శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

అంతర్జాలంలో అమ్మభాష

అంతర్జాలంలో అమ్మభాష

తాలపత్ర గ్రంథాల నుంచి అంతర్జాల వేదికల దాకా వెళ్లింది. కంప్యూటర్ విజ్ఞానం అందరికీ చేరువైంది. ప్రాంతీయ భాషలతో ఇంటర్నెట్‌లో సమాచారం దొరుకుతున్నది.

తెలుగు విస్తరించింది. తాలపత్ర గ్రంథాల నుంచి అంతర్జాల వేదికల దాకా వెళ్లింది. ప్రాంతీయ సరిహద్దుల నుంచి ఎల్లలు దాటింది.ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు దర్శనం కలుగుతూనే ఉంది. ఆంగ్లభాషతో ప్రపంచం ఉరకలేస్తున్నా.. విస్తరించిన ఇంటర్నెట్‌తో తెలుగు అక్షరాల స్పర్శమాత్రం తాకుతూనే ఉంది. స్థానికంగానే కనిపిస్తుందేమో అనుకున్న తెలుగు లిపి పరిమళాలు విదేశాల్లోనూ వెదజల్లుతున్నాయి. ఐటీరంగాల్లోని తెలుగు భాషాభిమానుల కృషితో కంప్యూటర్‌లోనూ మన మాండలికాలు,నుడికారాలు, పదకోశాలు కనిపిస్తున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వెబ్‌సైట్లదాకా డిజిటల్ తెలుగు వెలుగుతూనే ఉంది. ఆంగ్ల కంప్యూటర్‌కు సవాలుగా తెలుగు వారి కంప్యూటర్ నేడు విస్తరిస్తున్నది. ఈ తెలుగు కంప్యూటర్సంగతులేంటో, డిజిటల్ తెలుగు విశేషాలేంటో ఈ కవర్ స్టోరీలో..

-వినోద్ మామిడాల, సెల్: 07660066469

గతం

ఇంటర్నెట్ విస్తరిస్తున్న రోజులవి. సామాన్యులకు అప్పడే కంప్యూటర్, ఇంటర్నెట్ అందుతోన్న దశ ప్రారంభమైన కాలం. ప్రాంతమేదైనా, సందర్భమేదైనా కంప్యూటర్‌లో కనిపించే భాష ఒక్కటే ఉండేది. అదే ఇంగ్లిష్. మరోవైపు తెలుగులో బ్లాగులు, వెబ్‌సైట్లు రూపొందడానికి ప్రయత్నాలు జరిగేవి. అదే సమయంలో ప్రత్యేకమైన తెలుగు ఫాంట్ అవసరమయ్యేది. దాన్ని కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడే తెలుగు అక్షరాలు కనిపించేవి. కాబట్టి అందరికీ విస్తరించలేదు. ఇది ఒక పరిధికే పరిమితమవ్వాల్సి వచ్చింది. ఇది రెండు దశబ్దాల కిందటి మాట.


ప్రస్తుతం

పరిస్థితులు మారాయి. ఇంటర్నెట్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. కంప్యూటర్ విజ్ఞానం అందరికీ చేరువైంది. ప్రాంతీయ భాషలతో ఇంటర్నెట్‌లో సమాచారం దొరుకుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా ప్రాంతీయ భాషలు కంప్యూటర్‌లో కనిస్తున్నాయి. ఇదంతా యూనికోడ్ మహత్యం. ఈ యూనికోడ్ సాయంతోనే డిజిటల్ తెలుగు ఇప్పుడు అంతర్జాల వేదికల్లో వెలుగుతున్నది. ఎంతలా అంటే భారతదేశంలో ఎక్కువ వాడుకలో ఉన్న అంతర్జాల ప్రాంతీయ భాషల్లో తెలుగు మొదటి స్థానంలోకి వచ్చేంతగా.. ఇదీ ఇంటర్నెట్‌లో మన మాతృభాషకు దక్కిన గౌరవం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్లు అందించిన స్థానం.