బుధవారం 03 జూన్ 2020
Sunday - Jan 26, 2020 , 00:36:58

కామారెడ్డి వాహనాల సంత

 కామారెడ్డి  వాహనాల సంత

సంత మా ఊరి సంత,వారానికోసారి జోరుగా సాగేటి, సంత మా ఊరి సంత,సుట్టు ముప్పై ఊర్లపెట్టు జనమందరూ,పుట్టపగిలి సీమలొచ్చినట్టొస్తారు అంటాడు  గోరటి వెంకన్న. బట్టలైనా, వస్తువులైనా, లేదా నిత్యావసర వస్తువులు ఏవి కావాలన్నా ఇప్పుడు అందరూ ఆధారపడుతున్నది ఆన్‌లైన్ మార్కెట్‌పైన్నే అయితే గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ సంతలకు ప్రాముఖ్యం ఎక్కువే. కూరగాయలు, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి కొత్త బట్టల వరకు అన్నీ కూడా సంతల్లో విక్రయిస్తారు. ఇది ఇలా ఉంటే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంతకు ఓ ప్రత్యేకత ఉంది.. అదేంటంటే నిత్యావసర వస్తువులు, పశువులకు ఉన్నట్లు ఇక్కడ వాహనాల క్రయ విక్రయాల కోసం ప్రతి గురువారం సంత నిర్వహిస్తుండటం విశేషం. 

ప్రస్తుత కాలంలో మనకు ఏ వస్తువు కావాలన్నా ఆన్‌లైన్‌లోను లేదా సమీప ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్‌కి వెళ్లి నిమిషాల్లో కొనేస్తుంటాం. కానీ పల్లెటూర్లలో ఒకప్పుడు మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కొనాలంటే మాత్రం మన సమీప ప్రాంతాల్లోని వారానికొకసారి జరిగే సంతకు వెళ్లి కొనేవారు. అంటే పనిముట్ల దగ్గర నుండి బట్టలు, వస్తువులు, పశువులు వంటి వాటిని ఆ సంతల్లో విక్రయించే వారు. మన పల్లెటూర్లలో ఇప్పటికీ ఈ సంతలకు ప్రాముఖ్యం ఎక్కువే.

మార్కెటింగ్ సదుపాయాలు అభివృద్ధి చెందని రోజుల్లో గ్రామాల్లో సంతలు ప్రధాన వ్యాపార కేంద్రాలుగా ఉండేవి.. నేటికీ కొన్ని చోట్ల ఆదరణ తగ్గలేదు.. మరికొన్ని సంతలు కొత్త పుంతలు తొక్కుతూ హైటెక్ హంగులను సంతరించుకుంటున్నాయి.. కామారెడ్డి జిల్లాలోని సంతలో నిత్యావసర వస్తువులతోపాటు వాహనాల క్రయ విక్రయాలు జరుపుతుండటం విశేషం. కామారెడ్డి జిల్లాలోని అనేక గ్రామాల్లో అనాదిగా వారాంతపు సంతలు కొనసాగుతున్నాయి. వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు వస్తువులు కూరగాయలు ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. అంతే కాకుండా నిత్యావసర పనిముట్లు కొత్త బట్టలు కూడా సంతలో విక్రయిస్తారు. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సంతకు ఓ ప్రత్యేకత ఉంది.. ఇక్కడ వాటన్నింటితో పాటు వాహనాల క్రయ విక్రయాలూ జరుపుతుండటం విశేషం. పట్టణంలోని ఈ వీక్లీ మార్కెట్‌కు ప్రత్యేక స్థలం కూడా మున్సిపాలిటీ కేటాయించింది. అక్కడ స్థలం సరిపోకపోవడంతో సిఎస్‌ఐ మైదానంలో సంత నిర్వహిస్తున్నారు. ఇందులో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ విక్రయాలు నిర్వహిస్తున్నారు. సుమారు ఇరవై మంది వ్యాపారులు ఈ సంతపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్నారు.అంతేకాకుండా ఎవరైనా తమ పాత వాహనాన్ని అమ్ముకునే సౌకర్యం కూడా ఇక్కడ వ్యాపారులు కల్పించారు. ప్రతివారం లక్షల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. వాహనాలు కొనాలనుకునే వారు లేదా విక్రయించాలనే వారు కూడా ఈ సంతకు వస్తున్నారు. కామారెడ్డి పట్టణం నుంచే కాకుండా సమీప గ్రామాల నుంచి కూడా వాహనాల కోసం ఇక్కడికి వస్తున్నారు.


అయితే వినియోగదారులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, పూర్తి డాక్యుమెంట్లు పరిశీలించడం క్రయ విక్రయాల్లో ప్రాధాన్యం ఇస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. చోరీ వాహనాలకు ఆవకాశం ఇవ్వకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. సుమారు వందమంది ఈ వాహనాల సంతపై ఆధారపడి జీవిస్తున్నారు. మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తూ కమిషన్ పద్ధతిలో క్రయ విక్రయాలు నిర్వహిస్తున్నారు. సంతలో వాహనాలు దొరకడం ఇక్కడే చూస్తున్నామని, ఇలాంటి సౌకర్యం ఎక్కడా లేదని స్థానికులు చెబుతున్నారు. వెహికిల్ కన్సల్టెంట్‌కు వెళితే వారు కమీషన్‌పై వ్యాపారం చేస్తారు. వాహనం యజమానితో కోనుగోలు దారులు మాట్లాడరని స్థానికులు చెపుతున్నారు. ఈ విధంగా వ్యాపారం చేస్తే ఇద్దరికీ నష్టం కలుగదని వారు తెలిపారు. ఇలాంటి సంప్రదాయం అన్ని సంతల్లో రావాలని వారు కోరుతున్నారు.


logo