మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jan 19, 2020 , 02:08:56

ఈ వారం రాశి ఫలాలు

ఈ వారం రాశి ఫలాలు

ఈ వారంలో ఈ రాశి వారికి పనులు సమయానికి పూర్తవుతాయి. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహసంతో పనులు చేస్తారు. మంచి ఆలోచనలు వస్తాయి. సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో కలిసివస్తుంది. అందరితోనూ సమన్వయంతో ముందుకు వెళతారు. పై అధికారుల ఆదరణ, సహాయ సహకారాలు లభిస్తాయి.

మేషం : ఈ వారంలో ఈ రాశి వారికి పనులు సమయానికి పూర్తవుతాయి. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సాహసంతో పనులు చేస్తారు. మంచి ఆలోచనలు వస్తాయి. సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో కలిసివస్తుంది. అందరితోనూ సమన్వయంతో ముందుకు వెళతారు. పై అధికారుల ఆదరణ, సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రమోషన్‌లు, అనుకున్న ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్‌లు జరగవచ్చు. రాజకీయాల్లోని వారికి పై వారితో సత్సంబంధాలు ఉంటాయి. కార్యకర్తలతో, ప్రజలతో అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో హాయిగా వుంటారు.

వృషభం : వారంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి. అనాలోచితంగా ఏ పనీ చేయకూడదు. వారాంతంలో శని రాశి మార్పు వల్ల కొంత కలిసివస్తుంది. ప్రయాణాల వల్ల  అలసట, అనారోగ్యం, అనవసరమైన ఆలోచనలు. వ్యాపారంలో పని ఒత్తిడి ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి రాదు. నిత్యవ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఈ వారం ముఖ్యంగా తన పని తాను చేసుకుంటూ దేవతా గురుభక్తి పెంచుకోవడం,  మంచి వారి స్నేహం పెంపొందించు కోవడం చాలా అవసరం.

మిథునం : ఈ వారంలో ఈ రాశి వారికి వాహనాల మూలంగా పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువులు ఇంటికి రావడం  తద్వారా చాలా విషయాలపై చర్చాగోష్టులుంటాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో నలుగురి సహాయాన్ని పొందుతారు. మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారం అనుకూలిస్తుంది.


కర్కాటకం : సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి పనులు కలిసివస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. క్షేత్రాలను సందర్శిస్తారు. డబ్బు సకాలంలో అందుతుంది. వారాంతంలో డబ్బు విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. పనివారితో అనుకూలత వల్ల పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరు వల్ల కొన్ని పనులు కలిసి వస్తాయి. ఉపాధ్యాయ, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది.  ముఖ్యంగా ఈ వారం ఖర్చుల నియంత్రణ అవసరం.  దేవతా గురుభక్తి మీద శ్రద్ధ చూపడం కలిసివస్తుంది.


సింహం :ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. శ్రద్ధతో పనులు చేస్తారు. పనులలో నిమగ్నమై ఉత్సాహంతో ఉంటారు. అరారోగ్య సమస్యలు దూరమవుతాయి. పై చదువులు అనుకూలిస్తాయి. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక సమస్య ఉన్నప్పటి పనులు నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌లు, అనుకూలమైన పనులు ఆఫీసులో అధికారులు అప్పజెప్పడం, తద్వారా మంచి పేరును పొందుతారు.


కన్య : ఈ రాశి వారికి ఈ వారంలో స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో కొన్ని పనులు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. వారాంతంలో శని రాశి మార్పు వల్ల కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో మంచి పేరు మూలంగా కొంత మంచి జరుగుతుంది. కొన్ని పనులలో అనుకూలత ఏర్పడుతుంది. నిత్యవ్యాపారంలో శ్రద్ధ అవసరం. అనాలోచిత పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిది.


తుల :ఈ వారంలో కుటుంబ సభ్యులతో  హాయిగా వుంటారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి బాగా కలిసివస్తుంది. ఆదాయం పెరుగుతుంది. సభలకు, సమావేశాలకు హాజరవుతారు. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయవాద, వైద్య వృత్తుల్లోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. పనులు నెరవేరుతాయి. పెద్దల సహాయ సహకారాలు అన్ని విధాలుగా లభిస్తుంది. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. ఈ వారాంతం శని రాశి మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.


వృశ్చికం :ఈ వారంలో ఈ రాశి వారు సభలకు, సమావేశాలకు హాజరవుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సాహిత్య, సినిమా రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. సంతృప్తిగా వుంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగంలో ఉన్న వారికి ఆఫీసులో అందరితోనూ సమన్వయం ఏర్పడుతుంది. పైఅధికారుల ఆదరణ, సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ప్రమోషన్‌లు, అనుకున్న ప్రాంతాలకు బదిలీలు ఉంటాయి.  నులు సకాలంలో పూర్తవుతాయి. పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.


ధనస్సు : ఈ వారంలో ఈ రాశి వారికి గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యులతో హాయిగా ఉంటారు. సంగీత, సాహిత్య,సినిమా రంగాలలో ఉన్న వారికి కలిసివస్తుంది.   వారాంతంలో శని రాశి మార్పు వల్ల డబ్బు విషయంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు . డబ్బు ఇవ్వడం, తీసుకోవడం విషయంలో జాగ్రత్తలు అవసరం. పనులలో కాలయాపన, సమయానికి పూర్తి కాకపోవడం. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.


మకరం : ఈ వారంలో ఈ రాశి వారికి ఇంట్లో కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. అన్ని విధాలుగా సంతృప్తిగా, హాయిగా గడుపుతారు. సంగీత, సాహిత్యం, సినిమా రంగాల్లోని వారికి కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. తద్వారా మానసిక సంతృప్తి ఉంటుంది. స్నేహితులు, బంధువులు ఇంటికి రావడం, చర్చలు, తద్వారా కొన్ని పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కొంత వరకు అనుకూలిస్తుంది. విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపాలి. అనుకున్న ఫలితాల కోసం శ్రమించాలి.


కుంభం : ఈ వారం శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి.  విద్యార్థులకు అనుకూలమైన వారం. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ప్రవేశ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచివారితో సంబంధాలు పెంపొందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగానే ఉంటుంది.   వారాంతంలో శని రాశి మార్పు వల్ల ఆర్థిక సమస్యలు ప్రారంభం కావచ్చు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి.


మీనం : ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.   ప్రమోషన్‌లు,   తోటి ఉద్యోగులతో సమన్వయం, మంచి మాట ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలుంటాయి. నిత్య   వ్యాపారం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో  సంతృప్తిగా వుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వారాంతంలో శని మార్పు శుభప్రదంగా ఉంది. బాగా కలిసి వస్తుంది. పనులలో ఆలస్యం దూరమవుతుంది. పనివారితో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. నలుగురిలో మంచి పేరు ఉండడంతో కొన్ని పనుల్లో అనుకూల ఫలితాలుంటాయి.


logo