గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

వారాంతం.. విహారం!

వారాంతం.. విహారం!

సెలవులు వస్తుంటే.. హాయిగా గడిచిపోవాలనుకుంటాం.. మరి ఈ సంవత్సరంలో బోలెడు లాంగ్‌ వీకెండ్స్‌ వస్తున్నాయి.. ఎన్నో సుందర ప్రదేశాలు మీకోసం వేచి ఉన్నాయి.. జనవరి 25న నేషనల్‌ టూరిజం డే.. ఈ సందర్భంగా ఈ సంవత్సరంలో వచ్చే లాంగ్‌ వీకెండ్స్‌.. ఆ సమయంలో ఎక్కడకు వెళితే మరింత ఎంజాయ్‌ చేయొచ్చో.. ఆ వివరాలన్నీ ఇస్తున్నాం ఈ జంటకమ్మలో..

జనవరి

 ఈ నెలలో ఇంకొక్క వారమే మిగిలి ఉంది. జనవరి 26 కూడా ఆదివారం రావడం వల్ల ఆప్షనల్‌ హాలీడేని కోల్పోయాం.
ఎక్కడకు : ఒక వీకెండ్‌ ఉంది కాబట్టి దగ్గరలోని ఏవైనా ప్రాంతాలను.. మీ సిటీలో చూడాల్సిన ప్రదేశాలను చుట్టేయొచ్చు. అలా ప్లాన్‌ చేస్తే ఉన్న ఒక వీకెండ్‌ని సూపర్‌గా గడిపేయొచ్చు.

ఫిబ్రవరి

21న మహాశివరాత్రి. ఈ పండుగ శుక్రవారం వస్తుంది. చాలావరకు ఆప్షనల్‌ హాలీడే. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు, కొన్ని స్కూళ్లకు కూడా సెలవు రోజులు. ఈ మూడు రోజులను మంచిగా ప్లాన్‌ చేసుకుంటే బాగుంటుంది.
ఎక్కడకు : ఫిబ్రవరిలో వెళ్లడానికి గోవా మంచి స్థలం. ఫిబ్రవరి 24న టిబెటన్‌ న్యూ ఇయర్‌ని ఈ ప్రాంతంలో చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తారు. సోమవారం కూడా సెలవు పెట్టుకుంటే ఈ ఫెస్టివల్‌ని కవర్‌  చేసి మంచి అనుభూతిని పొందవచ్చు.

మార్చి

మార్చి 10వ తారీఖు హోలీ. మంగళవారం వస్తుంది. సోమవారం ఒక్క రోజు సెలవు తీసుకుంటే నాలుగు రోజులు కలిసి వస్తాయి. శనివారం నుంచి మంగళవారం వరకు ఎంజాయ్‌ చేయొచ్చు.
ఎక్కడకు : ఉత్తరప్రదేశ్‌లోని వ్రిందావన్‌. దీన్ని ఆనుకొని మథుర నగరం కూడా ఉంటుంది. కృష్ణుడి జన్మస్థానమైన ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు. ఇక్కడ హోలీ చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేస్తారు. చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది.

ఏప్రిల్‌

ఈ నెలలో రెండు వారాల్లో మీకు లాంగ్‌ వీకెండ్స్‌ వస్తున్నాయి. ఏప్రిల్‌ 2న శ్రీరామనవమి. ఇది గురువారం వస్తుంది. శుక్రవారం ఒకటి సెలవు తీసుకుంటే నాలుగు రోజులు ఉంటాయి. కొందరికి మహావీర్‌ జయంతి ఆప్షనల్‌ హాలీడే ఉంటుంది. ఏప్రిల్‌ 6న. కాబట్టి వాళ్లకి సెలవుల్లో ఇంకో రోజు పెరుగుతుంది. ఏప్రిల్‌ 10న గుడ్‌ఫ్రైడే. ఆ తర్వాత రెండు రోజులు కలిపి మూడు రోజుల పాటు సెలవులను మంచిగా ప్లాన్‌ చేసుకోవచ్చు.
ఎక్కడకు : అప్పుడప్పుడే వేడి మొదలవుతుంది. కాబట్టి కాస్త చల్లదనం ఉన్న ప్రాంతాలకు వెళితే బాగుంటుంది. సిక్కిం, డార్జిలింగ్‌లాంటి ప్రాంతాలకు వెళ్లొచ్చు. హిమాలయ ప్రాంతాలను, అక్కడి అందాలను చూడడానికి వెళ్లొచ్చు.


మే

మే 1.. శుక్రవారం వచ్చింది. కార్మిక దినోత్సవానికి చాలామందికి సెలవు. మే 7 బుద్ధ పూర్ణిమ. గురువారం వచ్చింది. శుక్రవారం సెలవు పెడితే నాలుగు రోజులు పండుగ చేసుకోవచ్చు. మే 25న ఈద్‌ - ఉల్‌ ఫితర్‌. సోమవారం కాబట్టి ఆప్షనల్‌ హాలీడే ఉన్నవాళ్లు ఈ మూడు రోజులను మంచిగా వాడుకోవచ్చు.
ఎక్కడకు : వేసవి కాలం కాబట్టి ఈ సమయంలో ఎక్కడైనా చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేయండి. హిల్‌ స్టేషన్లు ఊటీ, వేదాంత్‌ హిల్స్‌లాంటి ప్రాంతాలను చూడొచ్చు.

ఆగస్టు

రక్షాబంధన్‌ ఆగస్టు 3 సోమవారం రోజు వస్తున్నది. శని, ఆది, సోమ.. మొత్తం మూడు రోజుల పాటు అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ప్లాన్‌ చేసుకోండి. ఆగస్టు 31 ఓనమ్‌. మనకు కాదు గానీ.. కేరళ వాళ్లకు సెలవురోజు. ఈ పండుగ సోమవారం కాబట్టి అక్కడి వాళ్లు ఏదైనా ప్లాన్‌ చేసుకోవచ్చు.
ఎక్కడకు : వర్షాకాలం మొదలవుతుంది. కేరళలాంటి ప్రాంతాలను ఆ సమయంలో చూస్తే మరింత బాగుంటాయి. గోవా కూడా మంచి ఆప్షనే. వర్షంలో తడుస్తూ సముద్రతీరాల వెంట నడుస్తుంటే ఆ మజాయే వేరుగా ఉంటుంది.