గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Feb 01, 2020 , 22:06:30

మార్కెట్

మార్కెట్

ఒక గుడి ముందు.. ఒక ఆవు కట్టేసి ఉంది. ఆ గుడికి ఎదురుగా ఒకావిడ గడ్డిమోపు పెట్టుకుని కూర్చున్నది. గుడికి వచ్చి పోయే భక్తులు ఆమె దగ్గర గడ్డి కొంటున్నారు. దాన్ని ఆవుకు తినిపించి పారవశ్యం చెందుతున్నారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ ఆవు ఆమెదే. ఆ గడ్డి కూడా. ఆ ఆవుకు గడ్డి పెట్టాల్సిన బాధ్యత కూడా ఆవిడదే. ఎందుకంటే రోజూ పాలు పితుక్కుంటున్నది కదా. మరి గుడి దగ్గర ఎందుకు కట్టేసింది. గడ్డి ముడిసరుకు. భక్తి మార్కెట్టు. యూఎస్‌పీ (Unique selling proposition).. ప్రత్యేకమైన అమ్మకపు ప్రతిపాదన. ఇది తెలిస్తే ఎలాగైనా బతికేయొచ్చు. మన దగ్గర ముడిసరుకు లేకుండా కూడా బాగా బతకొచ్చు.ఉబర్, ఓలా క్యాబ్ సర్వీసులు తెలిసే ఉండొచ్చు. వారికి సొంతంగా ఒక్క క్యాబ్ కూడా ఉండదు. స్విగ్గీ, జొమాటో సర్వీసులు వాడి ఉండొచ్చు. వారికి ఒక్క హోటల్ కూడా ఉండదు. అంటే ముడిసరుకు లేకుండానే బతికేస్తున్నారు కదా. అవును.. మన బద్దకమే.. పెద్ద మార్కెట్టు. సేవలు సులభం పేరుతో చాలా సులువుగా బతికేస్తున్నారు. logo