శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Jan , ,

మృత్యుముఖంలో ...

మృత్యుముఖంలో ...

ఆబలిష్టమైన, బరువైన ఇనుప తలుపు పక్కకి తొలగేదాకా నేను బయటే వేచి ఉన్నాను. తర్వాత యూనిఫాంలోని జైలు గార్డ్ వెనుక లోపలకి నడిచాను. పొడవైన కారిడార్లో ఆఖరి సెల్‌కి చేరుకున్నాను. అది మరణశిక్ష అమలు పరిచే వారిని ఉంచే సెల్. గార్డ్ అందులోని ఖైదీతో చెప్పాడు.స్నేక్! నిన్ను చూడటానికి ఎవరో వచ్చారు.బంక్‌మీద కూర్చున్న అతని రెండు చేతులమీద పడగ విప్పిన తాచుపాము పచ్చబొట్లు ఉన్నాయి. అతను చదివే కామిక్ పుస్తకంలోంచి తలెత్తకుండా చెప్పాడు.నేను ఎవర్నీ చూడదలచుకోలేదు. వెళ్ళమను.

ఆబలిష్టమైన, బరువైన ఇనుప తలుపు పక్కకి తొలగేదాకా నేను బయటే వేచి ఉన్నాను. తర్వాత యూనిఫాంలోని జైలు గార్డ్ వెనుక లోపలకి నడిచాను. పొడవైన కారిడార్లో ఆఖరి సెల్‌కి చేరుకున్నాను. అది మరణశిక్ష అమలు పరిచే వారిని ఉంచే సెల్. గార్డ్ అందులోని ఖైదీతో చెప్పాడు.స్నేక్! నిన్ను చూడటానికి ఎవరో వచ్చారు.బంక్‌మీద కూర్చున్న అతని రెండు చేతులమీద పడగ విప్పిన తాచుపాము పచ్చబొట్లు ఉన్నాయి. అతను చదివే కామిక్ పుస్తకంలోంచి తలెత్తకుండా చెప్పాడు.నేను ఎవర్నీ చూడదలచుకోలేదు. వెళ్ళమను.


హేరీ! నీతో కొన్ని నిమిషాలు మాట్లాడాలి నేను మృదువుగా చెప్పాను.ఎవరు నువ్వు? ప్రీస్ట్‌వా? నాకు సువార్తలు, బోధనలు అవసరం లేదు. నాక్కావాల్సింది నా ప్రాణాన్ని రక్షించే వాళ్ళు. నువ్వా పని చేయలేవు కాబట్టి, వెళ్ళవచ్చు అతను కఠినంగా చెప్పాడు.నన్ను లోపలకి రానిస్తే కొన్ని నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. ఎక్కువ సమయం తీసుకోను హేరీ! చెప్పాను.చివరకి అతను అంగీకరించడంతో గార్డ్ ఆ సెల్ తలుపు తెరిచాడు. హేరీ ఇన్సెన్ గత రెండేండ్లుగా జైల్లో ఉన్నాడని నాకు కొద్ది రోజుల క్రితమే తెలిసింది. వెంటనే వచ్చాను. నీకు బంధుమిత్రులు ఎవరూ లేరా హేరీ? మృదువుగా అడిగాను.లేరు. నా పేరు హేరీ కాదు. పేపర్లు నాకు స్నేక్ అనే పేరు పెట్టినప్పటి నించి నా పేరు అదే. ఎందుకు? అడిగాడు.నిన్ను కలవడానికి వచ్చిన మొదటి వ్యక్తిని నేనే అని గార్డ్ చెప్పాడు. నీకు మిత్రులు ఎవరూ లేరా? మరోసారి అడిగాను.జవాబు చెప్పలేదు.సరే స్నేక్! నన్ను నీ మిత్రుడిగా భావించు. అనేకమంది ఖైదీలను కలిసిన సోషల్ వర్కర్‌గా నేను నీ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోగలను.నువ్వు చెప్పింది అబద్ధం. నా మానసిక స్థితిని ఎలా తెలుసుకోగలవు? నిన్ను రెండు రోజుల్లో చంపబోతున్నారా? ఇదే జైల్లో ఇరవై ఏండ్ల క్రితం మా నాన్నకి తను చెయ్యని నేరానికి మరణశిక్షని విధించారు చెప్పాను.చెయ్యని నేరానికి? హు. మరణశిక్షకు గురైన ప్రతీవాడు చెప్పే మాటే అది. కానీ, నేను మాత్రం నా నేరాన్ని అంగీకరిస్తున్నాను. నేను వాళ్ళలా పిరికివాడిని కాను. పోలీసుని చంపితే విధించే శిక్ష ఒక్కటే. మరణశిక్ష.కానీ, మా నాన్న నిర్దోషని నాకు, మా నాన్నకి తెలుసు. హత్య జరిగిందని చెప్పిన సమయంలో ఆయన మా దగ్గరే ఉన్నాడు.

అలాంటప్పుడు మరణశిక్ష ఎందుకు పడింది?భార్యగా మా అమ్మకు సాక్షిగా వెళ్లే అర్హత లేదు. నేను చాలా చిన్నవాడిని కాబట్టి, నా సాక్ష్యం కూడా పనికి రాదన్నారు. ఆ యువతిని మా నాన్న రివాల్వర్‌తో కాల్చి చంపారు. అరెస్ట్ చేసేదాకా మా నాన్నకి తన రివాల్వర్ పోయిందని తెలీదు. హత్య జరిగిన రాత్రి ఆయన మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళాడు. కానీ, మాకు తెలిసిన వాళ్ళెవరూ ఆ రాత్రి ఆ థియేటర్‌లో లేరు చెప్పాను.అది విచారించతగ్గదే. ఇక నువ్వు వెళ్ళవచ్చుస్నేక్ కఠినంగా చూస్తూ చెప్పాడు.సారీ! నా కష్టాలని నీతో చెప్పుకోకూడదు. ఆ కారణంగానే నేను సోషల్ వర్కర్‌ని అయ్యాను.ఇక నువ్వు చెప్పేదేం నేను వినదలచుకోలేదు. కాబట్టి వెళ్ళు.బయట ఎవర్నయినా కలిసి, నువ్వు చెప్పేది ఏదైనా చెప్పనా?అవసరం లేదు. గార్డ్! ఇతన్ని ఇంక తీసుకెళ్ళు గట్టిగా అరిచాడు.

స్నేక్! నీకు ఒక్క మిత్రుడు కూడా లేడంటే నమ్మను. వాళ్ళకి నువ్వేదైనా చెప్పడానికి లేదన్నా నమ్మను.బెన్నీ ఉన్నాడు కొద్దిసేపు ఆగి నెమ్మదిగా చెప్పాడు.మరి, ఇంతకాలం నిన్ను చూడటానికి ఎందుకు రాలేదు?అది నీకు అనవసరం. ఇక వెళ్ళు.మర్నాడు నేను పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళి పాత దినపత్రికలు తీసుకుని స్నేక్ అరెస్ట్, విచారణ వార్తలు చదివాను. ఎక్కడా బెన్నీ లేదా బెంజ్‌మన్ పేర్లు లేవు. అక్కడి నుంచి స్నేక్ నివసించిన ఇంటి ప్రాంతానికి వెళ్ళాను. స్నేక్ అరెస్ట్‌కి మునుపు అశుభ్రంగా ఉన్న రోడ్డులోని ఎలుకలు తిరిగే అపార్ట్‌మెంట్ బిల్డింగ్‌కి వెళ్ళాను. ఎవరూ అతని గురించి చెప్పలేకపోయారు. చుట్టుపక్కల బార్లకి వెళ్ళి విచారిస్తే స్నేక్ తెలిసిన అనేకమంది బార్ టెండర్స్ పోలీస్ ఆఫీసర్‌ని చంపిన స్నేక్‌ని హీరోగా భావిస్తున్నారు. ఎవరికీ బెన్నీ తెలీదు.మేక్స్ పూల్ రూంకి వెళ్ళండి. స్నేక్ అక్కడ పేకాటలో ఉచితంగా డ్రింక్స్‌ని గెలుచుకునే వాడు. అక్కడి బార్ టెండర్ పేరు బెన్నీ అని చెప్పినట్లు గుర్తు ఓ బార్ టెండర్ సలహా ఇచ్చాడు.

బెన్నీ! నీ ఫ్రెండ్ స్నేక్ గురించి మాట్లాడాలని వచ్చాను అతన్ని కలిసి చెప్పాను.నాకు స్నేక్ అనే మిత్రుడు ఎవరూ లేరు బెన్నీ బదులు చెప్పాడు.స్నేక్‌కి రేపే మరణశిక్ష పడేది. అతను తన ఫ్రెండ్‌గా ఒక్క నీ పేరే చెప్పాడు. స్నేక్ నా ఫ్రెండ్ కాదు. వాడు చావడం వల్ల నాకెలాంటి బాధ, సానుభూతి లేదు. వాడికి తాగాక మాట్లాడటానికి ఓ మనిషి కావాలి. నాతో ఆ మత్తులో అనేక విషయాలు చెప్పేవాడు. వాటిని ఎవరికైనా చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించే వాడు బెన్నీ అరిచాడు.ఎలాంటి విషయాలు చెప్పేవాడు? ఆసక్తిగా అడిగాను. అతను సందేహిస్తూంటే చెప్పాను.రేపు అతనికి మరణశిక్ష కాబట్టి, నీకు ఎలాంటి ఇబ్బందీ రాదు. చెప్పు. ఫర్వాలేదు.తను ఎవర్నయినా ఎలా చంపాడో చెప్పి, నువ్వు పిరికిపందవి. నువ్వా పని చేయలేవు అనేవాడు. మర్నాడు పేపర్లో అతను చంపిన వాళ్ళ వివరాలు వచ్చేవి. కాబట్టి, అతను అబద్ధాలు చెప్పలేదు. కానీ, ఆ విషయం నేను ఎవరికైనా చెప్తే నన్ను చంపేస్తానని బెదిరించే వాడు.అంటే, అతను చంపిన మొదటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ కాదా? అడిగాను.కాదు. అంతకు మునుపు చాలామందిని చంపాడు.ఎందుకు?

సరదాకి అని చెప్పేవాడు. తనకి సంబంధం లేని కొత్తవాళ్ళని, తను ఎన్నడూ వెళ్ళని కొత్తచోటుకి వెళ్ళి చంపుతానని చెప్పేవాడు. పోలీసులు హత్యకి కారణం కోసం వెదికినప్పుడు స్నేక్‌కి ఎలాంటి కారణం ఉండదు.నేను సోషల్ వర్కర్‌గా చాలామంది కరడుగట్టిన హంతకులను చూశాను. కానీ, స్నేక్ లాంటి కిరాతక హంతకుడ్ని చూడక పోవడంతో షాక్ అయ్యాను.నేను హైస్కూల్లో ఉన్నప్పటి నుంచే స్నేక్ నాతో ఇలాంటివి చెప్పేవాడు. వాడు అప్పట్లో దొంగ మాత్రమే. ఓ రాత్రి ఓ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేస్తూండగా ఓ యువతి అప్పుడే తన ఇంట్లోకి వచ్చింది. తనని చూసిన ఆ సాక్షిని చంపేసాడు.

ఎంతకాలం క్రితం బెన్నీ? అడిగాను.ఇరవై ఏళ్ళ క్రితం. మేమింకా అప్పుడు హైస్కూల్లోనే ఉన్నాం.అది ఎక్కడ జరిగింది?రిట్జ్ హోటల్ పక్క సందులో అని గుర్తు.అది నువ్వు పోలీసులకి ఎందుకు చెప్పలేదు? బెన్నీ కాలర్ పట్టుకుని ఉద్రేకంగా అడిగాను.బెన్నీ భయపడ్డాడు.
చెప్పాగా. చెప్తే వాడు నన్నూ చంపేస్తాడని.అందువల్ల ఓ అమాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరిపారని, అతనికి మరణశిక్ష విధించారని నీకు తెలుసా?తెలుసు. నేను స్నేక్‌కి ఆ సంగతి చెప్తే వాడు నవ్వేసి, ఇంక తనకి భయం లేదని, ఒకే నేరానికి ఇద్దరిని ఉరి తీయరని చెప్పాడు.దుర్మార్గుడా! నేను నా కోపాన్ని అణచుకోలేక బెన్నీ మొహం మీద పిడికిలితో బలంగా మోదాను.అతను నాలుగు అడుగులు వెనక్కి వేసి ఓ వైన్ కేస్‌మీద పడ్డాడు.

మరోసారి జైల్లోని బలిష్టమైన ఆ తలుపు తెరచుకుంది. యూనిఫాంలోని గార్డ్‌తోపాటు నేనా కారిడార్లో మరోసారి నడిచాను. ఆఖరి సెల్‌కి చేరుకున్నాక అతను నాతో చెప్పాడు.నువ్వు అనేకసార్లు ఈ జైల్‌కి సోషల్ వర్కర్‌గా వచ్చావు. నువ్వెంతో మంచివాడివని ఖైదీలు చెప్పేవారు. కానీ, ఇరవై ఏళ్ళ క్రితం మరణశిక్ష పడ్డ జాన్సన్ కొడుకువని నాకు తెలీదు. నేను మీ నాన్నని ఎలక్ట్రిక్ చెయిర్ దగ్గరకి తీసుకెళ్ళిన వాళ్ళల్లో ఒకడ్ని. నీ కేసు విచారణలో ప్రాసిక్యూటర్, ఇతని రక్తంలోనే నేరస్వభావం ఉంది. ఇతని తండ్రి జాన్సన్ ఓ యువతిని కాల్చి చంపాడు. ఇతను బెన్నీ అనే అపరిచితుడ్ని చంపాడు. అంటే, ఇతని రక్తంలోనే నేరస్వభావం ఉంది అంటే, మీ డిఫెన్స్ లాయర్ అందుకు అభ్యంతరం చెప్పాడు. కానీ, ఇక్కడ నేను అదే మాటన్నా అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. మీ నాన్న రక్తంలోలా నీ రక్తంలో కూడా నేరస్వభావం ఉంది. లేదా ఓ అమాయకుడ్ని ఎందుకు చంపుతావు?నేనా డెత్ సెల్‌లోకి వెళ్ళాక గార్డ్ కోపంగా తలుపు మూసాడు.(విలియం పాడడ్లీ కథకి స్వేచ్ఛానువాదం)

-మల్లాది వెంకట కృష్ణమూర్తి