శనివారం 28 నవంబర్ 2020
Sunday - Nov 08, 2020 , 00:55:05

సిత్తరాల చిత్తరువులు!

సిత్తరాల చిత్తరువులు!

ఆణిముత్యాలన్నీ అలయ్‌-బలయ్‌ తీసుకొంటే.. చిత్తరువులన్నీ ఒక్కచోట చేరితే.. పట్నానికి పల్లె పరిమళం మోసుకొస్తే.. చూసేవారికి సంబురమే. రోజంతా సిత్రాల జాతరే. అలాంటి పల్లె జీవన చిత్రాలకు వేదికైంది రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం. చింతాకు పతకం, ముక్కెర ధరించి పెనిమిటితో ముచ్చటపెడుతున్న స్వచ్ఛమైన పల్లె జీవి.. ఒక చేతిలో దుడ్డుగర్ర, ఇంకో చేతిలో మర్రి ఆకు చుట్ట పట్టుకొని పశువుల కాస్తున్న మట్టి మనిషి.. ప్రత్యక్షంగా చూసినట్లు అనిపించే అనేక అద్భుత ఘట్టాల్ని ఆ ప్రదర్శన ఆవిష్కరించింది. 20 మంది చిత్రకారులు గీసిన 40 చిత్తరువులను సికింద్రాబాద్‌ పాస్‌పోర్ట్‌ రీజినల్‌ కార్యాలయంలోని ‘పోయెర్‌' ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టారు. పద్మారెడ్డి, కంది నర్సింహులు, అన్నారపు నరేందర్‌, గుర్రం మల్లేష్‌, ఐత రమణ, అభిరాం బైరు, కొండా శ్రీనివాస్‌, గంజి రమేష్‌, రఘు ఆకుల తదితరుల చిత్రాలు  కనువిందు చేస్తున్నాయి.