతో పిల్లలతో సంతృప్తిగా వుంటారు. కొత్త వస్తువులు కొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి ప్రధానంగా ఈ వారం అనుకూలిస్తుంది. ఉద్యోగంలో తాత్కాలిక ప్రయోజనాలున్నాయి. ఆఫీసులో అందరితోనూ సమన్వయంతో ముందుకు వెళతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు.   తోటి ఉద్యోగుల సహకారాలు బాగా ఉంటాయి. 


కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు ఆచరిస్తారు. పిల్లల విషయంలో చదువు, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్నదమ్ములు, బంధువులతో సంబంధాలుంటాయి.  నిర్మాణరంగంలో ఉన్న వారికి కలిసివస్తుంది. కొత్త ప్రాజెక్టులను, కొత్త పనులను ప్రారంభిస్తారు. బంధువుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు, నదీస్నానాలు ఆచరిస్తారు. సినిమారంగంలోని వారికి పనులు పూర్తవుతాయి.


మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలోని వారికి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పనులలో కదలిక, పనివారితో ఉన్న సమస్యలు  పరిష్కారం అవుతాయి. ఇంట్లో భార్యా పిల్లలందరితోనూ సఖ్యతతో ఉంటారు. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. సభలకు, సమావేశాలకు, విందులకు హాజరవుతారు. నిత్యావసర వస్తు వ్యాపారం, వడ్డీ, షేర్‌, వస్త్ర, సుగంధ ద్రవ్యాలు, ఫ్యాన్సీ వంటి వ్యాపారాలలో ఉన్న వారికి ఈ వారం తాత్కాలికంగా ప్రయోజన కరంగా ఉంటుంది.  


logo