ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Feb 29, 2020 , 23:42:33

నెట్టిల్లు

నెట్టిల్లు

ఎంతో మంది ఆసక్తి ఉన్న యువకులు ఈ లఘుచిత్రాల ద్వారా ప్రతిభను నిరూపించుకుంటున్నారు. వీటితో సినిమారంగంలో వారి కలలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారు తీసిన లఘుచిత్రాల్లో కొన్ని సమీక్షలే ఇవి..

మైథిలి


దర్శకత్వం : ప్రవీణ్‌

పాత్రలు : సూర్య, సాయిశ్వేత

అతను పెండ్లి చూపులకు బయల్దేరతాడు. కానీ ఆతనికి ఇష్టం ఉండదు. మధ్యలో వెళ్తుంటే ఓ అమ్మాయి కనిపిస్తుంది. చూడగానే నచ్చుతుంది. మరోవైపు  ఆమె స్కూటీ చెడిపోయి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఈ సాకుతో ఆమెతో మాటలు కలుపుతాడు. స్కూటీ బాగవడానికి టైం పడుతుందని మెకానిక్‌ అంటాడు.  ఈ గ్యాప్‌లో ఎలా అయినా ఇంప్రెస్‌ చేయాలని చూస్తాడు. కానీ ఆ అమ్మాయి నుంచి ఎలాంటి స్పందనా ఉండదు. ప్రేమ పట్ల తనకు ఉన్న అభిప్రాయం చెప్పి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ పేరు చెప్పి వెళ్తుంది. ఆమె పేరు మైథిలి. మరోవైపు అబ్బాయి పెళ్లి చూపులు రద్దవుతాయి. కానీ ఇంతలోనే పెళ్లి సంబంధ వివరాలు వస్తాయి. అమ్మాయి ఫొటో, ఫోన్‌ నంబర్‌ చూసి ఆశ్చర్యపోతాడు. ఆ వివరాలు మైథిలివి. ఇంకేముంది ఫోన్‌ చేసి మాట్లాడతాడు. తర్వాత ఏం జరుగుతుందో యూట్యూబ్‌లో చూడండి


Total views 333, 860+ (ఫిబ్రవరి 21 నాటికి) Published on FEB  2020తను


దర్శకత్వం : వర్ధన్‌ 

పాత్రలు : వినయ్‌, మధు, వందన

షార్ట్‌ఫిల్మ్స్‌  తీయాలని కలలు కంటున్న ఒకతను  స్టోరీని స్నేహితురాలికి చెప్తాడు. కథ విషయానికి వస్తే అతను ఒక ఆర్టిస్ట్‌. అమ్మాయి పేరు ‘తను’. ఇద్దరూ ఒకటే క్లాస్‌. మొదటి రోజు కాలేజీలో ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. మాట్లాడడానికి  ప్రయత్నిస్తాడు. కొద్దిసేపటి తర్వాత నంబర్‌ కూడా ఇస్తాడు. మరుసటి రోజు ఆమె అతనికి ఫోన్‌ చేస్తుంది. వాళ్ల మధ్య పరిచయం పెరుగుతుంది. కానీ అమ్మాయి చాలా ఆల్కాహాలిక్‌. విపరీతమైన మద్యం, సిగరెట్లు తాగుతుంది. ఒకరకంగా ఇది అతనికి నచ్చదు.  ఇంకా ఆమె స్నేహితులతో సన్నిహితంగా ఉండడం అతనికి ఇబ్బందిగా ఉంటుంది. ఓ రోజు అమ్మాయి ఇంటికి వచ్పిన అతను ఇదే విషయాలు చెప్తాడు. కానీ ఆమె లైఫ్‌ ఆమె ఇష్టం అని చెప్తుంది. దీంతో అతను బాధపడి వెళ్లిపోతాడు. ఇది అతను స్నేహితురాలికి చెప్తున్న స్టోరీ. కానీ ఈ స్టోరీ ఎందుకు రాయాల్సి వచ్చిందో కూడా చెప్తాడు. అది తెలియాలంటే మీరు యూట్యూబ్‌కు వెళ్లాల్సిందే.Total views 848+ (ఫిబ్రవరి 21 నాటికి) Published on FEB  2020


ఓం నమహ


దర్శకత్వం: సాయిమోహన్‌

సూర్య కాలేజీ విద్యార్థి. తన లైఫ్‌లో అన్నీ ఆటోమేటిక్‌గా జరుగాలి అనుకుంటాడు. ఈ క్రమంలోనే అతని లైఫ్‌లోకి ఓ అమ్మాయి వస్తుంది. ఆమె పేరు ‘మహా’ అతని జూనియర్‌. ప్రేమిస్తాడు. కలిసి తిరుగుతారు. ఓ రోజు మహాను కొందరు వ్యక్తులు ఏడిపిస్తారు. దీన్ని గమనించిన సూర్య వాళ్లను చితకబాదుతాడు. సూర్య బిహేవియర్‌ చూసిన మహా తప్పుగా అర్థం చేసుకుంటుంది. కానీ తర్వాత మళ్లీ కన్విన్స్‌ అవుతుంది. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత మహా పూర్తిగా మారిపోతుంది. సూర్యను ఏ మాత్రం పట్టించుకోదు. ‘నా లైఫ్‌ నుంచి వెళ్లిపో’ అని ముఖం మీదే చెప్పేస్తుంది. ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కాదు. వీరి ప్రేమ గురించి మహా తండ్రికి తెలుస్తుంది. సూర్యను ఎలాగైనా దూరం చేయాలనే పథకం వేస్తాడు. మరోవైపు మహాకు పెండ్లి అవుతుంది. రోజులు గడుస్తాయి. సూర్యకు ఇదంతా పెద్ద అగాధంలా కనిపిస్తుంది. తీవ్ర మనోవైదనకు గురవుతాడు. అప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి. అసలెందుకు ఇలా జరిగిందో అంతా తెలుసుకుంటాడు. అదెంటో మీకూ తెలియాలంటే ఈ లఘుచిత్రం చూడండి..
Total views 160,059+ (ఫిబ్రవరి 22 నాటికి) Published on Feb 16, 20200


నీరు 

దర్శకత్వం : గోపాల్‌

పాత్రలు : వాసవి, మనియమ్మ

నీరు దాని అవసరాన్ని తెలియజేసే లఘుచిత్రం. జీవరాశులను వెంటాడే సమస్యలో నీటి కొరత ప్రధానమైంది. కథ విషయానికి వస్తే.. ఒక పేద కుటుంబంలో ఇంటి పెద్దాయన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అతని కూతురు చదువుకుంటుంది. కూలి పని చేసి కుటుంబాన్ని సాకుతుంది తల్లి. ఈ క్రమంలో ఊర్లో నీటి సమస్య ఏర్పడుతుంది. బావుల్లో నీరు ఇంకిపోతుంది. బిందెడు నీటి కోసం ఆ తల్లి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తుంది. ఓ రోజు నీటి అవసరం కోసం ఇలాగే బయల్దేరుతుంది. ఇంటిదగ్గర తండ్రిని జాగ్రత్తగా చూసుకొమ్మని ఆ పాపకు చెప్తుంది. కొద్ది సేపటి తర్వాత అనారోగ్యంతో ఉన్న తండ్రికి దాహం వేస్తుంది. కానీ నీళ్లు సరిపోవు. దీంతో ఆ పాప చుట్టుపక్కల వాళ్లను నీళ్లు అడిగినా లేవంటారు. అయినా ఆమె తీవ్రంగా కష్టపడుతుంది. ఊరిచివరకు వెళ్లి నీళ్లు తీసుకొని వస్తుంది. నీళ్లు తెచ్చినా ఉపయోగం ఉండదు. తండ్రి మంచంలోనే ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. చాలా ఉద్వేగభరితంగా సాగుతుంది ఈ షార్ట్‌ ఫిల్మ్‌. నీటిని వృథా చేయొద్దు అనే సందేశం ఈ లఘుచిత్రం ద్వారా అర్థం అవుతుంది. మీరూ చూడండి. 
Total views 3248+ (ఫిబ్రవరి 22 నాటికి) Published on Feb 22, 2020


వినోద్‌ మామిడాల,  సెల్‌: 7660066469


logo