బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Feb 02, 2020 , T00:05

ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

మేషం : ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక పనులు నెరవేరుతాయి. అలసట, అనారోగ్యం దూరమవుతాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్‌లు, ఆఫీసులో మంచి పేరును సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. 


వృషభం : వారంలో ఈ రాశి వారికి శని ప్రభావం తగ్గి, పనుల్లో సామాన్యత నెలకొంటుంది. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు అనుకూలం. నిత్య వ్యాపారం కలిసి వస్తుంది. న్యాయవాద, వైద్యవృత్తిలో ఉన్న వారికి అనుకూల సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.  భార్యాపిల్లలతో సంతృప్తిగా వుంటారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొంత కలిసివస్తుంది. అనుకూలత ఏర్పడుతుంది.  ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. 


మిథునం : ఈ వారంలో ఈ రాశి వారికి శని అష్టమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని పనుల్లో ఆలస్యం అవచ్చు. ఆర్థిక  సమస్యలుంటాయి. అన్నదమ్ములు, ఆత్మీయులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన దిగుబడులు, ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఉంటాయి. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. చదువు విషయంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరమైన సమస్యలు ఎదురైనా శుభకార్యాలు చేస్తారు. విద్యార్థులకు చదువు విషయంలో బాగా కలిసి వస్తుంది. 


కర్కాటకం :ఈ రాశి వారు ఈ వారం కుటుంబ సభ్యులందరితోనూ సమన్వయంగా ఉంటారు. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. పురాణ ప్రవచనాలకు, దేవాలయాలకు వెళతారు. నిత్య  వ్యాపారం అనుకూలిస్తుంది. పూర్వ పెట్టుబడులు కలిసివస్తాయి. అనుభవజ్ఞుల సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడులను కొన్ని రోజులు  వాయిదా వేసుకోవడం మంచిది.  సమయానికి డబ్బులు అందకపోవడంతో పనులు వాయిదా పడుతాయి.  ప్రతి పనిలోనూ ఆలస్యం, ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శ్రద్ధతో, ప్రణాళిక బద్ధంగా పనులు చేయడం ఈ వారం అవసరం. 


సింహం :ఈ వారంలో ఈ రాశి వారికి ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి.  దీనివల్ల కలిసివస్తుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.  అలసట, అనారోగ్యం దూరమవుతాయి. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. పిల్లల చదువు, శుభకార్యాల ప్రయత్నాలు దాదాపు ఫలిస్తాయి. పై చదువులకు అనుకూలమైన వారం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌లు, ఆఫీసులో మంచి పనులు సకాలంలో పూర్తి చేయడం వల్ల పేరు సంపాదిస్తారు.


కన్య : ఈ వారంలో ఈ రాశివారి ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి.  అయినా శని అర్థాష్టమ స్థానం నుంచి పంచమ స్థానంలోకి మార్పువల్ల కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. ఆదాయంలో మార్పు వస్తుంది. పనులు అనుకున్నంత వేగంగా సాగకపోయినా తృప్తికరంగా ఉంటుంది. అన్నదమ్ములు, స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు బాగా కలిసివస్తుంది. వాహనాల వల్ల పనులు పూర్తవుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలోని వారికి అనుకూలత ఉంటుంది. 


తుల :ఈ వారంలో ఈ రాశి ప్రధానమైన గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ముఖ్యంగా శని అర్దాష్టమ స్థానంలోకి ప్రవేశించడం, అనవసరమైన ఆలోచనలను ప్రేరేపిస్తుంది. కనుక దైవభక్తి, ఆధ్యాత్మికత పెంచుకోవడం చాలా ముఖ్యం. పెద్దల సూచనలు, సలహాల మేరకు పనులు  చేయడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తాత్కాలిక ఉద్యోగం లభిస్తుంది. శాశ్వత ప్రయత్నాలు చేయడం మంచిది. అనవసరమైన ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం ఈ వారం చాలా అవసరం. 


వృశ్చికం :ఈ వారంలో ఈ రాశి వారికి ఏడున్నరేండ్ల శని ప్రభావం తగ్గుతుంది.  చాలా పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. శ్రద్ధతో పని చేయడం మంచిది. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. చదువు విషయంలో కలిసి వస్తుంది. పై చదువులకు అనుకూలమైన వారం.  వివాహాది శుభకార్యాలు చేస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచి వారితో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా అందరిలో బాగా ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్‌లుంటాయి. ఆఫీసులో  అనుకూలమైన పనులు అప్పజెప్తారు. 


ధనస్సు :ఈ వారంలో ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి.   జన్మస్థానం నుంచి శని రెండో స్థానంలోకి మారడం కొంత అనుకూలతను ఇస్తుంది. ఏడున్నరేండ్ల శని ప్రభావం మాత్రం ఉంటుంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇంట్లో కుటుంబ సభ్యులందరితో సమన్వయంగా ఉంటారు. సుఖంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనడానికి ప్రయత్నిస్తారు. పెద్దల సహాయ సహకారాలను సద్వినియోగ పరచుకోక పోవడంతో కొన్ని పనులు వాయిదా పడవచ్చు. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. 


మకరం : ఈ వారంలో ఈ రాశి వారికి ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్య పరమైన సమస్యలు తగ్గుతాయి. శ్రద్ధగా పనులు చేస్తారు. అన్నదమ్ములు, స్నేహితుల,   సహకారాలుంటాయి. బంధువులు ఇంటికి రావడం. వారితో అనేక విషయాలపై చర్చలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యులందరితో సంతృప్తిగా వుంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మంచి పేరు సంపాదిస్తారు. నిత్య వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వైద్య, ఇంజినీరింగ్ వృత్తుల్లోని  వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది.


కుంభం :ఈ రాశి వారికి ఈ వారంలో తల్లిదండ్రులు, పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. చాలా పనులలో మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఉన్నత విద్యకు అనుకూల వారం. సంఘంలో మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ప్రవచనాలకు, సభలకు, సమావేశాలకు హాజరవుతారు. కుటుంబసభ్యులందరితోనూ ఆప్యాయతతో ఉంటారు. కొత్త వస్తువులను కొంటారు.


మీనం : ఈ వారంలో శని ఏకాదశ స్థానంలో ప్రవేశించడం వల్ల  ఈ రాశి వారికి బాగా కలిసి  వస్తుంది. అన్ని విషయాలలోనూ ఆలస్యం తొలగుతుంది. ఆర్థిక పరమైన సమస్యలు తీరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం నయమవుతుంది. రాజకీయ రంగంలోని వారికి కార్యకర్తల సహాయ సహకారాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఉన్న వారికి తోటి వారితో  మంచిమాట, అధికారుల ఆదరణ ఉంటుంది. కుటుంబసభ్యులతో హాయిగా వుంటారు. ఇంటికి కావాల్సిన వస్తువులను కొంటారు. సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది.  సంఘంలో మంచిపేరు వల్ల పనులు నెరవేరుతాయి. 


logo