ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Feb 08, 2020 , 23:38:58

ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

09-02-2020 నుంచి 15-02-2020 వరకు

మేషం

ఈ వారంలో ఈ రాశి వారికి  పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఆలోచనలు వస్తాయి. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. సద్వినియోగం చేసుకుంటారు.  వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. పెట్టుబడులను కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది. లేదా చాలా జాగ్రత్తగా చేయడం వల్ల ఉపయోగపడుతుంది.  డబ్బు ఇవ్వడం, తీసుకోవడంలో అప్రమత్తంగా ఉండడం ఈ వారం చాలా అవసరం. తరచుగా చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి.    రావాల్సిన డబ్బు సమయానికి వస్తుంది. 


వృషభం

ఇంట్లో అందరితో  సంతోషంగా వుంటారు. సంగీత, సాహిత్య అభిమానులకు ఈ వారం ఆనందాన్ని కలిగిస్తుంది. సభలకు, విందులకు, సమావేశాలకు వెళ్తారు. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారులకు కలిసి వస్తుంది.  స్నేహితులు, బంధువులతో వైషమ్యాలుంటాయి. వాహనాల వల్ల  ఖర్చులు ఉంటాయి. ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి  జాగ్రత్త అవసరం. పెద్దల సలహాలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.  కొన్ని విషయాలలో మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. చదువు విషయంలో శ్రద్ధ, నిబద్ధత అవసరం.  


మిథునం

ఈ వారంలో ఈ రాశి వారికి గురు సంచారం మినహా అన్ని గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది.  ఆయా పనుల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. దీంతోపాటు ఖర్చులు ఉండే అవకాశం ఉంది.  జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం.  శుభకార్యాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలమైన వారం. పోటీ పరీక్షలలో విజయంతో మంచి స్థాయిలో నిలుస్తారు. మంచి సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి, నిత్య వ్యాపార లావాదేవీలు కలిసి వస్తాయి. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి కలిసి వస్తుంది.  


కర్కాటకం

ఈ వారం ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అయినా  సామాన్య ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి.   ఉద్యోగులకు ఆఫీసులో అనుకూలత ఉంటుంది. తాత్కాలిక ప్రమోషన్స్‌ లేదా విభాగంలో మార్పులు ఉంటాయి. మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్తపనులు ప్రారంభించడానికి అనుకూలం. దీర్ఘకాలిక పనులు,  పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది. పనివారితో  సమస్యలు కొంతవరకు తీరుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నదీ స్నానాలను ఆచరిస్తారు.  


సింహం

 ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. చాలావరకు ఈ వారం కలిసి వస్తుంది. ఆలోచించి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే  ఫలితాలను పొందుతారు. చదువు నిరాటంకంగా సాగుతుంది. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. మంచి సంస్థలలో ఉద్యోగాలు పొందుతారు. సమాజంలో మంచి సంబంధాలు పెంపొందుతాయి. ఉపాధ్యాయ వైద్యవృత్తిలో ఉన్నవారికి మంచి అవకాశాలు రావడం వల్ల అర్థిక పరిస్థితి మెరుగవుతుంది.  కొత్త పనులు చేయడానికి ఆలోచిస్తారు. 


కన్య

ఈ వారంలో ఈ రాశివారు జాగ్రత్తగా ఉండడం అవసరం. బుధుడు తప్పా అన్ని గ్రహాలూ ప్రతికూలంగా ఉన్నాయి. వాహనాల వల్ల ఊహించని ఖర్చులు ముందుకు వస్తాయి.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఉన్న వారికి భూములు, నిర్మాణ వ్యయం అనూహ్యంగా పెరిగిపోవడంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు.  విద్యార్థులు ముఖ్యంగా అనుకున్న ఫలితాలను సాధించడానికి బాగా శ్రమించాలి.  పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.  వ్యాపారస్తులు పాత పనులు  పూర్తిచేయడంలో శ్రద్ధ కనబరచాలి.   ఖర్చుల నియంత్రణ అవసరం


తుల

 ఈ రాశి వారికి ఈ వారంలో ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా గురు, శనిల సంచారం ప్రతికూలంగా ఉంది. కాబట్టి  పెద్ద మొత్తంలో  చేసే పనులు, దీర్ఘకాలిక పనులు బాగా ఆలోచించి చేయాలి.  కొన్ని విషయాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఉండవచ్చు.  పనివారితో జాగ్రత్తగా మెలగడం అవసరం.  ఇంజినీరింగ్‌ వృత్తిలోని వారికి     కలిసి వస్తుంది.  ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో అందరితో మంచిమాట ఉంటుంది.


వృశ్చికం

శని, గురు గ్రహాల రాశి మార్పు ఈ రాశివారికి ఈ వారం బాగా అనుకూలిస్తుంది. ఏడేండ్లనాటి శని ప్రభావం తగ్గడం, ధన స్థానంలో గురు సంచారం బాగా కలిసి వస్తుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ గ్రహాల వల్ల ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటున్నారు. కాబట్టి మంచి ఫలితాలను పొందడానికి కొంత సమయం పట్టవచ్చును. మొత్తం మీద మంచి రోజులు ప్రారంభమయ్యాయి.  చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సంఘంలోని మంచివారితో స్నేహం వల్ల పనులు నెరవేరుతాయి. కొత్త వస్త్ర, వస్తువులను కొంటారు. 


ధనుస్సు

ఈ వారంలో ఈ రాశి వారికి బుధుడు, శుక్రుడు మినహా ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.  లేదా బాగా ఆలోచించి చేయడం అవసరం.  చిన్న వ్యాపారులకు కలిసి వస్తుంది. ఇంజినీరింగ్‌, న్యాయవాద, వైద్యవృత్తిలోని వారి పనులు పూర్తవుతాయి. ఇంటి సభ్యులందరితో మంచి సంబంధాలు ఉంటాయి.   సంతోషంగా గడుపుతారు. విందులకు, వినోదాలకు హాజరవుతారు. అన్ని విషయాలలో జాగ్రత్త అవసరం.


మకరం

ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా జన్మస్థానంలో శని సంచారం, ద్వాదశ స్థానంలో గురుసంచారం మంచి ఫలితాలను పొందడంలో ఆటంకాలను కలిగిస్తాయి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. భార్యాపిల్లలతో హాయిగా వుంటారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనుల్లో ఆలస్యం, పనివారితో కలహాలు, అన్నదమ్ములు, బంధువులతో మనస్పర్థలు ఉంటాయి. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలుంటాయి.  


కుంభం

 ఈ రాశి వారికి ఈ వారంలో గురు ఏకాదశ స్థాన సంచారం ప్రభావాన్ని చూపుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.  విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మంచి సంస్థలలో  సీటు సంపాదిస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. తల్లిదండ్రులు, అనుభవజ్ఞులు, సమాజంలో గుర్తింపు పొందిన పెద్దల సహాయ సహకారాలు బాగా అందుతాయి. తద్వారా చాలా పనులు నెరవేరుతాయి. పురాణ, ఇతిహాస గ్రంథ పఠన చేస్తారు.  


మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగులకు కలిసి వస్తుంది. ఆఫీసులో అందరితో సమన్వయం చేసుకుంటూ వెళ్తారు. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.  వ్యాపారంలో పనివారితో ఇబ్బందులు ఉన్నప్పటికీ  కొంతవరకు లాభదాయకంగానే ఉంటుంది. వాహనం వల్ల  ఖర్చులుంటాయి. పూర్వ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి.  న్యాయవాద, ఉపాధ్యాయ వృత్తిలోని వారికి ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో అందరితోనూ సంతృప్తిగా వుంటారు. కొత్త వస్తువులను కొంటారు.   ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. దేవతా, గురుభక్తి పెంపొందించుకోవడం అవసరం. 


logo