మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

వాస్తు

వాస్తు

చిన్న కుటుంబాల వారు ఎందరో చిన్నచిన్న గదులు కట్టుకొని నివసించడం మనం చూస్తుంటాం. అలా ఒక గదికి ఒక ద్వారం రావడం దోషం కాదు. అలా అంటే ప్రతి ఇంట్లో పడక గదులకు ఒక ద్వారమే కదా ఉంటుంది. రెండు ద్వారాలు రావాలి అంటే వద్దు అనము కానీ ఇంట్లో ఏ గదికి రెండు ద్వారాలు పెడుతున్నారు అనేది ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంటుంది

మహిమలు, మంత్రాలు లేవంటారు కదా! మరి వాస్తు ఎలా ఉంటుంది?-రాచకొండ శ్రీధర్, చౌటుప్పల్

మహిమను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్రకృతిలో ప్రతీదీ మహిమాన్వితమే. ఏది జరుగుతుందో కన్న తల్లికే తెలియదు తన కడుపులో ఒక అద్భుత రూపం దాల్చుకొని కొడుకు పుడతాడని. అది మహిమ కాదా. రాళ్లను, బ్లేడులను అరిగించే జీర్ణకోశం తాను మాత్రం అరగకుండా ఉంటుంది. పసికందు నుండి వంద ఏండ్ల వరకు ఎంత లావు ఎక్కినా చర్మం తదనుగుణంగా వ్యాకోచం చెందుతుంది. ఏనుగు పిల్ల చర్మం పెద్ద ఏనుగు అయ్యేంత వరకు కడుపులోకి వెళ్లినమందు కాలినొప్పిని తగ్గిస్తుంది. దానికి ఎవరు చెప్పారు అడ్రస్ అలా భూమిలో ప్రతికణం, కణం మహిమాన్వితమే. పక్కపక్కనే నాటినా మిరపగింజ చెరుకుగడలు తమ గుణాలు మార్చుకోవు. మహిమలంటే ఇంద్రజాలం అని మీరు భావించవద్దు. అలా వాస్తు శాస్త్రం ప్రకృతి ఆత్మగా తన అద్భుతాలు చేస్తుంది. దాని వెనుక నిగూఢ శక్తుల సమన్వయం ఉంటుంది. గొంగళి పురుగు సీతాకోక చిలుక అవ్వదా?


ఇంట్లోని నీళ్లు తూర్పు నుండి పడమరకు పోవచ్చా?-అభిరామ్, ఇల్లందు

వాడుక నీరు వర్షం నీరు, ఏదైనా తూర్పు ఉత్తరం నుండి వెళ్లాలి అనేది ఒక ప్రచార వాక్యం. అది నిజమే అయినా అలా అన్ని ఇండ్లకూ కుదురదు. ఆ మూలాగ్రం సహేతుకంగా వాస్తు శాస్ర్తాన్ని అధ్యయనం చేస్తే ఎవరూ అలా అనరు. మనిషి మనిషికి మనోగతమైన, వ్యావహారికమైన తేడా ఉన్నట్లే ప్రతి ఇంటికి తేడా ఉంటుంది. పడమర ఇంటికి, దక్షిణం ఇంటికి అటు తూర్పు ఉత్తరం ఇతరుల ఇండ్లు, కాంపౌండు వాల్స్ వచ్చి మనల్ని పరిమితం చేస్తాయి. అలాంటప్పుడు భౌగోళికంగా ఉన్న వీలును బట్టి దక్షిణం గృహం వారు దక్షిణం ఆగ్నేయం నుండి బయటకు వాడుక నీళ్లు పంపవచ్చు. అలాగే పడమర ఇండ్లు ఉన్నవారు పశ్చిమ వాయవ్యం నుండి ఇంట్లోని నీరును బయటకు పంపి వేయవచ్చు. అంతేకానీ తూర్పు నుండి తిప్పాలని ఉత్తరం నుండి తిప్పాలని ఇబ్బందులు పడవద్దు.


గదికి ఒక్క డోరు మాత్రమే పెట్టొచ్చా? రెండు అవసరమా?-చింతకింది అభిరామ్, చింతల్

చిన్న కుటుంబాల వారు ఎందరో చిన్నచిన్న గదులు కట్టుకొని నివసించడం మనం చూస్తుంటాం. అలా ఒక గదికి ఒక ద్వారం రావడం దోషం కాదు. అలా అంటే ప్రతి ఇంట్లో పడక గదులకు ఒక ద్వారమే కదా ఉంటుంది. రెండు ద్వారాలు రావాలి అంటే వద్దు అనము కానీ ఇంట్లో ఏ గదికి రెండు ద్వారాలు పెడుతున్నారు అనేది ముఖ్యంగా ఆలోచించాల్సి ఉంటుంది. దక్షిణం, పడమరల్లో గదులు వేసినప్పుడు దక్షిణం ఆగ్నేయం గదికి, పడమర వాయవ్యం గదికి మాత్రమే బయటకు ద్వారాలను ఏర్పాటు చేసుకోవాలి. తద్వారా అవి ఇంటికి ఉచ్చస్థానాలై ఉత్తమ గదులను అందిస్తాయి. నైరుతి గదికి దక్షిణం పడమర ఎటువైపు కూడా బయటకు ద్వారం మంచిది కాదు. కారణం అది గృహం మొత్తానికి నీచస్థానం అవుతుంది.


ఒక గదిలో రెండు టాయిలెట్లు ఏ దిశలలో పెట్టుకోవాలి? అట్లనే అన్ని రూములల్ల టాయిలెట్ ఇవ్వచ్చా?- అడవి సునీత, రాజాపేట

ప్రతి గదికి టాయిలెట్ ఇండ్లల్లో కుదరదు. కారణం ఇల్లంతా ఒక శరీరంగా భావిస్తే ఉత్తరభాగం, తూర్పుభాగం, ఈశాన్య భాగం వచ్చే గదుల్లో టాయిలెట్లు ఇవ్వడం మంచిది కాదు. ఆ విధంగా చూసినప్పుడు అన్ని గదులందు లెట్రిన్‌లు అసాధ్యం. ఇంటికి తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ముఖభాగం (ఉచ్ఛం) అవుతాయి. అందుకే శరీరంలో బొడ్డు కన్నా కిందికే విసర్జన అవయవాలు ఉంటాయి. ప్రతి గదిలో రెండు టాయిలెట్లు సహజంగా అవసరం ఉండదు. కానీ మీరెందుకు అడుగుతున్నారో తెలియదు. గది విశాలంగా ఉన్నప్పుడు ఆగ్నేయంలో ఉన్న స్థలాన్ని చూసి ఆ ప్రదేశంలో ఒకటి వాయవ్యంలో ఒకటి వేసుకోవచ్చు. రెండు ఒకే చోట ఒకదాని పక్కన ఒకటి రావాలి అంటే గది దీర్ఘచతురస్రంగా ఉంటే తూర్పు ఆగ్నేయంలో కానీ పడమర వాయవ్యంలో కానీ వేసుకోవచ్చు. నైరుతిని, ఈశాన్యాన్ని టాయిలెట్లకు వాడుకోవద్దు. ఎన్ని టాయిలెట్లు వేసుకున్నా అవి ఆ గదిలోని వారే వాడాలి ఇతర గదులకు వాటిలో ఏ ఒక్క దానిని అనుసంధానం చేయవద్దు.


సుద్దాల సుధాకర్ తేజ
[email protected]
Cell: 7993467678


logo