ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Mar 01, 2020 , T00:01

రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉంటారు. సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి. బయటి వ్యక్తుల సహకారాలు అందుతాయి. పనులు  అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. నిత్య వ్యాపారంలో సమయస్ఫూర్తితో పెట్టుబడులు పెట్టడం, తద్వారా రాబడి సకాలంలో చేతికి అందుతుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. అంతేకాకుండా ఆదాయ మార్గాలు బాగా అనుకూలిస్తాయి. 


వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా ఈ వారంలో  కొంత మెరుగైన ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు డబ్బు విషయంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు ముందుకు సాగుతాయి. నిత్యం వ్యాపారం ఆటంకాలు లేకుండా సాగుతుంది. న్యాయవాద, వైద్య వృత్తుల వారికి అనుకూలం. రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో తోటి వారితో, పై అధికారులతో సామరస్యత ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ప్రధానంగా పనిలో నిబద్ధత, మంచి ఆలోచలనతో ముందుకు వెళ్లడం అవసరం. 


మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావంతో అనవసరమైన ఖర్చులు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చును. జాగ్రత్త అవసరం. పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచి సంబంధాలు పెరుగుతాయి. చదువు నిరాటంకంగా సాగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో పేరును సంపాదిస్తారు. తద్వారా చాలా పనులు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా ఉంటారు. వారి సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్న వారికి ఈ వారం అనుకూలిస్తుంది.


కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారం ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా నిర్మాణరంగం, వ్యవసాయదారులకు ఈ వారం బాగా కలిసివస్తుంది. అనుకున్న స్థాయిలో పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రులు, పెద్దలు, సమాజంలోని అనుభవజ్ఞుల సహాయ సహకారాలు బాగా అందుతాయి. విహార యాత్రలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నదీ స్నానాలను ఆచరిస్తారు. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కలిసి వస్తాయి. కొత్త పనులను చేపడతారు. న్యాయవాద, ఇంజినీరింగ్‌ వృత్తుల్లోని వారికి ఈ వారం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 


సింహం

ఈ వారంలో ఈ రాశి విద్యార్థులకు కలిసివస్తుంది. అనుకున్న స్థాయిలో ఫలితాలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు వస్తుంది. కొత్త పనులను చేపడతారు. పనివారితో సమస్యలు దూరమవుతాయి. పనులు సునాయాసంగా ముం దుకు సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు బాగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పెద్దలను గౌరవిస్తూ, వారి సహాయ సహకారాలు తీసుకొంటే చాలా పనులలో మంచి ఫలితాలను పొందుతారు. 


కన్య

 ఈ రాశి వారు ఈ వారంలో పనులలో ఉత్సాహం కనబరుస్తారు. ఉద్యోగులకు కలిసి వస్తుంది. ప్రమోషన్‌లు, పనులను సమర్థవంతంగా చేయడంతో మంచి పేరును పొందుతారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. న్యాయవాద, వైద్య వృత్తిలోని వారికి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరి సహాయ సహకారాలు అందుతాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త పనులు వస్తాయి. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. నిత్యం వ్యాపారం అనుకూలిస్తుంది. 


తుల

 ఈ రాశి వారికి ఈ వారంలో ప్రధాన  గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది. జాగ్రత్త అవసరం. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. ధైర్య సాహసాలతో పనులు చేయాల్సి ఉంటుంది. రియల్‌ ఎస్టేట్‌ నిర్మాణ రంగంలోని వారికి తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. భక్తి భావన, ఆధ్యాత్మికత పెంపొందించుకుంటారు. శ్రద్ధతో, నిబద్ధతతో పనులు చేయాలి. 


వృశ్చికం

ఈ వారంలో ఈ రాశి వారికి నిత్య వ్యాపారం కలిసివస్తుంది. నిత్యావసర వస్తు వ్యాపారం, షేర్‌, వడ్డీ వ్యాపారం అనుకూలిస్తాయి. న్యాయవాద వృత్తిలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయ పరిస్థితి పెరుగుతుంది. నలుగురితో సంబంధాలు పెంపొందుతాయి. పేరును సంపాదిస్తారు. పనివారు అనుకూలంగా ఉంటారు. రావాల్సిన డబ్బు వస్తుంది. కొత్త పనులు చేస్తారు. చరాస్తులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో వారికి ఈ వారం ఉద్యోగం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు రాణిస్తారు. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. 


ధనుస్సు

 ఈ రాశి వారు ఈ వారంలో కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి పై నాయకులతో ఇబ్బందులు ఉన్నా తోటి వారి సహాయ సహకారాలు, కార్యకర్తల అనుకూలత బాగా ఉంటుంది. ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచన అవసరం. అనవసరమైన ప్రయాణాలను, పనులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. సంఘంలో మంచి వారి సాహచర్యం ఉపయోగపడుతుంది. కొన్ని పనులు  పూర్తవుతాయి. విద్యార్థులు ముఖ్యంగా శ్రమించాలి.


మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో  సంతృప్తిగా వుంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కలిసి వస్తుంది. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. అయితే అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండడం చాలా అవసరం. ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సహాయ సహకారాలు, సూచనలను తప్పకుండా పాటిస్తూ ముందుకు పోవాలి. 


కుంభం

 ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి, ఆధ్యాత్మికత పెరుగుతుంది. విద్యార్థులు అనుకున్న స్థాయిలో రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఉద్యోగం లభిస్తుంది. నిర్మాణ రంగంలోని వారికి బాగా కలిసి వస్తుంది. అన్నదమ్ములు, ఆత్మీయులు అనుకూలంగా ఉంటారు. వారితో చర్చల మూలంగా చాలా పనులు కలిసి వస్తాయి. వాహనం కొనుగోలు చేస్తారు. 


మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో  ఆదాయం పెరుగుతుంది. పనివారితో అనుకూలత, రావాల్సిన డబ్బు వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా ఉంటారు. ఇంటికోసం వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. సంగీత, సాహిత్య ప్రియులకు ఈ వారం బాగా తృప్తినిస్తుంది. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బందులుంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. మంచి ఉద్యోగం కోసం శ్రమ అవసరం. విద్యార్థులకు చదువుల కోసం విదేశీ ప్రయత్నాలలో ఆటంకాలు ఉంటాయి. వాయిదా పడవచ్చును. 


logo