సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Feb 09, 2020 , 00:01:53

షార్ట్‌ ఫిల్మ్స్‌ రివ్యూస్‌

షార్ట్‌ ఫిల్మ్స్‌  రివ్యూస్‌

అవకాశాలుంటే నిరుపించుకోవడానికి చాలామంది వేచి చూస్తుంటారు. కానీ అవి రావాలంటే మన దగ్గర ప్రతిభ ఉన్నట్టు ప్రపంచానికి తెలియాలి. అందుకే నేటి తరం యువకులు సినిమా రంగంలో రాణించాలని లఘుచిత్రాల ద్వారా ప్రతిభను నిరూపించుకుంటున్నారు. అలాంటి వారు తీసిన లఘుచిత్రాల్లో కొన్ని సమీక్షలే ఇవి.

అభిమన్యుడి ప్రేమ కథ

దర్శకత్వం : కార్తీక్‌ బాస్కర్‌

పాత్రలు : యాలిని, సుదీప్త

అభి అనును ఇష్టపడతాడు. రోజూ తన ప్రేమను వ్యక్తపరుస్తున్నా అను మాత్రం దాన్ని ఒప్పుకోదు. కారణం ఇంట్లో పరిస్థితులు, తల్లిదండ్రులు పెంచిన తీరు.  ప్రేమ వ్యవహారాలంటే లేనిపోని గొడవలని ఇష్టపడదు అను. కానీ కొన్ని షరతుల మీద  ఒప్పుకుంటుంది. ఇలా కొన్ని రోజులు సాగుతుంది వీళ్ల ప్రేమ. ఒక రోజు అనుకు ఆస్ట్రేలియాలో సీటు వస్తుంది. కానీ అభిని వదిలి వెళ్లడం ఆమెకు ఇష్టముండదు. కానీ రెండేండ్ల గడవు అని చెప్పి వెళ్తుంది. వచ్చే వరకూ వేచి చూడు అని చెప్తుంది. ఆస్ట్రేలియా వెళ్లిన మొదట్లో కొన్ని రోజులు కమ్యునికేషన్‌లో ఉండేది. అలా ఒకటిన్నర ఏండ్లు గడుస్తాయి. తర్వాత తన నుంచి ఎలాంటి స్పందనా ఉండదు. కానీ అభి తనకోసం వేచి చూస్తూనే ఉంటాడు. అనుకు వేరే అబ్బాయితో పెండ్లి అవుతుంది. ఈ విషయం తెలియని అభి తన కోసం వేచి చూస్తుంటాడు. మరి ఎన్నాళ్లు వేచి చేస్తాడు? ముగింపు లేదా? అనే విషయం తెలియాలంటే మీరు యూట్యూబ్‌కు వెళ్లాల్సిందే.


Total views

22064+

(ఫిబ్రవరి 1 నాటికి)

Published on 

Jan 31, 2020


ప్రెగ్నెంట్‌

దర్శకత్వం : అఖిల్‌ కల్యాణ్‌

పాత్రలు : క్రిష్ణ, ఐశ్వర్య బాల

ఓ యువతి ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. దీన్ని గమనించి తల్లి ఆ యువతి దగ్గరకు వస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాదు. తీరా చూస్తే ఆ యువతి ముందు ప్రెగ్నెన్సీ కిట్‌ ఉంటుంది. ఆమెకు ఇంకా పెండ్లి కాలేదు. విషయం అర్థమైన తల్లి ఆ యువతిని మందలిస్తుంది. తండ్రికి కూడా విషయం తెలుస్తుంది. జరగబోయే పరిస్థితులను ముందే ఊహంచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తల్లిదండ్రులు. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాకుండా ఉండేందుకు, తన భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. ప్రెగ్నెన్సీ ఉంచాలా తీసేయాలా నిర్ణయం గురించి ఆ యువతి తల్లిదండ్రులుగా వాళ్లు బాధ్యత తీసుకుంటారు. ఓవర్‌ రియాక్ట్‌ అయితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, దాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలనే థియరీతో ఈ స్టోరీ అంతా నడుస్తుంది. చివరికి అసలు ఈ ప్రెగ్సెన్సీ  ఏంటో అక్కడికి వెళ్తుంది స్క్రీన్‌ ప్లే.. ఈ యువతి,  మరో అబ్బాయి పార్టీలో ఉంటారు.  ఆమె వైన్‌ గ్లాస్‌తో కనిపిస్తుంది. అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక డైలాగ్‌.  కథ ముగుస్తుంది. అదేంటో మీరే చూడండి. సైకలాజిక్‌, స్క్రీన్‌ ప్లే సెంటర్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశారు. బాగుంది. చూడొచ్చు. 

Total views

5112+

(ఫిబ్రవరి 1 నాటికి)

Published on

Jan 30, 2020


నీ జతగా

దర్శకత్వం : డి ప్రసాద్‌

పాత్రలు : చందన, నీల్‌కమల్‌, విజయ్‌

విజయ్‌, పవన్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌.  బీటెక్‌ విద్యార్థులు.   విజయ్‌ వేరే కాలేజీ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ పవన్‌కు చెప్పడు.  సందర్భం చూసి చెప్దాం అనుకుంటాడు. ఇలా పవన్‌కు తెలియకుండా విజయ్‌ తన ప్రేయసిని కలుస్తాడు. ఆమె పేరు దీక్ష. వేరే కాలేజీ ఆమ్మాయి. ఓ రోజు దీక్ష ఈ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్తానని విజయ్‌తో అంటుంది. దానికి సరే అంటాడు. మరోవైపు దీక్షను చూసి విజయ్‌ ఇతర ఫ్రెండ్స్‌ దీక్ష గురించి పవన్‌ దగ్గర ఆరా తీస్తారు. ఇలా చేయగా తెలిసిందేంటంటే దీక్ష ఎవరో కాదు పవన్‌ వాళ్ల చెల్లెలు. విషయం అర్థం అయిన పవన్‌ విజయ్‌ దగ్గరకు వస్తాడు. మరి స్నేహితునిగా ఉన్న విజయ్‌ పవన్‌ను ఏమంటాడు? తర్వాత కొన్ని రోజులకు పవన్‌ విజయ్‌కు అందుబాటులోకి రాడు. ఫోన్‌ చేసినా రీచ్‌ అవదు. దీక్ష కూడా అంతే.   కనుక్కుంటే వాళ్ల కుటుంబం అంతా సిటీకి వెళ్లిపోయినట్టు తెలుస్తుంది. కొన్నిరోజుల రత్వాత  పవన్‌ విజయ్‌ను కలిస్తే దీక్ష చచ్చిపోయిందని చెప్తాడు.  మరికొన్ని రోజులకు దీక్ష విజయ్‌ను కలుస్తుంది. అదెలా జరిగిందో, అసలు పవన్‌ ఏం చేశాడో తెలియాలంటే పూర్తి లఘుచిత్రం చూడండి.

Total views

2093+

(ఫిబ్రవరి 1 నాటికి)

Published on 

Jan 28, 2020


ద్రౌపది..

దర్శకత్వం : మహేశ్‌

పాత్రలు : దీక్షిత

ఈ సమాజంలో ఆడపిల్లల మీద రోజు రోజుకూ కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి.  ఆడపిల్ల అనగానే భారంగా భావించే పరిస్థితులు ఉన్నాయి. వీటికి భయపడే చాలామంది ఆడపిల్లల సంతానం అంటే భారంగా భావిస్తున్నారు. ఆడపిల్ల అని తెలిస్తే గర్భం తీసేస్తున్నారు. ఇవ్వన్నీ సమాజంలో ఆడపిల్లల లోటుకు దారి తీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అనేక రిపోర్టులు తెలుపుతున్నాయి. ఇలాంటి అంశాలను స్టోరీ లైన్‌గా తీసుకొని తీసిన లఘుచిత్రం ద్రౌపది.  ఆడపిల్లలను పురిట్లోనే చంపేస్తే ఎలాంటి కొరత ఉంటుందో తెలిపారు. అట్లాగే ఆడపిల్ల పుడుతుందని తెలిసిన ఓ తండ్రి భయం తాలూకు వాతావరణాన్ని చూపించారు. మరి ఆ తండ్రి మనసు మారి ఆడపిల్లను పుట్టనిస్తాడా? ఒకవేళ పుట్టనివ్వకపోతే ఎదురయ్యే పరిస్థితులు కొన్ని తెలియాలంటే ద్రౌపది చూడొచ్చు. సామాజిక సందేశం వచ్చేటట్టు ప్రయోగాత్మకంగా తీసిన లఘుచిత్రం. చూడండి. 

Total views: 1210+

(ఫిబ్రవరి 1 నాటికి)

Published on : Feb 1, 2020

వినోద్‌ మామిడాల,  సెల్‌: 7660066469


logo