రాజకీయాలు, ప్రజాజీవితాల్లో ఉన్నవాళ్లు వ్యక్తిగత అంశాల్ని కోల్పోవాల్సి వస్తుంది. పీవీ ఓ సందర్భంలో సమయస్ఫూర్తి గురించి ఓ మాట అన్నారు. ‘మీలో సమయస్ఫూర్తి ఏమీ తగ్గలేదు.. అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి సమయస్ఫూర్తి ప్రదర్శించారో పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడుతున్నా’రని ఓ జర్నలిస్ట్ అన్నప్పుడు ఆయన ప్రతిస్పందించారు. ‘వాస్తవానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టకముందే నాకు సమయస్ఫూర్తి ఉంది. పదవి నుంచి దిగిపోయిన తర్వాత తిరిగి వచ్చింది‘. అన్నారు. అందుకు ఆ జర్నలిస్ట్ స్పందిస్తూ.. అంటే అధికారంలో ఉన్నప్పుడు కోల్పోయారా అని ప్రశ్నించారు. అందుకు పీవీ.. ‘అధికారంలో ఉన్నప్పుడు జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది’ అని ఒక్క వాక్యంలో ఎంతో అర్థాన్ని వ్యక్తపరిచారు.