గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

క్వీన్‌ అంజనా !

క్వీన్‌ అంజనా !

శక్తి శేషాద్రి.. స్టేట్‌ టాపర్‌గా ఉన్న అమ్మాయి.. చదువు గురించి ఎన్నో ఆశలతో ఉంటుంది..  కానీ సినీ ప్రపంచం ఆమెను వదలదు.. ఒక్క సినిమాతో ఆపేద్దామన్న ఆమె కల.. కల్లగానే మిగిలిపోతుంది.. ఆ తర్వాత ప్రేమ కోసం వెంపర్లాడడం.. నమ్మినవారే మోసం చేయడం.. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టడం.. ఆ శక్తిలో మూడు కోణాలు, విభిన్న పార్శాలు ఉన్నట్లుగానే.. క్వీన్‌ వెబ్‌సిరీస్‌ల్లో ఆ మూడు కోణాలను ప్రదర్శించడానికి.. ముగ్గురు కథానాయకులను ఎంచుకున్నారు దర్శకులు.. దీంట్లో యంగ్‌ శక్తి.. అదేనండీ జయలలిత పాత్రలో మెరిసింది అంజనా జయప్రకాశ్‌. కండ్లతోనే కట్టిపడేసి.. అన్ని భావోద్వేగాలను చక్కగా పలికించింది..

-మ్యూజ్‌ అనే షార్ట్‌ఫిల్మ్‌తో తెరంగేట్రం చేసింది అంజనా. ఇందులో సెక్స్‌వర్కర్‌గా కనిపిస్తుంది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఆ సంవత్సరం తమిళంలో నేషనల్‌ అవార్డుకు పంపించిన షార్ట్‌ ఫిల్మ్‌ల్లో ఒకటి కావడం విశేషం.  అంజనా ఇప్పటివరకు ఒక మ్యూజిక్‌ వీడియో, మూడు షార్ట్‌ఫిల్మ్‌ల్లో నటించింది.

-తమిళంలో తాను మొదట చూసిన సినిమా అన్నియాన్‌. అదేనండీ తెలుగులో అపరిచితుడు సినిమా.-క్వీన్‌ సిరీస్‌లో నటించిన అనిక, రమ్యకృష్ణ, అంజనాలో కామన్‌గా కనిపించేవి పెద్ద కళ్లు. వాటితోనే ఎన్నో భావాలు పలికించారు కాబట్టే క్వీన్‌ మరింత సూపర్‌ హిట్‌ అయిందంటున్నది అంజనా. ప్రేమమ్‌ మడోన్నా సెబాస్టియన్‌ క్యారెక్టర్‌ అంజనాకి వచ్చింది. నాలుగు రోజుల షూటింగ్‌ అయ్యాక చెప్పకుండా తీసేశారట.
అంజనా స్వరాష్ట్రం కేరళ. కానీ తండ్రి వృత్తిరీత్యా షార్జాకు వెళ్లాల్సి వచ్చింది. 17 యేళ్ల వరకు షార్జాలో పెరిగింది. అక్కడే చదివింది.ప్రేమమ్‌ సినిమాలో నుంచి కారణం లేకుండా తీసేశారని చాలా బాధపడింది.  ఆ సినిమా హిట్‌ అని తెలిసింది. అయినా నెలరోజుల వరకు ఆ సినిమాను చూడాలా? వద్దా? అని ఆలోచించిందట అంజనా.
ఫ్యాషన్‌ టెక్నాలజీ చదువడానికి కోయంబత్తూరు వచ్చింది. కుమ్మరగూరు ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో చేరింది. కాలేజ్‌లో ఉండగానే మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి.  


-అంజనా నయనతారని ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సూర్య అంటే చాలా ఇష్టం. విజయ్‌ సేతుపతితో నటించాలని ఆశపడుతుంది. ఫ్లాట్‌మెట్‌ ముషిత ఒక ఫొటోగ్రాఫర్‌. తన ద్వారా అర్జున్‌ చిదంబరం అనే ఫొటోగ్రాఫర్‌ పరిచయం అయ్యారు. డిఫరెంట్‌ థీమ్‌తో చేసిన ఫొటోషూట్‌ అంజనాని మరింత మందికి పరిచయం చేసిందంటున్నది.

-డి-16 అనే తెలుగు, తమిళ సినిమా దర్శకుడు కార్తీక్‌ అంజనాకి కాలేజ్‌లో జూనియర్‌. సినిమా స్క్రిప్ట్‌ సమయంలో అంజనాని కలిసి ఆ సినిమాలో రెండే లేడీ క్యారెక్టర్‌లుంటాయి. అందులో ఏది తాను చేస్తుందో ఎంచుకోమన్నాడట.

-అంజనా చిన్నప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడేది కూడా కాదు. ఇంట్రావర్ట్‌గా ఉండేది. తనకంటే.. తన అన్నకి సినిమాలంటే పిచ్చి ఉండేది. తాను యాక్టింగ్‌లోకి అడుగుపెడతాడనుకుంటే అనుకోకుండా తాను ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చింది.
క్వీన్‌ వెబ్‌సిరీస్‌కి ఇద్దరు దర్శకులు పనిచేశారు. ఒకరు గౌతమ్‌ మీనన్‌. ఆయన స్పాట్‌లో ఉంటే ఎక్కువ రిహార్సల్స్‌ ఉండవంటున్నది అంజనా. అదే ప్రసాద్‌ ఉంటే మాత్రం ఆయన అన్ని విషయాలను నిశితంగా పరిశీలించేవారట. అన్నీ డీటెయిల్‌గా ఉండాలని భావించేవారు. 

-సౌమ్య నాగపురి


logo