శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Jan 26, 2020 , 00:00:01

ఒక్క నిమిషం

ఒక్క  నిమిషం

అంటే ఏముంది..?

జస్ట్ 60 సెకన్లు.. మాత్రమే అనుకుంటాం.. 

కానీ ఆ 60 క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో 

ఏం జరుగుతున్నదో తెలుసా? 

18.8 కోట్ల ఈమెయిల్స్ మారుతున్నాయి.  

ఒక కోటీ 81 లక్షల టెక్ట్స్ మెసేజ్‌లు ఫార్వర్డ్ అవుతున్నాయి. 

4.16 కోట్ల మెసేజ్‌లు వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి 

మెసెంజర్ల ద్వారా వెళ్తున్నాయి.  

3,90,030 యాప్స్ స్టోర్స్ నుంచి 

డౌన్‌లోడ్ అవుతున్నాయి. 

3,47,222 మంది ఇన్‌స్టాగ్రామ్‌ను స్క్రోల్ చేస్తున్నారు. 

పది లక్షల మంది ఫేస్‌బుక్‌లో లాగిన్ అవుతున్నారు. 

45 లక్షల వీడియోలు యూట్యూబ్‌లో చూస్తున్నారు. 

9,96,956 డాలర్ల డబ్బు 

ఆన్‌లైన్ షాపింగ్ కోసం వినియోగిస్తున్నారు. 

6,94,444 గంటల వీడియోని నెట్‌ఫ్లిక్స్‌లో 

ఈ ఒక్క నిమిషంలోనే చూసేస్తున్నారు. 

గూగుల్‌లో 38 లక్షల సెర్చ్ క్వెరీలు నమోదవుతున్నాయి.  

87,500 మంది ట్వీట్ చేస్తున్నారు. 

ఇవి కేవలం 2019లో సగటు అంకెలు మాత్రమే. 

ఇంటర్నెట్ వాడకం ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. 

మరి 2020లో?