బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Mar 07, 2020 , 23:11:12

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి

శీర్షిక చూస్తే మీకేమనిపిస్తుంది..? ఇదొక సినిమా టైటిల్‌ అని అర్థమయిపోయింది కదా! అవును.. ఆ టైటిల్‌తో వస్తున్న సినిమాలో ఈ భామ కూడా ఉంది.. పేరు.. త్రిదా చౌదరి. బెంగాలీ భామ. ఈ సినిమా టైటిల్‌లాగే తన జీవితంలోనూ జరిగిందట. త్రిద సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదు.. కానీ ఇప్పుడు హీరోయిన్‌గా చాలా సినిమాలు చేస్తున్నది.. ఆమె గురించి కొన్ని సమ్‌గతులు ఇవి. 


త్రిదకు కోపం వస్తే.. 

 • సౌండు ఎక్కువ పెట్టుకొని పాటలు వింటుందట. సౌండ్‌ తగ్గిందంటే తన కోపం కూడా చల్లారిందని అనుకోవాలంటున్నదీ అమ్మడు. ఆ సమయంలో ఎవ్వరితోనూ మాట్లాడదట. 


ప్రాంక్స్‌ 

 • చేయడమంటే సరదా. ఎవరినైనా ఫూల్‌ చేసి నవ్వుకోవడం ఇష్టమంటున్నది. తనమీద చేసినా కూడా స్పోర్టివ్‌గానే తీసుకుంటుందట. 2013లో ‘మిశ్వర్‌ రావహోషో’ అనే బెంగాలీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఎక్కువగా బెంగాలీ సినిమాల్లోనే కనిపించిందీ అమ్మడు. 
 • స్టార్‌ప్లస్‌లో ‘దహ్లీజ్‌' అనే సీరియల్‌తో మంచి మార్కులు కొట్టేసింది. స్పాట్‌లైట్‌ అనే వెబ్‌సిరీస్‌తో మరింత గుర్తింపు తెచ్చుకుంది. 
 • ఇన్‌స్టాలో వివిధ ప్రదేశాల్లో బికినీలతో దిగిన ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తూ హాట్‌ లేడీగా గుర్తింపు పొందింది. ఇప్పటికి 600కె ఫాలోవర్లు ఉన్నారు. 
 • త్రిదా చౌదరి.. 22 నవంబర్‌ 1993న కోల్‌కతాలో జన్మించింది. 
 • ఎం.పి. బిర్లా ఫౌండేషన్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌లో తన చదువు పూర్తి చేసింది. 
 • మైక్రోబయాలజీ డిగ్రీలో డిస్టింక్షన్‌లో పాసయింది. ఎప్పటికైనా మైక్రోబయాలజిస్ట్‌ అవ్వాలనేది ఆమె జీవిత ఆశయం. 
 • ‘సూర్య వర్సెస్‌ సూర్య’తో తెలుగు తెరపై కనిపించింది. ఆ తర్వాత ‘మనసుకు నచ్చింది’, ‘7’ సినిమాతో తెలుగు తెరపై మెరిసింది. 
 • 14 సంవత్సరాలుగా క్లాసిక్‌, ఒరియా డ్యాన్స్‌ నేర్చుకుంటున్నది. 
 • 2011లో ‘కలకత్తా టైమ్‌ ఫ్రెష్‌ ఫేస్‌ కాంపిటేషన్‌'లో కిరీటాన్నిదక్కించుకున్నది. అప్పుడే తన కెరీర్‌ని మార్చుకొని హీరోయిన్‌ అవ్వాలనుకున్నది. 
 • చైనీస్‌, ఓరియంటల్‌ ఫుడ్‌ ఉంటే చాలు. తనను చూసి తక్కువ తింటానని మాత్రం అనుకోవద్దంటున్నదీ బెంగాలీ భామ. 
 • మేకప్‌ సామాన్లు కొనేటప్పుడు చాలా కన్‌ఫ్యూజ్‌ అవుతుందట. కనీసం పదిరకాల లిప్‌స్టిక్స్‌ని ట్రై చేసి కానీ కొనదట. 
 • పర్‌ఫ్యూమ్స్‌ అంటే పిచ్చి. ఎవరైనా గిఫ్ట్‌గా పర్‌ఫ్యూమ్స్‌ ఇస్తే తెగ సంబరపడిపోతుందట. -సౌమ్య నాగపురి


logo