శనివారం 27 ఫిబ్రవరి 2021
Sunday - Nov 08, 2020 , 00:18:48

ఫ్యాషన్‌

ఫ్యాషన్‌

పైజమా...ఫార్మల్‌గా!

ఇంటి నుంచి పనిచేసే మహిళలకు కంఫర్ట్‌గా ఉండేవీ... ఫ్యాషనబుల్‌గా కనిపించేవీ పైజమా, షార్ట్స్‌. ఉదయం నుంచి సాయంత్రం వరకు కంప్యూటర్‌ ముందు కుర్చీలకే అతుక్కుపోయే వారికి ఈ రకమైన దుస్తులు సౌకర్యాన్ని కలిగిస్తాయి. వర్చువల్‌ మీటింగ్‌ కోసం ప్రత్యేకించి ఫార్మల్‌ డ్రెస్‌ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. వీటిలో, ఫ్లోరల్‌ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయి. 


నలుపు.. మెరుపు!

ప్రత్యేక సందర్భాల్లో ఇష్టమైన రంగు వస్ర్తాలను ధరించడం సాధారణమే. ఏరి కోరి ఎంచుకున్న చీర మీదికి, ఏ నగలైనా సొంపుగానే కనిపిస్తాయి. కానీ, కాటన్‌ వస్త్రాలు ధరించినప్పుడు చాలామంది నగలు వేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసమే బ్లాక్‌ మెటల్‌ ఆభరణాలు. సందర్భం ఏదైనా కుర్తా, జీన్స్‌, చీర, చుడీదార్‌.. అన్ని డ్రెస్‌లకూ నప్పేలా బ్లాక్‌ మెటల్‌ ఆభరణాలు ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్‌ అలంకరణలో కూడా అమ్మాయిలు నలుపునే ఇష్టపడుతున్నారు. మొబైల్‌ ఫోన్‌, హ్యాండ్‌ బ్యాగ్‌.. ఏదైనా బ్లాక్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ అనే అంటున్నారు. 


భేష్‌... హోమ్‌ షూస్‌!

కరోనా దెబ్బకు చిన్న చిన్న సంస్థల నుంచి కార్పొరేట్‌ కంపెనీల వరకు  ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు. కానీ, వైరస్‌ ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. తగిన జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అవుతుంది. చిన్నపాటి నిర్లక్ష్యమైనా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కూరల కోసమో, ఇతరత్రా వస్తువుల కోసమో మాస్కులతో బయటకు వెళ్తున్నారు జనం. కానీ, సమస్య పాదరక్షలలోనూ ఉన్నది. వీధి అంతా తిరిగిన చెప్పులతోనే, ఇంట్లోనూ తిరుగుతున్నారు. దీంతో, వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. వీధుల్లో చక్కర్లుకొట్టేవారితో పాటు.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్న వారికి ఉపయుక్తంగా ఉండేలా హోమ్‌ షూస్‌ మార్కెట్లోకి వచ్చాయి. వివిధ డిజైన్లతో ఇవి ఆకర్షిస్తున్నాయి. కొన్ని కంపెనీలయితే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ సిబ్బందికి ప్రత్యేక కానుకగా పంచుతున్నాయి. వీటి ధరలు డిజైన్లను బట్టి రూ.2వేల నుంచి రూ.18వేల వరకు పలుకుతున్నాయి. హ్యాండ్‌మేడ్‌, ప్రింటెడ్‌ క్రేప్‌, క్లాసిక్‌ శాండిల్స్‌ లాంటి నమూనాలు ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. మగవారి కోసం కూడా స్లిప్పర్స్‌, షూస్‌ లభిస్తున్నాయి. 


మాస్కు నగలు!

ఎంతైనా మహిళల తెలివితేటలే తెలివితేటలు! దేనికైనా కళాత్మకతను జోడించగలరు. దేన్నయినా ఓ ఆభరణంగా మార్చుకోగలరు. మాస్కు అనగానే.. ఓ సాదాసీదా గుడ్డ గుర్తుకొస్తుంది. కానీ, దాన్ని ఓ నగలా తీర్చిదిద్దుతున్నారు డిజైనర్లు. మాస్కు చుట్టుకుంటే ఆభరణం ధరించినట్టే. అది పూసల దండ కావచ్చు, బంగారు గొలుసూ కావచ్చు. 

VIDEOS

logo