శుక్రవారం 07 ఆగస్టు 2020
Sunday - Feb 09, 2020 , 00:23:00

మీకు తెలుసా?

మీకు తెలుసా?

  • కోడి మనిషి కన్నా 45 నిమిషాల ముందే వెలుతురును చూడగలదు. తెల్లవారు జామున క్రమం తప్పకుండా కోళ్లు కూత వేయడానికి కారణం అదే.
  • శనిగ్రహం సాంద్రత (డెన్సిటీ) చాలా తక్కువ ఎంత అంటే... ఆ గ్రహాన్ని నీటిలో వేస్తే పైకి తేలుతుంది.
  • కాకుల గుంపును ఇంగ్లిష్‌లో ‘మర్డర్‌' అని అంటారు
  • పెంగ్విన్లు వెనక్కి నడవలేవు.
  • సింహం గర్జిస్తే ఆ శబ్దం ఐదు మైళ్ల దూరం వరకూ వినబడగలదు.
  • మానవ శరీరంలో అన్నింటికన్నా బలమైన కండరం... నాలుక.
  • చైనాలో అక్కడి ప్రజలకు బొద్దింకల ఆహారం చాలా ప్రత్యేకం. కేవలం ఆహారం, ఔషధాల కోసమే చైనా ప్రభుత్వం ఏటా వంద కోట్ల బొద్దింకలను ఉత్పత్తి చేస్తుంది.  బొద్దింకలు పెరిగిన తర్వాత వాటి చూర్ణం ద్వారా సంప్రదాయ ఔషధాలు తయారు చేయడం, వాటిని ఆహారం తీసుకోవడం చేస్తారు. వీటి ద్వారా జీర్ణాశయ, ఆంత్రమూల అల్సర్లు, శ్వాసకోశ సమస్యల వ్యాధులు తీరుతాయని అక్కడి డాక్టర్లు అంటారు. 
  • అంధులు ఎదుటి వారి నవ్వును  చూడలేరు. కానీ ఎదుటి వాళ్ల సంతోషాన్ని అర్థం చేసుకొని వాళ్లతో పాటు నవ్వగలరు. 


logo