20 years of TRS | CM KCR | అయ్యో ముత్తన్నా.. నువ్వెందుకు కష్టపడి వచ్చినవే ఈడిదాక. చెప్పంపుతే నేను వచ్చేవాణ్ని కదా – ఇదీ మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి, క్యాన్సర్‌తో బాధపడుతూ తన వద్దకు వచ్చినపుడు కేసీఆర్ అన్నమాట. ఇద్దరూ ఒకే జిల్లాకు, ఒకే పార్టీకి చెందిన వారు కావడం వల్ల కొన్ని అభిప్రాయభేదాలు సహజం. కానీ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ అన్నీ మరిచిపోయారు. ముత్యంరెడ్డిని అమెరికాకు పంపి అత్యాధునిక చికిత్స చేయించారు. ఆయన్ను పార్టీలో చేర్చుకుని రైతు సమితి అధ్యక్షుడిగా నియమించి గౌరవించారు.
ఒక్క ముత్యంరెడ్డే కాదు; సిద్దిపేటలో కేసీఆర్‌కు ప్రత్యర్థులుగా నిలిచిన మారెడ్డి శ్రీనివాసరెడ్డి, స్వామిచరణ్, నిమ్మ నర్సింహారెడ్డి వంటి వారంతా తర్వాత ఆయనకు అనుంగు మిత్రులు, సహచరులైపోయారు. తెలంగాణ అనే గమ్యం చేరిన తర్వాత, ప్రత్యేక రాష్ర్టాన్ని సమర్థించిన వారు, వ్యతిరేకించిన వారు అన్న వింగడింపును ఆయన ఇష్టపడరు. 2009లో తెలంగాణ ప్రకటన తర్వాత, ఆంధ్రా నాయకులంతా రాజీనామాలకు దిగి, తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే, కేసీఆర్ ఎలాంటి ఆభిజాత్యాలూ పెట్టుకోకుండా కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి పోయారు. “ఉద్యమాన్ని నేను ఇక్కడి దాకా తెచ్చిన. దీన్ని కాపాడుకునే బాధ్యత నీది కాదా?” అని అడిగారు. ఆ సంభాషణే జేఏసీల ఏర్పాటుకు, ఉద్యమ కొనసాగింపునకు, రాష్ట్ర సాధనకు మరో ముందడుగు.
కరీంనగర్ ఉప ఎన్నిక వెయ్యి అలజడుల పెట్టు. అంత ప్రభావం చూపుతుంది. ఇది మనకు అంతిమ యుద్ధం. చావో, రేవో తేల్చుకుందాం. నేను మిమ్మల్ని జైలుకు పొమ్మంట లేదు. లాఠీ దెబ్బలు తినమంటలేదు. వ్యవసాయం, ఉద్యోగం, వ్యాపారాలు పాడు చేసుకోమని చెప్తలేను. చేయాల్సిందల్లా, మనమే ఒక రాజకీయ శక్తిగా ఎదగాలి.
– కేసీఆర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
trs plenary | కేసీఆర్ గురించి నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనాలు
20 Years Of TRS | ఇదీ కేసీఆర్ వ్యక్తిత్వం.. జయశంకర్ సార్ ఏమన్నారంటే..
20 years of TRS | కేసీఆర్ రోజువారీ షెడ్యూల్ ఎలా మొదలవుతుందో తెలుసా !
TRS@20 | ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ 20 ఏండ్లూ కేసీఆర్ యుగం
20 years of TRS | కేసీఆర్ దృష్టిలో ఫామ్‌హౌస్ అంటే ఏంటి?
trs plenary | భక్తిభావంలో ఆయనకు ఆయనే సాటి.. జిల్లాలు, ప్రాజెక్టులకు దేవతల పేర్లు