మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , 00:40:58

నీళ్లల్లో తేలియాడాలని..

నీళ్లల్లో తేలియాడాలని..

మాయ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.. అటుపై మీకు మీరే మాకు మేమే అంటూ ఆడిపాడింది.. వైశాఖంలో హీరోయిన్‌గా మంచి మార్కులు కొట్టేసింది..కానీ చదువు గురించి కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చింది..మీకు మాత్రమే చెబుతా అంటూ మళ్లీ పుంజుకున్నది.. ఇప్పుడు భీష్మలోనూ క్యూట్‌ క్యారెక్టర్‌లో మెరిసింది.. ఆ భామే అవంతికా మిశ్ర. ఆ అమ్మడి సంగతులే ఇవి..

 • మహేష్‌బాబు కాకుండా.. నాని, అల్లు అర్జున్‌ అంటే ఇష్టమంటున్నది.  
 • అవంతిక టామ్‌బాయ్‌లా పెరిగింది. ఎక్కువ కజిన్స్‌తో ఫుట్‌బాల్‌ ఆడేది. వాళ్లతో గడపడం వల్లనేమో లవ్‌ చేయడానికి సమయం దొరకలేదంటున్నదీ అమ్మడు. 
 • ఈమెకు ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టమట. ఏ కాస్త సమయం దొరికినా బ్యాగ్‌ సర్దేసి ఎక్కడికో అక్కడికి చెక్కేస్తుంది.
 • ట్రెక్కింగ్‌, క్యాంపులు వేసుకొని రాత్రంతా అలా వెన్నెల చూస్తూ పడుకోవడమంటే సరదా అంటున్నది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు.. ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లకూడదని చెబుతుంటారు. కానీ అవంతికకి సాహసాలు చేయడం సరదా కాబట్టి అలాంటి 
 • ప్రదేశాలకు వెళుతుందట. 
 • స్వస్థలం ఢిల్లీ అయినా.. పుట్టి, పెరిగిందంతా బెంగళూరులోనే. 
 • చాలా సంతోషంగా ఉంటే.. బిర్యానీ, చాక్లెట్లు తింటుందట. మరీ ఎక్కువ అనిపిస్తే బాగా నిద్రపోతుందట. 
 • మహేష్‌బాబుతో దాదాపు మూడు యాడ్స్‌ల్లో మెరిసిందీ భామ. అందుకే ఆ హీరోతో బిగ్‌స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉబలాటపడుతున్నది. 
 • పంజాబీ ఫ్యామిలీ కావడంతో.. చిన్నప్పటి నుంచి ఏ చిన్న ఫంక్షన్‌ అయినా కుటుంబమంతా డ్యాన్స్‌ చేసేవారట. అందుకే ప్రత్యేకంగా డ్యాన్స్‌ కోసం క్లాసులకు వెళ్లే పని లేకుండా పోయిందంటున్నదీ భామ.  
 • సంవత్సరంలో.. రెజల్యూషన్స్‌ తీసుకునే అలవాటు అస్సలు లేదంటున్నది. అలా తీసుకుంటే అస్సలు పాటించే రకం కాదు అవంతిక. 
 • పుస్తకాలు బాగా చదువుతుంది. సినిమాలు చూడడమంటే ఇష్టం. స్కాష్‌ ఆట కూడా బాగా ఆడుతుంది. 
 • అవంతిక కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. చదువుతూనే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ప్యూమా, ఫెమినా, తనిష్క్‌.. ఇలా చాలా బ్రాండ్స్‌కి పనిచేసింది. 
 • అవంతిక చిన్నప్పుడు కథక్‌ నేర్చుకుంది. కాకపోతే ఆమెకు ఫోక్‌ డ్యాన్స్‌లు చేయడమంటే ఇష్టమంటున్నది.
 • స్కూబా డైవింగ్‌ చేయడమంటే ఇష్టం. మనుషులతో కంటే.. నీళ్లలో ఆ సముద్ర జీవుల మధ్య గడపడం ఇష్టమంటున్నది. 
 • తండ్రి ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసేవారు. అందుకే తన చదువంతా ఎయిర్‌ఫోర్స్‌ స్కూల్‌లోనే జరిగింది. 


సౌమ్య నాగపురి


logo