శనివారం 29 ఫిబ్రవరి 2020
చూసి చూడంగానే నచ్చేసింది!

చూసి చూడంగానే నచ్చేసింది!

Feb 09, 2020 , 01:53:33
PRINT
చూసి చూడంగానే నచ్చేసింది!

తమిళంలో సతురన్‌ సినిమాతో తెరంగేట్రం.. ఆ తర్వాత చిన్నా చితకా రోల్స్‌ చేసింది.. తమిళంలో వచ్చిన ‘96’, ‘ బిజిల్‌'.. అదేనండీ తెలుగు విజిల్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు ‘చూసీ చూడంగానే’తో తెలుగు తెరకు పరిచయమైంది.. ‘జాను’తో మరింత దగ్గరైంది.. మరిన్ని సినిమాలతో ఈ అమ్మడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయింది.. తెలుగు ప్రేక్షకులు చూడంగానే నచ్చిన ఈ అమ్మడి పేరు వర్ష బొల్లమ్మ.. కన్నడనాట పుట్టి.. తెలుగునాట పాగా వేసిన అమ్మడి విషయాలు మీకోసం..

 • తమిళం 96 సినిమాలో,  విజిల్‌ సినిమాల్లో చిన్న క్యారెక్టర్‌ల్లో మెరిసింది వర్ష బొల్లమ్మ. 
 • కార్డ్‌గేమ్స్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ ఆటలు అంటే మక్కువ ఎక్కువ. 
 • కాలేజ్‌ లెవల్‌ వరకు ఆమె మంచి బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ కూడా. 
 • బోర్‌కొట్టి డబ్‌స్మాష్‌ చేయడం మొదలుపెట్టింది వర్ష.  ఆ వీడియోలు వైరల్‌ అవుతాయని  నమ్మకం లేదట.  కానీ  అలా జరిగేసరికి నమ్మాల్సి వచ్చిందట. 
 • వర్షకి కొత్త భాషలు నేర్చుకోవడం ఇష్టం. అందుకే తమిళం, మలయాళం సినిమాలు చేసేటప్పుడు లొకేషన్ల దగ్గర ఉన్నవాళ్లతో మాట్లాడుతుంది. కేవలం మాట్లాడడమే కాకుండా.. రాయడం కూడా నేర్చుకుంది.

 • డబ్‌స్మాష్‌తో ఈ భామ చాలా ఫేమస్‌ అయింది. ఈ అమ్మడిని నజియా నాజీమ్‌తో పోలుస్తుంటారు. చాలామంది ఆమె అనుకొని వర్ష దగ్గరకి వచ్చి ఆటోగ్రాఫ్‌లు తీసుకున్న రోజులున్నాయట. 
 • రాజా రాణిలోని నజియా డైలాగ్‌ని డబ్‌స్మాష్‌ చేసింది వర్ష. అయితే రెండు వారాల్లోనే ఆ వీడియోని దాదాపు లక్షా 50 వేల మంది వీక్షించారు.
 • బెంగళూరులోని మౌంట్‌ కారమిల్‌ కాలేజ్‌లో తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. 
 • వర్షకి డబ్బింగ్‌ థియేటర్‌లోకి వెళుతుంటే..  ఎగ్జామ్‌ హాల్‌లో ఎంటర్‌ అయినట్టనిపిస్తుందట. మళ్లీ అన్ని ఎమోషన్స్‌ని గుర్తుకు తెచ్చుకొని డబ్బింగ్‌ చెప్పడం కత్తి మీద సాములాంటిదే అంటున్నదీ అమ్మడు. 
 • డ్రమటిక్‌ క్లబ్‌లో ఆడిషన్‌ కోసం దిగ్గజ నటుడు అమీర్‌ఖాన్‌ను అనుకరించింది. వాస్తవానికి ఎంపికైన విద్యార్థుల కంటే తన ఆడిషన్‌ చాలా బాగా ఇచ్చానని అక్కడి వారు ప్రశంసించారట. 
 • చిన్నప్పటి నుంచి ఆమెకు యాక్టింగ్‌ మీద ఇంట్రెస్ట్‌. అందుకోసం డ్రమటిక్స్‌ క్లబ్‌లో జాయినవ్వాలనుకుంది. కాకపోతే అక్కడ అడిషన్లలో విఫలమైంది.
 • ఆనంద్‌ దేవరకొండతో నటిస్తున్న సినిమాలో సింక్‌ సౌండ్‌తో చేస్తున్నారు. వర్షకి సింక్‌ సౌండ్‌లో చెప్పడం కుదరకపోతే తన క్యారెక్టర్‌కి స్టూడియోలో డబ్బింగ్‌ చెప్పిందట. 
 • 2015లో తన కాలేజ్‌ ఫ్రెండ్స్‌ ఒక ఫేస్‌బుక్‌ పేజీకి తనను ట్యాగ్‌ చేశారు. ఆమె ఫొటోలు ఒక చిత్ర యూనిట్‌ చూసి ఆడిషన్‌కి పిలిచారట. 
 • వర్ష బొల్లమ్మ 30 జూలై 1993న కర్ణాటకలోని కొడాగు ప్రాంతంలో జన్మించింది. 


logo