గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Feb 22, 2020 , 23:08:46

రాశి ఫలాలు

రాశి ఫలాలుమేషం

 ఈ వారంలో ఈ రాశి వారికి అన్ని విషయాలలోనూ ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనుకూలిస్తుంది. పనులు   సమయానికి పూర్తవుతాయి. చాకచక్యంతో  పనులు చేస్తారు. అనుకున్నదానికన్నా ఎక్కువ లాభం చేకూరుతుంది.  సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి.  అనేకమంది గుర్తిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి బాగా కలిసి వస్తుంది. మంచి ఉద్యోగం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో ఆత్మీయత పెరుగుతుంది. వారి మూలంగా పనులు బాగా కలిసివస్తాయి. కొత్త పనులను ప్రారంభిస్తారు. సభలకు, సమావేశాలకు వెళతారు.


వృషభం

ఈ వారంలో ఈ రాశి వారికి గ్రహాల స్థితి మిశ్రమంగా ఉంది. పట్టుదలతో పనులు చేస్తూ ముందుకు వెళితే చాలా విషయాలలో కలిసివస్తుంది. అనుకూలత ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులతో కొంత అనవసరమైన వాగ్వివాదాలు ఉన్నప్పటికీ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.  ఇంటికి కావాల్సిన వస్తువులను కొంటారు. ప్రవచనాలకు, సినిమాలకు, సమావేశాలకు ప్రాధాన్యమిస్తారు.  వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి తాత్కాలిక ఇబ్బందులు ఉంటాయి. అయినా కొంత అనుకూలంగా ఉంటుంది.  విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి. 


మిథునం

ఈ వారంలో ఈ రాశి వారు దేవతా, గురుభక్తి పెంచుకోవడం వల్ల సమాజంలో పేరు సంపాదిస్తారు. దీంతతో చాలా పనులు నెరవేరుతాయి. డబ్బు వృథా కాకుండా నియంత్రించుకోవడం అవసరం. స్నేహితులతో, ఆత్మీయులతో జాగ్రత్తగా ముందుకు వెళ్లడం చాలా మంచిది. శుభకార్య ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి.  ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థుల శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారులతో అండదండలుంటాయి. కలిసి వస్తుంది. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు ఉంటాయి. 


కర్కాటకం

ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి పనులు చేయడం ఈ వారంలో ముఖ్యం. దీర్ఘకాలిక పనులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. కార్మికులకు, కర్షకులకు అనుకూలంగా ఉంటుంది. నిర్మాణ, భూముల వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. సమయానికి మంచి సలహాలు పొందుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలకు గుళ్లకు వెళ్లే అవకాశాలు బాగా ఉన్నాయి. నిత్య వ్యాపారం అనుకూలం.  షేర్‌, వడ్డీ వ్యాపారాల్లో తాత్కాలిక ప్రయోజనాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. 


సింహం

ఈ వారంలో ఈ రాశి వారు ఇంటి వస్తువులను, వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. సంఘంలో  మంచి పేరు సంపాదిస్తారు.  మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. సహాయ సహకారాలు అందుతాయి. పనివారితో సమన్వయం ఉంటుంది. కొత్త పనులు చేస్తారు. డబ్బు అనుకున్న సమయంలో అందుతుంది. ఆదాయం అనుకున్న దానికంటే రెట్టింపుగా వస్తుంది. పెద్దలు, అనుభవజ్ఞుల సహాయ సహకారాలను పొందుతారు. వాటిని అమలు చేయడం మూలంగా సత్ఫలితాలను పొందుతారు. 


కన్య

 ఈ రాశి వారికి ఈ వారంలో తాత్కాలిక ప్రయోజనాలు బాగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల మెప్పు పొందడం అనుకూలమైన పనులు అప్పజెప్పడం, అనుకూల ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు, ఉద్యోగంలో ప్రమోషన్‌లు ఉంటాయి. న్యాయవాద వృత్తిలోని వారికి, రాజకీయంలో ఉన్న వారికి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. ఇంజినీరింగ్‌ వృత్తిలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. ఉపయోగించుకోవాలి. 


తుల

ఈ రాశి వారికి ఈ వారంలో అర్దాష్టమ శని ప్రభావం అంతగా ఉండదు. కనుక శ్రద్ధతో, ధైర్యంతో పనులు చేస్తూ ముందుకు వెళితే దుష్ర్పభావాలను చాలా అధిగమిస్తారు. విద్యార్థులు చదువు విషయంలో బాగా శ్రద్ధ కనబరచాలి.  సంఘంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారితో స్నేహం ఏర్పడుతుంది. సద్వినియోగం అవసరం. ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. అయితే మంచి ఉద్యోగాన్ని పొందడానికి నిరంతర కృషి అవసరం. ఖర్చుల నియంత్రణ అవసరం. 


వృశ్చికం

ఈ వారంలో ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. మంచి సంస్థల్లో సీటు సంపాదించడం, ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేవారికి ఉద్యోగం లభించడం. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల వల్ల పనులు బాగా కలిసి  వస్తాయి. పూర్వం కంటే ఆదాయం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది.  పనులు ప్రోత్సాహకరంగానే పూర్తి చేస్తారు. కష్టానికి తగ్గ ఫలితాలుంటాయి. మంచి బాంధవ్యాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. ఆదాయం, రాబడి పెరుగుతుంది. 


ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి సంగీత, సినిమా, సాహిత్య, పత్రికా రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. మంచిపేరును సంపాదిస్తారు. కుటుంబ సభ్యులందరితో సంతోషంగా వుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రమోషన్‌లు, అనుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో కొంతవరకు విజయం సాధిస్తారు. రాజకీయ నాయకులకు  కార్యకర్తలతో సంబంధం పెరుగుతుంది. ఈవారంలో ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. 


మకరం

ఈ వారంలో ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటారు. నిత్యావసర వస్తు వ్యాపారం, వస్త్ర, వస్తు, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారాలలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.  ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యలు కొంతవరకు తీరుతాయి.  అనవసరమైన ఖర్చుల వల్ల పనులు వాయిదా పడతాయి. నియంత్రణ ఈ వారం అవసరం. రాజకీయంలో ఉన్న వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. దేవాలయాలకు వెళ్లడం, ఆత్మ స్థయిర్యాన్ని పెంచుకోవడం అవసరం. 


కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో అనుభవజ్ఞుల అండదండలు అందుతాయి. వాటిని సద్వినియోగ పరచుకోవడంతో మంచి ఫలితాలను పొందుతారు. పుణ్యక్షేత్రాలు, విహార యాత్రలు చేస్తారు. పేరు ప్రఖ్యాతులను పొందుతారు. నలుగురికి ఉపయోగపడే పనులు, సాంఘిక కార్యక్రమాలను చేస్తారు. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులతో సంబంధాలు పెరుగుతాయి.  భూముల క్రయ విక్రయం, నిర్మాణ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. 


మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో శని సంచారం బాగా కలిసివస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి.  పనివారితో ఇబ్బంది ఉన్నప్పటికీ పనులను సరైన సమయంలో పూర్తిచేయగలుగుతారు. కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతృప్తిగా వుంటారు.  సహాయ సహకారాలు బాగా అందుతాయి. ఇంటికి  వస్త్ర, వస్తువులను కొంటారు. వైద్య, న్యాయవాద వృత్తుల్లోని వారికి ఆదాయం కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. 


గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి ఎం.ఎస్సీ, నిర్మల పంచాంగకర్త

నల్లకుంట, హైదరాబాద్‌,ఫోన్‌: 040-27651530 ఈ మెయిల్‌:[email protected]


logo